ఆన్‌లైన్ షాపింగ్‌తో జరభద్రం!

సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం 10 సూచనలు.

|

ప్రతి ఇంట్లోనూ స్మార్ట్‌ఫోన్ కామన్‌ వస్తువుగా మారిపోవడంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ మరింతగా ఊపందుకుంది. ఆన్‌లైన్ షాపింగ్‌లో భాగంగా మనకు కావాల్సిన వస్తువులను ఇంట్లోనే కూర్చుని ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సురక్షితమైన ఆన్‌లైన్ షాపింగ్ కోసం మీరు పాటించవల్సిన 10 జాగ్రత్తలు..

Read More : Paytm యాప్ వల్ల 5 లాభాలు

టిప్ 1

టిప్ 1

మీ ఆన్‌లైన్ షాపింగ్‌కు, మార్కెట్లో పాపులర్ అయిన ఈ-కామర్స్ సైట్‌లలో మాత్రమే ఎంపిక చేసుకోండి. గుర్తింపులేని ఫేక్ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల జోలికి వెళ్లకండి. 

టిప్ 2

టిప్ 2

ఆన్‌లైన్ షాపింగ్ నిమిత్తం ఓ వెబ్‌సైట్‌ను ఎంపిక చేసుకునేముందు ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు సిద్ధపడండి.

టిప్ 3

టిప్ 3

SSL (Secure Sockets Layer) సెక్యూరిటీ ఉన్న ఈ-కామర్స్ వెబ్ సైట్ లలో మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ సురక్షితం. SSL సెక్యూరీటీ వ్యవస్థను కలిగి ఉన్న వెబ్‌సైట్ యూఆర్ఎల్ HTTPS://తో మొదలవుతుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టిప్ 4
 

టిప్ 4

మీ ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను ప్రింట్ రూపంలో మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులకు సంబంధించి భవిష్యత్‌లో ఏదైనా సమస్య ఎదురైతే వీటి ఉపయోగం చాలా ఉంటుంది.

టిప్ 5

టిప్ 5

విశ్వసనీయత లేని ఈకామర్స్ సైట్‌లలో షాపింగ్ చేయటం ద్వారా మీ బ్యాంకింగ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్స్ బహిర్గతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి, అకౌంట్‌లకు శక్తివంతమైన పాస్‌వర్డ్‌లను సమకూర్చుకోండి.

టిప్ 6

టిప్ 6

ఆన్‌లైన్ షాపింగ్‌కు క్రెడిట్ కార్డులను ఉపయోగించటం చాలా సురక్షితమైన పద్ధతి. ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉపయోగించటం ద్వారా మీ షాపింగ్ మరింత సురక్షితంగా ఉంటుంది. పిష్షింగ్ ఫిల్టర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

టిప్ 7

టిప్ 7

మీరు కోనుగోలు చేసే వస్తువు డెలివరీకి సంబంధించి పూర్తి వివరాలను క్షున్నంగా తెలుసుకోండి. వస్తువు డెలివరీకి సంబంధించి ఖచ్చితమైన చిరునామాను ఇవ్వండి. షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు.

టిప్ 8

టిప్ 8

మీరు కొనుగోలు చేసే వస్తువుకు సంబంధించి బిల్లింగ్, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు ఇంకా షరతులను చదవండి.

టిప్ 9

టిప్ 9

ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో అనవసరంగా మీ వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయవద్దు. సెక్యూరిటీ కోడ్ విషయంలో జాగ్రత్త వహించండి.

టిప్ 10

టిప్ 10

ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించి క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
10 Ways to Stay Safe When Shopping Online. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X