మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్టోరేజ్ సమస్యలా? క్లియర్ చేసుకోండిలా..

స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది.

|

స్మార్ట్‌‌ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్ ఎంత ఎక్కువు ఉంటే అంత మంచిది. స్మార్ట్‌ఫోన్‌లలో నిరుపయోగంగా ఉన్న డేటాను ఎప్పటికప్పుడు తొలగించుటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌‍‌ను పెంచుకోవచ్చు. నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లలో తలెత్తే స్టోరేజ్ స్పేస్‌ సమస్యలను సులభంగా పరిష్కరించుకునేందుకు పలు తీరైన మర్గాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఆండ్రాయిడ్ బిల్ట్-ఇన్ స్టోరేజ్ టూల్‌ను ఉపయోగించుకోవటం ద్వారా...
మోడ్రెన్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలతో వస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో స్టోరేజ్ వినియోగానికి సంబంధించిన పక్కా సమాచారం క్లియర్ కట్ గా చూపించబడుతోంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ సదుపాయాన్ని వినియగించుకోవాలనుకుంటున్నట్లయితే సెట్టింగ్స్‌లోకి వెళ్లి స్టోరేజ్ ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే యాప్స్, పిక్షర్స్, వీడియోస్, ఆడియో ఫైల్స్, డౌన్ లోడ్స్, క్యాచీ డేటా ఇంకా ఇతర ఫైల్స్ ఎంతెంత్ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకున్నాయన్నది తెలుస్తుంది.

పైసా కట్టక్కర్లేదు, Airtel 30జిబి డేటా ఉచితంగా వాడుకోండిపైసా కట్టక్కర్లేదు, Airtel 30జిబి డేటా ఉచితంగా వాడుకోండి

ఆండ్రాయిడ్ 8.0 ఓరియోలో మరింత సులువు....

ఆండ్రాయిడ్ 8.0 ఓరియోలో మరింత సులువు....

స్టోరేజ్ స్పేస్ విశ్లేషణకు సంబంధించి ఇతర ఆండ్రాయిడ్ వర్షన్ లతో పోలిస్తే గూగుల్ తన ఆండ్రాయిడ్ ఓరియో 8.0 వర్షన్ లో భిన్నమైన విధానాన్ని అనుసరించింది. ఈ వర్షన్ లో స్టోరేజ్ మెనూను గ్రూప్స్ గా విభజించి వాటిని వివిధ క్యాటగిరీల రూపంలో చూపించే ప్రయత్నం చేసింది. వీటిని సార్ట్ అవుట్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ 7.0 ఇంకా తక్కువ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో స్టోరేజ్ స్పేస్ ను క్లియర్ చేసుకోవాలంటే సంబంధిత విభాగాన్ని సెలక్ట్ చేసుకుని స్పేస్ ను క్లియర్ చేసుకోవల్సి ఉంటుంది.

Files Go టూల్ సహాయం తీసుకోండి..

Files Go టూల్ సహాయం తీసుకోండి..

గూగుల్ ఇటీవల Files Go పేరుతో సరికొత్త యాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ టూల్ సహాయంతో వివిధ రకాల అవసరాల నిమిత్తం వినియోగించుకున్న స్పేస్‌ను విజువలైజ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. ఈ యాప్ మెయిన్ ఇంటర్‌ఫేస్ స్టోరేజ్ వినియోగానికి సంబంధించి అర్థవంతమైన సమచారాన్ని అందించగలుగుతుంది. తద్వారా అవసరంలేని డేటాను క్లియర్ చేసుకుండా స్టోరేజ్ స్పేస్‌ను ఎప్పటికప్పుడు పొడిగించుకోవచ్చు.

 

 

 SD Cardలోకి యాప్స్‌ను మూవ్ చేసుకోవచ్చు..

SD Cardలోకి యాప్స్‌ను మూవ్ చేసుకోవచ్చు..

పోన్‌లలో యాప్స్ వినియోగం ఎక్కువైపోవటం వల్ల కూడా స్టోరేజ్ కొరతకు దారితీస్తోందని నిపుణులు చెబుతున్నారు. యాప్స్ కారణంగా స్టోరేజ్ సమస్యలను ఫేస్ చేస్తున్న ఆండ్రాయిడ్ యూజర్లు ఫోన్ మెమురీలోని కొన్ని యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేసుకోవటం ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేసుకోవచ్చు. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్.. ముందుగా ఫోన్ SD cardలోకి మూవ్ చేయాలనుకుంటోన్న యాప్స్‌ను ఐండెటిఫై చేయండి.

 ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేయటం కుదరదు..

ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేయటం కుదరదు..

