ఆండ్రాయిడ్‌లో ఫేస్‌బుక్ వాడేవారికి ముఖ్యమైన టిప్స్

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వాడని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఫోన్ లేకుండా చాలామంది బతకలేరు. ఫోన్‌లో వాట్సప్ ,యూట్యూబ్ అలాగే ఫేస్‌బుక్ ఈ మూడు అంశాలు లేకుండా ఎవరూ స్మార్ట్‌ఫోన్ వాడరు. ముఖ్యంగా ఫేస్‌బుక్.. ఇది జనాల్ని ఎక్కడికో తీసుకెళుతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా దాని మీద కుస్తీలు పడాల్సిందే. అయితే ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫేస్‌బుక్‌ వాడేవారి కోసం కొన్ని టిప్స్ ఇస్తున్నాం వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more : మీకు తెలుసా..ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇవి చాలా ముఖ్యం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెక్యూరిటీ ( Manage your Account Security)

సెక్యూరిటీ ( Manage your Account Security)

మీ ఫేస్‌బుకి‌కి సెక్యూరిటీ చాలా అవసరం లేకుంటే ఎవరైనా దూరి అసభ్య పోస్టులు చేసే ప్రమాదం ఉంది .అందుకని సెట్టింగ్ లో కెళ్లి మీ సెక్యూరిటీని మరింత శక్తివంతంగా ఉండేలా చూసుకోండి. అక్కడ ఉన్న ఆప్సన్ అన్నీ ఓ సారి జాగ్రత్తగా చదివి మీకు కావలిసినివి సెట్ చేసుకోండి.

సేవ్ వీడియోస్ ( Save Videos and Links for later)

సేవ్ వీడియోస్ ( Save Videos and Links for later)

మీరు మీ ఫేస్ బుక్ పేజీలో వీడియోస్ ని సేవ్ చేసుకుని తరువాత చూడొచ్చు. అలాగే పోస్టును హైడ్ చేయవచ్చు. అన్ ఫాలో కావచ్చు. ఆ లింక్ మీకు బాటా నచ్చి మీరు బిజీలో ఉన్నట్లయితే దాన్ని అలా వదిలేయకుండా రైట్ సైడ్ క్లిక్ చేసి మీరు సేవ్ వీడియో అని సెలక్ట్ చేసుకుంటే మీకు కావలిసిన టైంలో దానిని చూడొచ్చు.

ఎలియమినేట్ ( Eliminate a friend’s posts)

ఎలియమినేట్ ( Eliminate a friend’s posts)

ప్రతి రోజు మీ ప్రెండ్స్ ఎంతోమంది తమ వాల్ లో పోస్టులు పెడుతుంటారు. అయితే అవి అందరికీ నచ్చకపోవచ్చు. వాటన్నింటిని చూడాలంటే మనకు కూడా డేటా బొక్క పడుతుంది. కాబట్టి వాటిని అన్ పాలో చేస్తే ఏ సమస్యా ఉండదు.

పోస్ట్స్ ( Prioritize a friend’s posts )

పోస్ట్స్ ( Prioritize a friend’s posts )

మీరు మీ ఫ్రెండ్స్ లో ఎవరివైనా ముందు మీరు చూడాలనుకుంటే వెంటనే మీరు టైమ్ లైన్ లో కెళ్లి అక్కడ ఫస్ట్ మనమే చూడాలనే ఆప్సన్ ఉంటుంది. దాన్నిసెలక్ట్ చేసుకుంటే మీరు మీ ఫ్రెండ్ వార్తలు ఏవీ మిస్ కారు.

షార్ట్ లిస్ట్ (Shortlist your favorite friends)

షార్ట్ లిస్ట్ (Shortlist your favorite friends)

మీరు మెసేంజర్ లో కెళ్లి మీకు కావాలిసిన ఫ్రెండ్స్ ని సెలక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రెండ్స్ తో ఛాటింగ్ చేసుకోవచ్చు

సెండ్ అవుట్ పోస్ట్స్ ( Use the widget to send out posts)

సెండ్ అవుట్ పోస్ట్స్ ( Use the widget to send out posts)

మీరు మీకు నచ్చినవిషేర్ చేయాలనుకుంటే అక్కడ షేర్ బటన్ ఉంటుంది. దాన్ని షేర్ చేసారంటే అదిమీ వాల్ లోకి వెళ్లిపోతుంది.

ప్రదేశాలు వెతకొచ్చు ( Check out famous places nearby)

ప్రదేశాలు వెతకొచ్చు ( Check out famous places nearby)

మీకు నచ్చిని ప్రదేశాలను అలాగే దగ్గర్లో ఉన్న ప్రదేశాలను మీ వాల్ లో సెర్చ్ నుంచి నుంచి వెతకొచ్చు.

సేవ్ బ్యాటరీ ( Save battery by using web app)

సేవ్ బ్యాటరీ ( Save battery by using web app)

క్రోమ్ బ్రౌజర్‌లో ఫేస్‌బుక్ వాడేవారు మీ బ్యాటరీని కూడా సేవ్ చేసుకోవచ్చు. మీరు క్రోమ్‌లో డైరెక్ట్‌గా ఫేస్‌బుక్‌లోకి వెళ్లడం ద్వారా మీరు మీ బ్యాటరీని సేవ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకుంటే అది ఎప్పుడూ ఆన్‌లో ఉండటం వల్ల మీ బ్యాటరీ తినేసే ప్రమాదం ఉంది.

డిసేబుల్ ( Disable Messenger chat heads )

డిసేబుల్ ( Disable Messenger chat heads )

మీరు ఛాటింగ్ వద్దనుకుంటే మీరు ఈ ఆప్సన్ ఎంచుకోవచ్చు.

షేర్ డైరక్ట్ యాప్స్ ( Share directly through other apps)

షేర్ డైరక్ట్ యాప్స్ ( Share directly through other apps)

మీరు మీ ఫేస్‌బుక్ పేజీ నుంచి యాప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు. వాటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 10 Facebook App Tips and Tricks for Power Users!
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot