రేడియేషన్ ముప్పును తగ్గించుకునేందుకు చిట్కాలు !

By Hazarath

  సెల్‌ఫోన్ల వాడకం అనేది నేడు విశ్వవ్యాప్తమై పోయింది. ఎక్కడ చూసినా ఫోన్లే దర్శనమిస్తూ నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. అవి లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చామంటే అతిశయోక్తి కాదు. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు దానితోనే కాలం గడిపేస్తున్నాం.

  తక్కువ ధరతో Samsung Galaxy J2 ( 2018 )వచ్చేస్తోంది !

  రేడియేషన్ ముప్పును తగ్గించుకునేందుకు చిట్కాలు !

   

  అయితే ఈ విపరీత వాడకం వల్ల అనేక సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. వాటివల్ల వచ్చే ముప్పుతో అనేక ఆరోగ్యసమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. వీటినుంచి మిమ్మల్ని రక్షించుకునేందుకు కొన్ని సులువైన మార్గాలను ఇస్తున్నాం ఓ సారి పాటించి చూడండి.

  వాట్సప్‌లో ఈ ఎమోజీ చాలా డేంజర్, అసభ్యకరమంటూ నోటీసులు

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  చిట్కా 1

  వీలయినంతవరకు మీరు ఫోన్ మాట్లాడే సమయంలో ఇయర్‌ఫోన్స్‌తో కాని స్పీకర్ ఆన్ చేసి కాని మాట్లాడండి.

  Keep your phone charged up

  మీ సిగ్నల్ లో ఉన్న సమయంలో కాని బ్యాటరీ తక్కువగా ఉన్న సమయంలో కాని, ఛార్జింగ్ పెట్టిన సమయంలో కాని మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఆ సమయంలో రేడియేషన్ చాలా ఎక్కువస్థాయిలో విడుదలవుతూ ఉంటుంది. సాధారణ స్థాయికన్నా అధిక స్థాయిలో ఈ రేడియేషన్ పవర్ విడుదలవుతుంది. కాబట్టి దూరంగా ఉండటం మంచిది.

  Text instead of talk

  మీరు మాట్లాడే సమయం కన్నా టెక్ట్స్ మెసేజ్ లు చేస్తే మీరు రేడియేషన్ ప్రభావం నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు. అత్యవసరం అయితేనే మాట్లాడేందుకు ప్రయత్నించండి.

  Don’t talk while you drive

  మీరు డ్రైవ్ చేపసే సమయంలో ఫోన్ మాట్లాడటం లాంటి పనులు చేయవద్దు. అలా చేయడం వల్ల మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు ఫ్రీక్వెన్సీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో..

  Look for low–radiation emitting phones

  రేడియేషన్ తక్కువ స్థాయిలో ఉన్న ఫోన్లను తీసుకోవడం చాలా బెటర్..శాంసంగ్ ఫోన్లలో రేడియేషన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది.

  Go old school

  స్మార్ట్ ఫోన్ల కన్నా ల్యాండ్ లైన్ ఫోన్లలో రేడియేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వాటిని ఉపయోగించడం ద్వారా కూడా రేడియేషన్ ప్రభావం నుంచి మనం తేలికగా బయటపడవచ్చు.

  Keep your cell phone far away

  ఫోన్‌ను వీలైనంత వరకు మీ శరీరానికి దూరంగా పెట్టుకోండి. ఫోన్ వాడకపోతే పక్కన పెట్టేయండి. ఆఫీస్‌లో పనిచేస్తుంటే డెస్క్‌పై ఫోన్ పెట్టండి. ఫోన్ ఉపయోగం ఉంటేనే దాన్ని తీసుకోండి. లేదంటే మిగతా సమయాల్లో శరీరానికి వీలైనంత దూరంగా సెల్‌ఫోన్లను ఉంచండి.

  Don’t put the cell phone to your ear until a call connects

  మీ ఫోన్ అవతలి వారు ఎత్తే వరకు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకపోవడం చాలా మంచిది. దీంతో పాటు బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సీ హెడ్‌సెట్లకు బదులుగా వైర్‌తో ఉన్న హెడ్‌సెట్లను వాడితే సెల్‌ఫోన్ రేడియేషన్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.

  Minimize use

  ఫోన్ వాడకం తగ్గించడం చాలా కష్టం. అయితే వీలైనంతగా తగ్గించడానికి ప్రయత్నించడం చాలా మంచిది. ముఖ్యంగా గర్భిణీలు సెల్‌ఫోన్లను వీలైనంత తక్కువ వాడితే మంచిది. లేదంటే కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంపై అది ప్రభావం చూపుతుంది.

  Sleeping time

  రాత్రి పూట నిద్రించేటప్పుడు చాలా మంది ఫోన్‌ను తల పక్కనే పెట్టుకుని నిద్రిస్తారు. కానీ అలా చేయరాదు. తలపక్కన ఫోన్ పెట్టకూడదు.దీంతో పాటు ఫోన్లను ప్రత్యేక పర్సులలో పెట్టుకోండి. జేబుల్లో పెట్టుకోకండి.

  Charging time

  ఫోన్‌ను చార్జింగ్ పెట్టినప్పుడు వాడకండి. అలాంటి సమయంలో వాటి నుంచి సాధారణ సమయాల్లో కన్నా అధిక రేడియేషన్ విడుదలవుతుంది. కనుక వాటిని చార్జింగ్ తీసి వాడితే మంచిది. అలాగే సెల్‌ఫోన్‌ల వెనుక భాగంలో వేసే యాంటీ రేడియేషన్ స్టిక్కర్లు వాడితే రేడియేషన్ ముప్పును కొంత వరకు తగ్గించుకోవచ్చు.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  10 Ways To Reduce Radiation From Cell Phone Use Read more News at Gizbot Telugu
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more