మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను ఎలా దొంగిలిస్తారో తెలుసా..?
కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు.
నోట్ల రద్దు నేపథ్యంలో డెబిట్/క్రెడిట్ లావాదేవీలు మరింత ఊపందుకున్నాయి. ఈ కార్డుల వినియోగం విషయంలో సరైన ప్రికాషన్స్ తీసుకోని పక్షంలో సైబర్ నేరాగాళ్లు ఉచ్చులో ఇరుక్కోవటం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : తక్కువ బడ్జెట్‌లో 5 స్మార్ట్‌ఫోన్‌లు
మీ క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలను దొంగిలించేందుకు సైబర్ నేరాగాళ్ల ముందున్న పలు మార్గాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది. వీటిని తెలుసుకోవటం ద్వారా, మీ కార్డు లావాదేవీలను మరింత సురక్షితంగా నిర్వహించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.

సిమ్ క్లోనింగ్
కొత్త రకం సైబర్ మోసాల్లో ఒకటైన సిమ్ క్లోనింగ్ మిమ్మల్ని బ్యాంక్ దివాళా కోరుగా మార్చేయగలదు. మీ పర్సనల్ సిమ్ కార్డ్‌ను క్లోన్ చేయటం ద్వారా హ్యాకర్లు ఆ నెంబరుతో అనసంధానమై ఉన్న మీ బ్యాంక్ ఖాతా వివరాలను సేకరించి అకౌంట్‌లో ఉన్న నగదును మీకు తెలియకుండా లూటీ చేసేయగలరు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్కిమ్మింగ్..
ఈ ప్రాసెస్‌లో భాగంగా హ్యాకర్లు కార్డ్ రీడర్ స్లాట్‌కు డేటా స్కిమ్మింగ్ డివైస్‌ను అనుసంధానించటం జరుగుతుంది. స్కిమ్మింగ్ డివైజ్ అటాచ్ చేసిన కార్డ్ రీడర్ స్లాట్‌లో, మీ డెబిట్/క్రెడిట్ కార్డును స్వైప్ చేయటం ద్వారా మీ కార్డు సంబంధించిన సమాచారం అయస్కాంత స్ట్రిప్ ద్వారా దొంగిలించటం జరుగుతుంది.

కార్డు ట్రాపింగ్
కార్డ్ ట్రాపింగ్ అనేది ఒక చిల్లు లాంటిది. మీరు మెచీన్‌లో కార్డు పెట్టగానే హ్యాకర్లు ఏర్పాటు చేసిన చిల్లులోకి వెళ్లిపోతుంది. తద్వారా మీ కార్డుకు సంబంధించిన సమచారాన్ని దొంగిలించటం జరుగుతుంది.

షోల్డర్ సర్ఫింగ్..
మీరు ఏటీఎమ్ సెంటర్లలో నగదు విత్ డ్రా చేస్తున్నప్పుడు కొంత మంది, మీ వెనకే నిలుచొని మీరు ఎంటర్ చేస్తున్న పిన్ నెంబర్లను గమనిస్తుంటారు. ఇలా చేయటం వల్ల మీ పిన్ నెంబర్ వాళ్లకు తెలిసిపోయే అవకాశం ముంది. మీ కార్డను దొంగలిచి సలువుగా నగదు విత్‌డ్రా చేసుకోగలుగుతారు.

నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో..
కొంత మంది తమకున్న మతిమరుపు కారణంగా నగదు విత్ డ్రా చేసుకునే సమయంలో తమ డెబిట్ కార్డ్‌లను ATM kioskలో ఉంచి మరిచిపోతుంటారు. ఇలాంటి సమయంలో మీ కార్డుకు సంబంధించి దొంగిలించబడతుంది.
లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వివిధ ప్రయత్నాలు..
క్రెడిట్ కార్డులకు సంబంధించి వివరాలను రాబట్టే క్రమంలో హ్యాకర్లు వివిధ వెబ్‌సైట్‌ల ద్వారా చాలాసార్లు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సమయంలో హ్యాకర్లు ఊహాజనితంగా ఒక క్రమపద్ధతిలో నంబర్లను సృష్టిస్తుంటారు. వీళ్లు ఊహించే నెంబర్లు మీ కార్డ్ పై ఉన్నట్లయితే చిక్కలు తప్పవు.

ఫార్మింగ్..
కొందరు హ్యాకర్లు వాస్తవ వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను క్రియేట్ చేసి మిమ్మల్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తారు. ఒరిజినల్ వెబ్‌సైట్‌కు, డూప్లికేట్ వెబ్‌సైట్‌కు మధ్య తేడాలను మీరు గుర్తించలేకపోయినట్లయితే తప్పకుండా డెబిట్/క్రెడిట్ సమాచారం
హ్యాకర్ల చేతికి చిక్కే ప్రమాదం ఉంది.

కీస్టోక్ లాగింగ్
హ్యాకర్లు కొన్ని మోసపూరిత సాఫ్ట్‌వేర్‌లను సృష్టించి వాటిని మీ డివైస్‌ల్లోకి జొప్పిస్తుంటారు. వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవటం వల్ల, మీకు తెలియకుండానే మీ క్రెడిట్ కార్డ్ అలానే నెట్ బ్యాంకింగ్ వివరాలు హ్యాకర్లు గుప్పెట్లోకి వెళ్లిపోతాయి.

పబ్లిక్ వై-పై
కొంత మంది పబ్లిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వై-ఫై హాట్ స్పాట్‌ల వద్ద మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించుకంటుంటారు. ఇటువంటి ప్రదేశాల్లోనే, మీ డేటా కోసం హ్యాకర్లు కాచుకుని కూర్చొని ఉంటారు.

స్వైపింగ్ మెచీన్ ఫ్రాడ్
స్వేపింగ్ మెచీన్‌లకు సంబంధించి కార్డ్ రీడర్ స్లాట్‌కు అటాచ్ చేసే డేటా స్కిమ్మింగ్ డివైస్ ద్వారా, మీ కార్డుకు సంబంధించిన సమచారాన్ని దొంగిలించే అవకాశం కూడా ఉంది.

మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్..
మాల్వేర్స్, ట్రాజాన్ హార్సెస్, స్కేర్‌వేర్, స్పైవేర్ వంటి ప్రమాదకర వైరస్‌లను మీ డివైస్ ల్లోకి ప్రవేశపెట్టడం ద్వారా మీ డెబిట్/క్రెడిట్ కార్డుకు సమాచారాన్ని దొంగిలించవచ్చు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








