అందంగా ఫోటోలు తీయాలనుకున్నవారికి బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్

|

మొబైల్ ఫోటోగ్రఫీలో ఎక్కువ నాణ్యతను పొందాలి అంటే కాస్త సమయం వెచ్చించక తప్పదు. ఫోటో అందంగా రావాలి అంటే ప్రకృతితో సాన్నిహిత్యం చెయ్యాలి. DSLR కెమరాలు అందుబాటులో లేనివారికి, ఎప్పటికప్పుడు అందమైన క్షణాలను గుర్తులుగా దాచుకోవడానికి మొబైల్ ఫోటోగ్రఫీ ఎంతో ఉపయుక్తకరముగా ఉంటుంది. ఫోటోగ్రఫీ అంటేనే కాంతి మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది. డేలైట్ లో, నైట్ వ్యూ లో అయినా సరైన లైటింగ్ అనేది ప్రముఖపాత్ర పోషిస్తుంది. మొబైల్ లో ఆ లైటింగ్ కు తగ్గ సెట్టింగ్స్ అందివ్వడంలో దాని పనితనం బయటపడుతుంది. ఉదాహరణకు నీటిమీద సూర్యరశ్మి, పగటివేళ పచ్చటి పైరు ఇలా చాలానే చెప్పవచ్చు. కాని ఆ అందమైన క్షణాలను మరింత అందంగా కెమరాలో బంధించడం అనేది మాత్రం తీసుకునే కొన్ని జాగ్రత్తలపై ఆధారపడిఉంటుంది. అవి ఏమిటో చూద్దాం.

 
 అందంగా ఫోటోలు తీయాలనుకున్నవారికి బెస్ట్ మొబైల్ ఫోటోగ్రఫీ టిప్స్

మొబైల్ ఎంపిక చేసుకొనుట:

చాలామంది మొబైల్ వినియోగదారులు ఎంత మెగాపిక్సెల్ కెమెరా ఉంది అని మాత్రమే చూసి కొంటారు కానీ పరిగణనలోనికి తీసుకోవలసిన చాలా విషయాలను విస్మరిస్తారు. అందులో Resolution, PPI (Pixel per inch), aspect ratio, EIS(Electronic Image stabilization), OIS (OPTICAL IMAZE STABILIZATION), ISO, aperture, PDAF, FPS, ఫ్లాష్లైట్ వంటి ఫీచర్లు మొబైల్ ఫోటోగ్రఫీకి ముఖ్యంగా కావలసినవి. ఇందులో OIS, gyroEiS ఉన్న ఫోన్లు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి. కాని EIS బడ్జెట్ మొబైల్ లో కూడా అందుబాటులో ఉంది. వీటివలన ఉపయోగం ఏమిటి అంటే కదులుతున్న వస్తువుని చిత్రీకరించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

ఇప్పుడు మొబైల్ లో డ్యూయల్ కెమరా, ఫ్రంట్,లేజర్ ఫ్లాష్, మూన్లైట్ అంటూ చాలాఫీచర్లను మొబైల్ కంపెనీలు అందిస్తున్నాయి. కనీసం ఫుల్ hdడిస్ప్లే, 400+ppi (పిక్సెల్ పర్ ఇంచ్)డెన్సిటీ, EIS, మినిమం F1.7aperture ఉండేలా మొబైల్ తీసుకోవడం ఉత్తమం. సెల్ఫీ కోసం వస్తున్న మొబైల్స్ లో వైడ్ యాంగిల్ వ్యూ, ఫ్రంట్ ఫ్లాష్ ఉండేలా చూసుకోవడం ఉత్తమం.

మొబైల్ ఫోటోగ్రఫీకి తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు :

లెన్స్ క్లీన్ చేసుకోవాలి:

లెన్స్ క్లీన్ చేసుకోవాలి:

దుమ్ము దూళి చేరడం వలన ఫోటోలు సరిగ్గా రావు, కావున ఫోటోలు తీసేముందు లెన్స్ క్లీన్ చేసుకోవడం మంచిది.

ఒక అందమైన ఆబ్జెక్ట్ ని ఫోటో తీసే సందర్బంలో అన్నిరకాల డైరెక్షన్స్ లో తోచిన విధంగా ఫోటో తీయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ patience అవసరం, మంచి outputరావాలి అంటే ఒకటికి పది ఫోటోలు తీసేలా ఉండాలి.