ఉదాహరణకు మీరు వాట్సాప్ అప్లికేషన్‌ను ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి మూవ్ చేయాలనుకుంటున్నట్లయితే ఆ యాప్‌కు ఇకపై ఎటువంటి రెగ్యులర్ అప్‌డేట్స్ అందవు. అంతేకాదు, ఎస్డీ కార్డును తొలగించిన ప్రతిసారి వాట్సాప్ అప్లికేషన్ ఫోన్‌లో కనిపించదు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే, ఫోన్‌తో పాటుగా వచ్చే ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్‌ను SD cardలోకి మూవ్ చేయటం కుదరదు. కాబట్టి, మీరు అప్పుడప్పుడూ వినియోగించుకునే యాప్స్‌ను మాత్రమే ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోకి మూవ్ చేసుకోవటం మంచిది.

 

 

"Move to SD card", "Move to phone storage"

ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయాలనుకుంటోన్న యాప్స్‌ను నిర్థారించుకున్న తరువాత ఫోన్ సెట్టింగ్స్‌లోని యాప్స్ మేనేజ్‌మెంట్ సెక్షన్‌లోకి వెళ్లండి. అక్కడ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉన్న యాప్స్ లిస్ట్ మీకు కనిపిస్తుంది. వాటిలో మీకు కావల్సిన యాప్ సెలక్ట్ చేసుకున్నట్లయితే సంబంధిత యాప్ సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి. యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిన తరువాత "Move to SD card" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేసినట్లయితే యాప్ కాస్తా ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ కాబడుతుంది. ఒక వేళ ఆ యాప్ అప్పటికే ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లో ఉన్నట్లయితే "Move to phone storage" అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

 

 

 మైక్రోఎస్డీ స్లాట్ అందుబాటులో లేని ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేసుకోవాలంటే..?

మైక్రోఎస్డీ స్లాట్ అందుబాటులో లేని ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్‌ను ఆదా చేసుకోవాలంటే..?

లిమిటెడ్ స్టోరేజ్ ఆప్షన్‌లతో లభ్యమవుతున్న పలు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సౌకర్యం అందుబాటులో ఉండదు. మరి ఇటువంటి ఫోన్‌లలో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా. ఫోన్‌లోని పాత మెసేజ్‌లను డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను పెంచుకోవచ్చు. ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలను గూగుల్ డ్రైవ్ క్లౌడ్ సర్వీసులలోకి మూవ్ చేయటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్ మరింత ఆదా అవుతుంది.

స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించండి...

స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించండి...

పాటలను ఫోన్‌లో స్టోర్ చేసుకుని వినే బదులు, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సర్వీసుల ద్వారా వినటం వల్ల బోలెడంత స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. సాధారణ ఫోటోలతో పోలిస్తే హెచ్‌డి ఫోటోలు ఎక్కువ స్పేస్‌ను ఆక్రమించేస్తాయి. కాబట్టి, సాధారణ ఫోటోలకే ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ఫోన్‌లో రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌ను బ్రౌజ్ చేస్తున్నట్లయితే, బ్రౌజింగ్ డేటాకు సంబంధించి క్యాచీ ఫైల్స్ ఫోన్‌లో పేరుకుపోతూ ఉంటాయి.

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా...

క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా...

బ్రౌజర్ హిస్టరీలోకి వెళ్లి ఎప్పటికప్పుడు క్యాచీ ఫైల్స్‌ను క్లియర్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ పెరగటంతో పాటు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా వేగంగా ఉంటుంది. ఫోన్‌లోని పనికిరాని యాప్స్‌ను ఎప్పటికప్పుడు డిలీట్ చేయటం ద్వారా స్టోరేజ్ స్పేస్ ఆదా అవుతుంది. డేటా కేబుల్ సహాయంతో ఫోన్‌లోని డేటాను ఎప్పటికప్పుడు కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లోకి మూవ్ చేయటం అలవాటు చేసుకన్నట్లయితే స్టోరేజ్ స్పేస్ ఆదా అవటంతో పాటు ఫోన్ పై ఒత్తిడి మరింత తగ్గుతుంది.

 

 

క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించుకోండి...

క్లౌడ్ స్టోరేజ్‌ను ఉపయోగించుకోండి...

స్మార్ట్‌ఫోన్‌లలోని ఫోటోలను గూగుల్ ఫోటోస్, డ్రాప్‌బాక్స్, మైక్రోసాఫ్ట్, వన్‌డ్రైవ్, ఫ్లికర్ వంటి ఆన్‌లైన్ క్లౌడ్ అకౌంట్‌లలోకి మూవ్ చేసుకోవటం ద్వారా ఫోన్ స్టోరేజ్ పై మరింత భారం తగ్గుతుంది. ఆండ్రాయిడ్ డివైస్‌లోని ఫోటోస్ యాప్, గూగుల్ ఫోటోస్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి ఫోటోస్ అన్ని గూగుల్ క్లౌడ్ అకౌంట్‌లో స్టోర్ కాబడతాయి. వీటిని photos.google.comలోకి వెళ్లటం ద్వారా ఎక్కడి నుంచైనా యాక్సిస్ చేసుకోవచ్చు.

 

 

Best Mobiles in India

Read more about:
English summary
Android phones can fill up quickly as you download apps, add media files like music and movies, and cache data for use offline. Many lower-end devices may only include a few gigabytes of storage, making this even more of a problem.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X