Just In
- 15 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 18 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 20 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 22 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- News
YS Sharmila: పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పాదయాత్ర చేస్తా అంటున్న వైఎస్ షర్మిల.. సాధ్యమేనా?
- Sports
మెరిసిన స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్.. భారత్ ఘన విజయం
- Movies
బిగ్ బాస్ హమీదా ఓవర్ డోస్ బోల్డు షో: ఎద అందాలను ఆరబోస్తూ ఘాటుగా!
- Finance
Tata motors: టాటా మోటార్స్ షేర్లు డీ లిస్టింగ్.. మార్కెట్ వర్గాల్లో ఆందోళన.. ఇంతకీ ఏమైంది ?
- Automobiles
హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్ గురించి పూర్తి వివరాలు - ఇక్కడ చూడండి
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
గేమింగ్ క్లయింట్ Steam వినియోగించుటలో 10 ఆసక్తికరమైన టిప్స్
వాల్వ్ 1996లో స్థాపించబడిన ఒక గేమింగ్ సాఫ్ట్వేర్ సంస్థ. ప్రపంచంలో పలు అవార్డులు సైతం గెలుచుకున్న ఆటలను సృష్టించింది. ఈ valve, steam సాఫ్ట్వేర్ యొక్క సృష్టికర్త, ఈ steam ఎన్నోరకాల గేమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడంలో మరియ వేలకొద్దీ గేమింగ్ అప్లికేషన్స్ ను కమ్యూనిటీఫోరం ద్వారా ప్రపంచం మొత్తంమీద 65మిలియన్ వినియోగదారులకు చేరడంలో సఫలం అయింది.దీని డెస్క్టాప్ క్లయింట్ మీ గేమింగ్ లైబ్రరీని నిర్వహించడం, ప్రేక్షకులకు మీ ఆటసెషన్లను ప్రసారం చేయటం, ఇతర గేమర్స్ తో చాటింగ్ చేయడం వంటి అనేక విషయాలను చేయగలుగుతుంది. సంక్షిప్తంగా, steam అనేక ఆకర్షణీయమైన అంశాలు కలిగి ఉన్నా, నూతనంగా చేరిన మరియు దీర్ఘకాల వినియోగదారులచే గుర్తించబడవు. తద్వారా నెమ్మదిగా వినియోగం తగ్గుముఖం పట్టింది. Steam సంబంధించి వినియోగదారులు పెద్దగా గమనించని ఉపయోగకరమైన 10అంశాలు మీముందు ఉంచడం జరిగినది.

మీsteam అకౌంట్ ను సురక్షితంగా ఉంచండి:
మీరు మీ steam గార్డ్ ని ఎనేబుల్ చేయడం ద్వారా తెలియని pc నుండి steam అకౌంటు వినియోగిస్తున్నప్పుడు మీ అకౌంట్ ను వెరిఫై చేసుకోవడానికి మీకు ఒక స్పెషల్ యాక్సెస్ కోడ్ ఇవ్వబడుతుంది. ఇది మెయిల్ రూపంలో పంపబడుతుంది. లేదా మీsteam మొబైల్ అప్లికేషన్ ద్వారా పంపబడుతుంది. దీనిని ఎనేబుల్ చేయడానికి Settings>Account>Manage Steam Guard Account Securityవిభాగానికి వెళ్లి ఎనేబుల్ చేయండి

మీ గేమింగ్ లైబ్రరీ సరిచేసుకోండి:
డీఫాల్ట్ గా మీ గేమింగ్ లిస్టు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటుంది. కాని వాల్వ్, మీ గేమ్స్ ని కాటగిరీస్ వారీగా సెట్ చేసుకోవడానికి అవకాశo కల్పించింది. తద్వారా గేంమీద రైట్ క్లిక్ ఇచ్చి, కాటగిరీలో జతచేయవచ్చు. ఉదాహరణకి ఫైటింగ్, say, RPG's ect.. మరియు మీ గేమ్స్ పై రైట్ క్లిక్ ఇచ్చి ఫేవరెట్స్లో జతచేయడం మూలంగా మీలిస్టుల్లో టాప్ విభాగాన చూపబడుతాయి.

steam-సంబంధంలేని అప్లికేషన్స్ కూడా ఆడవచ్చు:
ఈవిషయం అనేకమంది వినియోగదారులకు తెలీదు. ఉదాహరణకి Star Wars:Battlefront II గేం steamలో ఉండదు. ఈ అప్లికేషన్ ను EAనుండి కొనుగోలు చెయ్యవలసి ఉంటుంది. ఇది మీ pc లో ఇన్స్టాల్ చేసాక, steam అప్లికేషన్ లో కింది వైపు ఎడమ విభాగంలో add a game విభాగం ద్వారా మీ pc గేం ని జత చేసుకునే వెసులుబాటు ఉంది.

