Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

2015 లెక్కల ప్రకారం ప్రముఖ ఇమేజ్ షేరింగ్ సర్వీస్ Instagram వంద కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతోంది. ఈ ఇన్‌స్టెంట్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త కెవిన్ సిస్ట్రోమ్ 2010లో ప్రారంబించారు. వెబ్‌సైట్‌ను తొలిగా అక్టోబర్‌లో 2010లో ప్రారంభించారు. 2012లో 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఇన్‌స్టాగ్రామ్‌ను వాట్సాప్ సొంతం చేసుకుంది.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌ను అన్ని రకాల యూజర్లు ఉపయోగించుకుంటున్నారు. అనేక కంపెనీలు తమ పాపులారిటీని పెంచుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ల ఫాలో అవుతున్నాయి. మీ ప్రొఫెషనల్ అలానే పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లను మరింత ఎఫెక్టివ్ గా వాడుకునేందుకు పలు టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్‌ను మీ ముందు ఉంచుతున్నాం..

Read More : 8జీబి ర్యామ్‌తో లీఇకో ఫోన్, 29న మార్కెట్లోకి!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే పోస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే hashtag యాడ్ చేయటం తప్పనిసరి. హ్యాష్‌ట్యాగ్ అనేది క్లికబుల్ వర్డ్. ఫోటో వివరణ క్రింద ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి, ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చేసే ప్రతి పోస్టింగ్ క్రింద ఇలాంటి కామన్ హ్యాష్‌ట్యాగ్స్ ఉండేలా చూసుకోండి. #Love, #Instadaily, #Instagood

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బ్లాగ్ లేదా షాపింగ్ పోర్టల్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లయితే మీరు యాడ్ చేసే వీడియో లేదా ఫోటో టాపిక్‌కు చాలా దగ్గరగా ఉండాలి. ఆఫ్ టాపిక్ ఇమేజెస్‌ను పోస్ట్ చేయటం ద్వారా టార్గెటెడ్ వ్యూవర్స్‌ను మీరు చేరుకోలేరు.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ఇన్‌స్టాగ్రామ్‌ అనేది రియల్ టైమ్ బేసిస్‌లో పనిచేస్తుంది. కాబట్టి మీ పోస్టింగ్స్ రెగ్యులర్‌‌గా ఉండాలి.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ బ్లాగ్ లేదా షాపింగ్ పోర్టల్‌కు సంబంధించిన కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నట్లయితే మీరు టార్గెటెడ్ అకౌంట్‌లను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. మీ పోస్టింగ్స్‌కు #TeamFollowback #FollowBack వంటి డిస్క్రిషన్స్ ఇవ్వటం ద్వారా ఎక్కువమంది ఫాలోవర్స్ లబించే అవకాశం ఉంటుంది.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో లైక్ ఫీచర్ బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుని ఇతరుల పోస్టింగ్స్‌ను మీరు లైక్ చేయటం ద్వారా మీ పోస్టింగ్స్‌కు కూడా లైక్స్ లభించే అవకాశం ఉంటుంది.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

మీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను కేవలం ఫోటో ఎడిటింగ్‌కు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచి ఇన్‌స్టాగ్రామ్ ఫిల్టర్లతో ఫోటోలను ఎడిట్ చేసుకోండి, నెట్‌వర్క్ ఎర్రర్ చూపించటంతో అవి ఫోన్ గ్యాలరీలోనే సేవ్ అవుతాయి.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ ఇమ్యులేటర్ యాప్ సహాయంతో వ్యక్తిగత, ప్రొఫెషనల్ అవసరాలకు మల్టీపుల్ అకౌంట్‌లను రన్ చేసుకోవచ్చు.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

పలువురి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లకు సంబంధించిన బయోగ్రఫీలు కూల్ లైన్ బ్రేకప్స్ తో విభిన్నంగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఇలా మీకు కూడా కావాలంటే సింపుల్. కంటెంట్‌ను కావల్సిన విధంగా టెక్స్ట్ ఎడిటర్ లేదా ఎంఎస్‌వర్డ్ సహాయంతో ఎడిట్ చేసుకుని అదే కంటెంట్‌ను మీ ఇన్‌స్టాగ్రామ్ బయోగ్రఫీలో పోస్ట్ చేయండి సరిపోతుంది.

Instagram టాప్ టిప్స్ అండ్ ట్రిక్స్

మీరు పోస్ట్ చేసే ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు డీఫాల్టుగా జీయో ట్యాగ్స్‌తో పోస్ట్ అవుతుంటాయి. తద్వారా వేరుకురు మీ లోకేషన్‌ను సులువుగా యాక్సెస్ చేసుకునే వీలుంటుంది. సెట్టింగ్స్‌ను మార్చుకోవటం ద్వారా జియో ట్యాగ్‌లను రిమూవ్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Simple Tips and Tricks to Make the Best of Instagram!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot