ఈ తప్పిదాలే మీ కొంపలు ముంచుతాయి !

Written By:

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య ఏదైనా ఉందంటే అదీ బ్యాటరీ సమస్యనే. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఫోన్ ఛార్జింగ్ ఉంటుందా..ఉండదా అనే టెన్సన్ ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అటువంటి సమయంలో ఎప్పటికప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే.

భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఫ్రీడం సేల్

ఈ తప్పిదాలే మీ కొంపలు ముంచుతాయి !

అయితే ఛార్జింగ్ విషయంలో కేర్ తీసుకోకుంటే బ్యాటరీ పేలిపోవడం లేకుంటే సరిగ్గా పనిచేయకపోవడం లాంటివి జరుగుతాయి. అందుకని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.మీ కోసం కొన్ని జాగ్రత్తలు ఇస్తున్నాం ఓ లుక్కేయండి.

ఆగని ఎయిర్‌టెల్ దూకుడు, 1000జిబి డేటా ఫ్రీ..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కంపెనీ చార్జ‌ర్‌నే

మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఖచ్చితంగా కంపెనీ చార్జ‌ర్‌నే వాడాలి. ఒక వేళ ఆ చార్జ‌ర్ అందుబాటులో లేక‌పోతే దాని వోల్టేజ్‌కు స‌మానంగా ఉండే మ‌రో చార్జ‌ర్‌ను వాడాలి.

ఏ చార్జ‌ర్‌తో ప‌డితే దాంతో చార్జింగ్ చేస్తే

కంపెనీతో వ‌చ్చిన చార్జ‌ర్ కాకుండా ఏ చార్జ‌ర్‌తో ప‌డితే దాంతో చార్జింగ్ చేస్తే బ్యాట‌రీ నాణ్య‌త త‌గ్గుతుంది. దాని లైఫ్ త‌క్కువ కాలం వ‌స్తుంది. దీంతో చాలా త్వ‌ర‌గా బ్యాట‌రీ మార్చాల్సి వ‌స్తుంది.

బ్యాక్ కేస్‌లు తీసివేయండి

ఫోన్‌ను చార్జింగ్ పెట్టే స‌మ‌యంలో బ్యాక్ కేస్‌లు తీసివేయండి. లేదంటే ఫోన్ చార్జింగ్ పెట్టిన‌ప్పుడు వ‌చ్చే హీట్ స‌రిగ్గా బ‌య‌ట‌కు పోక అది డివైస్ ప్ర‌దర్శ‌న‌పై ప్ర‌భావం చూపుతుంది. ఇలాంటి స్థితిలో ఒక్కోసారి ఫోన్లు పేలిపోయేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది.

వేరే ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను వాడితే బ్యాట‌రీ పేలేందుకు


చాలా మంది ఫోన్లు వేగంగా చార్జింగ్ అవ‌డం కోసం ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను, కెపాసిటీ ఎక్కువ‌గా ఉన్న చార్జ‌ర్ల‌ను వాడ‌తారు. అయితే అలా వాడ‌కూడ‌దు. ఫోన్‌తో వ‌చ్చిన కంపెనీ చార్జ‌ర్ అయితే ఏమీ కాదు, కానీ అలా కాకుండా వేరే ఫాస్ట్ చార్జ‌ర్ల‌ను వాడితే బ్యాట‌రీ పేలేందుకు అవ‌కాశం ఉంటుంది.

రాత్రంతా ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టవద్దు.

రాత్రంతా ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టవద్దు. అలా చేస్తే బ్యాట‌రీలు పేలేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతోపాటు వాటి లైఫ్ కూడా త‌గ్గిపోతుంది.

డిఫాల్ట్ బ్యాట‌రీ యాప్స్‌నే

బ్యాట‌రీ ప‌వ‌ర్‌ను ఆప్టిమైజ్ చేసుకోండి అంటూ ప్లే స్టోర్‌ నుంచి వచ్చే బ్యాటరీ యాప్స్ ను వాడకండి. ఫోన్‌లో వ‌చ్చిన డిఫాల్ట్ బ్యాట‌రీ యాప్స్‌నే వాడాలి.

80 శాతం బ్యాట‌రీ వ‌ర‌కు చార్జింగ్ చేస్తే చాలు.

చాలా మంది ఫోన్ల‌ను పూర్తిగా 100 శాతం చార్జింగ్ అయ్యేంత వ‌ర‌కు ఉంచుతారు. అయితే అలా ఉంచాల్సిన ప‌నిలేదు. ఫోన్‌ను 80 శాతం బ్యాట‌రీ వ‌ర‌కు చార్జింగ్ చేస్తే చాలు. అత్యవసర సమయంలో మాత్రమే 100 శాతం పెట్టుకోండి.

చీటికీ మాటికీ ఫోన్‌ను చార్జింగ్ పెట్టడం వ‌ల్ల

ఛార్జింగ్ కొంచెం తగ్గగానే చాలామంది వెంట‌నే చార్జింగ్ పెట్టేస్తారు. ఇది చాలా తప్పు. చీటికీ మాటికీ ఫోన్‌ను చార్జింగ్ పెట్టడం వ‌ల్ల బ్యాట‌రీ లైఫ్ త‌గ్గిపోతుంది. ఫోన్‌లో బ్యాట‌రీ క‌నీసం 20 శాతం ఉంటేనే చార్జింగ్ పెట్టాలి. అంతే త‌ప్ప కొంత త‌గ్గింద‌నే నెపంతో ఎక్కువ సార్లు చార్జింగ్ పెట్ట‌రాదు.

ప‌వ‌ర్ బ్యాంకుల‌ను వినియోగించి

వోల్టేజ్ స‌ర్జ్‌, షార్ట్ స‌ర్క్యూట్‌, ఓవ‌ర్ క‌రెంట్‌, ఓవ‌ర్ చార్జింగ్ వంటి ఫీచ‌ర్ల‌తో ఉన్న ప‌వ‌ర్ బ్యాంకుల‌ను వినియోగించి స్మార్ట్‌ఫోన్ ల‌కు చార్జింగ్ పెట్టుకుంటే దాంతో ఫోన్‌ బ్యాట‌రీ లైఫ్ బాగుంటుంది.

కాల్స్ చేయడం లాంటి పనులు

స్మార్ట్‌ఫోన్ల‌ను చార్జింగ్ పెట్టిన‌ప్పుడు కాల్స్ చేయడం లాంటి పనులు చేయకండి. మాములుగా ఫోన్లు చార్జింగ్ అయ్యే స‌మ‌యంలో వాటి నుంచి హీట్ వ‌స్తుంటుంది. మీరు కాల్ చేస్తే ఆ హీట్ మరింత ఎక్కువై పేలే ప్రమాదం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 things you should never do while charging your smartphone Read more at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot