ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సాప్ సరికొత్త సంచలనాలతో దూసుకుపోతోంది.

By Sivanjaneyulu
|

స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సాప్ సరికొత్త సంచలనాలతో దూసుకుపోతోంది. ఇందుకు కారణం ఈ యాప్ అందిస్తోన్న వేగవంతమైన సర్వీసులే. ఫోటో మొదలుకుని మ్యూజిక్ ఫైల్ వరకు ఏదైనా వాట్సాప్ ద్వారా క్షణాలో షేర్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్.. విండోస్.. ఐఓఎస్, ఇలా ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారైనా వాట్సాప్‌ను వినియోగించకుండా ఉండలేరు. వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత సమర్థవంతంగా వాడుకునేందకు 10 బెస్ట్ టిప్స్‌ను మీకు సూచిస్తున్నాం...

మార్చిలో జియో GigaFiber సేవలు, బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500?మార్చిలో జియో GigaFiber సేవలు, బేసిక్ ప్లాన్ ఖరీదు రూ.500?

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

 మీ వాట్సాప్ అకౌంట్ లో ఏదైనా మెసేజ్ ను బుక్క్ మార్క్ చేయదలచినట్లయితే బుక్ మార్క్ చేయాలనుకుంటున్న మెసేజ్ పై టాప్ చేసి కొద్ది సేపు ఉంచండి. అప్పుడు, టాప్ బార్ పై delete, copy, forward అలానే star iconలు కనిపిస్తాయి. వాటిలో స్టార్ ఐకాన్ పై టాప్ చేసినట్లయితే మెసేజ్ బుక్ మార్క్ కాబడుతుంది.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

స్ర్కీన్ ఆఫ్ అయిన సమయంలోనూ వాట్సాప్ నోటిఫికేషన్లు పాపప్ కావాలంటే..?

వాట్సాప్ మెసేజ్ అందిన ప్రతిసారి ఫోన్ ను అన్ లాక్ చేయవల్సి వస్తుందా..? ఈ సమస్యకు వాట్సాప్ చక్కటి పరిష్కారం చూపుతోంది. ఫోన్ లాక్ చేసిన ఉన్నప్పటికి వాట్సాప్ మెసేజ్లను చూసేందుకు ఇలా చేయండి. సెట్టింగ్స్ లోకి వెళ్లి Notifications > Popup Notifications > Only When Screen Off.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్
 
ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

మీ వాట్సాప్ మెసేజ్ లను ఈమెయిల్ కు పంపుకోవటం ఏలా..?

మీ వాట్సాప్ సంభాషణలను అనేక రకాలుగా బ్యాకప్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీ వాట్సాప్ మేసేజ్‌లను ఈమెయిల్‌లో బ్యాకప్ చేసుకోవాలనుకుంటున్నారు..? అయితే ఇలా ట్రై చేయండి.. ముందుగా మీరు బ్యాకప్ చేయాలనుకుంటున్న పర్సనల్ లేదా గ్రూప్ చాట్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో email chat పై టాప్ చేయండి. ఇప్పుడు కోరుకుంటున్న conversation మొత్తం మీ ఈ మెయిల్ అడ్రస్ లోకి సెండ్ కాబడుతుంది.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

మీ వాట్సాప్ అకౌంట్‌కు డీఫాల్ట్‌గా వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ను చూసి బోర్‌గా ఫీలవుతున్నారా..?

అయితే మీకు నచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌తో  వాట్సాప్‌ను తీర్చిదిద్దండి. ఇలా చేయాలంటే స్ర్కీన్ కుడివైపు పై భాగంలో కనిపించే మూడు నిలువు చుక్కల పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లినట్లయితే మీకు వాల్ పేపర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ లోకి వెళ్లినట్లయితే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. వాటిలో మీకు నచ్చిన ఫోటోను బ్యాక్ గ్రౌండ్ గా సెట్ చేసుకోవచ్చు.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

మీ వాట్సాప్ అకౌంట్ లోని కాంటాక్ట్స్ కు షార్ట్ కట్ లను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే, ఇలా చేయండి. షార్ట్ కట్ ను ఏర్పాటు చేయాలనుకుంటున్న కాంటాక్ట్ పై టాప్ చేయండి. ఇప్పుడు అనేక ఆప్షన్ప్ స్ర్కీన్ పై పాపప్ కాబడతాయి. వాటిలో మొదటి ఆప్షన్ అయిన ‘add chat shortcut'ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ కాంటాక్ట్ కు షార్ట్ కట్ క్రియేట్ కాబడుతుంది.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది.ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్ లో వెళ్లి Media auto-download ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్ లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

వాట్సాప్ వెబ్ ఫీచర్ అందుబాటులోకి రావటంతో వాట్సాప్ అకౌంట్‌లను డెస్క్‌టాప్ పీసీల పై హ్యాండిల్ చేయగలుగుతున్నాం. మీ వాట్సాప్ అకౌంట్, వాట్సాప్ వెబ్‌కు అనుసంధానించుకోవాలంటే ముందుగా మీ డెస్క్‌టాప్ వెబ్‌బ్రౌజర్‌లోని web.whatsapp.comలోకి వెళ్లండి. ఓ క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఇపుడు మీ ఫోన్ కుడి వైపు కార్నర్‌లో కనిపించే మూడు చుక్కలు పై క్లిక్ చేసి WhatsApp Web ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయండి. ఇలా చేయాలంటే తప్పనిసరిగా రెండు డివైజ్ లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉండాలి.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ఆండ్రాయిడ్ యూజర్లు మెనూ‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సాప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

వాట్సాప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్ క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సాప్ అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్‌‍లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి.

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'

 ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

ప్రతి ఒక్కరు తెలుసుకోవల్సిన 10 వాట్సాప్ ట్రిక్స్

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి ఎస్ఎంఎస్‌ను షేర్ చేయవచ్చు.ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

Best Mobiles in India

English summary
10 WhatsApp tips and tricks everyone should know.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X