ఫుల్ స్క్రీన్ లో ఎంజాయ్ చేయండి:
ఫుల్ స్క్రీన్ లో ఎంజాయ్ చేయండి:
వాల్వ్, తన స్టీం అప్లికేషన్ టీవీ మరియు పెద్ద మానిటర్స్ లో కూడా ఉపయోగించేందుకు వీలుగా తయారు చేసింది. ఇలా ఫుల్ స్క్రీన్ లో వీక్షించడానికి view>Big picture modeలో ఆక్టివేట్ చేసుకోవలసి ఉంటుంది.
steam క్లౌడ్ వినియోగించడం ద్వారా:
మీకు తెలుసా మీ గేం స్టాట్స్ ని సేవ్ చేసుకోవడానికి steam ప్రత్యేకంగా క్లౌడ్ సర్వీసెస్ కలిగి ఉందని. Settings>Cloud>Enable Steam Could Synchronizationలో ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీరు ఏ కంప్యూటర్ నుండి అయినా మీ steam అకౌండ్ ఉపయోగించి మీగేమ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. కాని ఈ ఫీచర్ అన్నీ గేమ్స్ కి అందుబాటులో లేదు.

మీ గేంలైబ్రరీని పంచుకోండి:
మీ గేంలైబ్రరీని 10మంది వరకు షేర్ చేసుకునే వెసులుబాటు కూడా steamలో ఉంది.Settings>Family లో ఎనేబుల్ చేసుకోవడం ద్వారా, వేరే యూసర్ రిక్వెస్ట్ ని అప్రూవ్ చేయడం ద్వారా మీ గేంలైబ్రరీని వీక్షించే సౌకర్యం కల్పించబడుతుంది. దీని ద్వారా మీ గేమ్స్ ని ఆ యూసర్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఆడుటకు వీలుగా ఉంటుంది.
ఫ్రేంరేట్స్ తనిఖీ చేయండి:
ఫ్రేంరేట్ ని తనిఖీ చేయడం ఆన్లైన్ గేమింగ్లో చేయవలసిన ముఖ్యమైన పని. మామూలుగా 60 FPS ఉంటే online గేమింగ్ కి అనువుగా ఉంటుంది. Settings>In-కి వెళ్లి FPS కౌంటర్ ని ఎనేబుల్ చేయడం ద్వారా స్క్రీన్ మీద ఫ్రేం రేట్ ఎంతఉందో చూపెడుతుంది.

Refund:
ఒక్కోసారి ఇష్టపడి కొన్న గేమ్స్ సరిగ్గా బూట్ కాకపోవడంవలన, ఏదేని హార్డ్వేర్ సమస్యల వలనకాని పనిచేయకపోవచ్చు. దీనికై వాల్వ్ తన వినియోగదారులకోసం రీఫండ్ పాలసీని అందుబాటులో ఉంచింది. తద్వారా అటువంటి గేమ్స్ ని రిటర్న్ చేసి తిరిగి డబ్బులు వాపసు పొందవచ్చు.
trade cards ద్వారా డబ్బులు సంపాదించండి:
మీరు గేమ్స్ ఆడడం ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. గేమ్స్ ఆడడం ద్వారా వచ్చే బాడ్జ్లను ప్రొఫైల్లో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు, ఈ బాడ్జ్ లు సంపాదించుట ద్వారా కొన్ని చాట్ ఎమోషన్స్ couponsకూడా పొందే అవకాశo ఉంది. ఒక్కోసారి ఈ కూపన్ కార్డ్స్ 5డాలర్లపైనే విలువను కలిగి ఉంటాయి. వీటిని steam లోనే అమ్మి డబ్బులు సంపాదించవచ్చు.

గేమ్స్ ని గిఫ్ట్ గా ఇవ్వండి:
గేమ్స్ అంటేనే ఒక వరం లాంటివి. కావున valve, వేరే వినియోగదారులకోసం కూడా మీరు గేమ్స్ కొనిచ్చే విధంగా ఏర్పాటు చేసింది. తద్వారా మీ స్నేహితులకు వారి ప్రొఫైల్ వీక్షించుట ద్వారా వారికి కావలసిన గేమ్స్ కొనుగోలు చేయవచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470