 

ఫోకస్

ఫోకస్

ఫోటోలను తీయునప్పుడు ఫోకస్ ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన విషయం. లేకుంటే ఫోటోలు సరిగ్గా రావు. panaroma, HDR మోడ్స్ లో ఫొటోస్ అవసరాన్ని బట్టి తీయాలి. అన్నీ వేళలా HDRలో తీసిన ఫొటోస్ workout కావు. ఇది దృష్టిలో ఉంచుకోవాలి.

ఫోటో తీసేముందు క్లారిటీ సరిగ్గారాని పక్షంలో ISO లెవల్స్ చేంజ్ చేస్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో తీసే ఫోటోలలో.

 

Exposure
 

Exposure

Exposureని మాన్యువల్ గా సెట్ చేసుకోవాలి. కొన్ని మొబైల్స్ లో ఫోకస్ సెట్ అయిన వెంటనే ఆటోమేటిక్ గా exposure సెట్ అవుతుంది. కాని కొన్ని మొబైల్స్ లో స్క్రీన్ టచ్ చెయ్యడం ద్వారా exposure లెవల్స్ మార్చడం చెయ్యవచ్చు. ఎక్కువగా రాత్రివేళల్లో, మరియు చీకటి ప్రదేశాల్లో తీసే ఫోటోలలో ఈ టెక్నిక్ ఉపయోగకరంగా ఉంటుంది.

బాక్గ్రౌండ్ ఎంపిక సరిగ్గా ఉండాలి. హై క్వాలిటీలో బాక్గ్రౌండ్ బ్లర్ చేయగలిగినా కూడా బాక్గ్రౌండ్ ఎంపిక సరిగ్గా లేకుంటే ఎంత అందమైన ఫోటో అయినా వెలితిగా ఉంటుంది.

 

zoom

zoom

zoom తీస్తే ఫోటోల క్లారిటీ తగ్గుతుంది. కావున ఎక్కువశాతం zoom చెయ్యకుండానే ఫోటో తీసేవిధంగా చూడండి.

సెల్ఫీ తీసుకునేవారు ఎక్కువగా angle సెటప్ పై ఫోకస్ పెట్టాలి. నేరుగా కెమరా ఉంచి తీయడం ద్వారా డిస్టెన్స్ వలన కావొచ్చు మరే ఇతర కారణాల వలన కావొచ్చు ఫొటోస్ అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. అందుకనే ఎక్కువమంది సైడ్ కాని up వ్యూ లో ఫొటోస్ తీయడానికి ఇష్టపడుతారు.

 

ఎక్కువగా కదలకుండా..

ఎక్కువగా కదలకుండా..

కెమెరా ఎక్కువగా కదలకుండా ఉంచడం మంచిది. OIS,EIS సర్వీసెస్ అన్నీ మొబైల్స్ లో ఉండవు . ఉన్నా కూడా అన్నీ వేళలా అనుకూలంగా ఉండదు. కావున ఫోటో తీయునప్పుడు కదలకుండా స్టడీగా ఉండేలా చూసుకోవాలి.

ఒక్కోసారి కొన్ని లైట్ రిఫ్లెక్షన్స్ చాలా బాగా పనిచేస్తాయి. రిఫ్లెక్షన్స్ ను అనుసరించి తీసే ఫోటోలు అద్బుతంగా వస్తాయి.ఇక్కడ ఒకటికి పది ఫోటోలు తీయగలిగే patience ముఖ్యం.

 

కొన్ని ఆప్షనల్ థర్డ్ పార్టీ అప్లికేషన్లు :

కొన్ని ఆప్షనల్ థర్డ్ పార్టీ అప్లికేషన్లు :

Snapseed, Instagram, pixLR, Retrica, Camera MX, Camera FV-5, Cameringo, Camera fx zoom వంటి అప్లికేషన్ లు అద్బుతమైన ఫోటోలను అందించగలవు. మొబైల్ లో డీఫాల్ట్ గా లేని చాలా ఆప్షన్స్ ఈ అప్లికేషన్ల ద్వారా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Want to learn how to take great pictures on your phone? You'll be a pro in no time following these ten tips. More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X