షియోమి MIUI 9 అప్‌డేట్ బెస్ట్ ఫీచర్లు, వీటిని మిస్ కాకండి !

షియోమి తన ఫోన్లకు MIUI 9 అప్‌డేట్ తీసుకొచ్చింది. గతంలో బీటా వర్షన్ లో ఉన్న ఈ అప్‌డేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది.

|

షియోమి తన ఫోన్లకు MIUI 9 అప్‌డేట్ తీసుకొచ్చింది. గతంలో బీటా వర్షన్ లో ఉన్న ఈ అప్‌డేట్ ఇప్పుడు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇందులో ఉన్న ఫీచర్లు ఏంటీ అని చాలామంది సందేహపడుతుంటారు..అయితే MIUI 9లో కొన్ని బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ ఎస్ లో ఉన్న బెస్ట్ ఫీచర్లేంటో మీరూ తెలుసుకోండి.

షియోమి ఫోన్లకు MIUI 9 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !షియోమి ఫోన్లకు MIUI 9 అప్‌డేట్, ఈ ఫోన్లకు మాత్రమే !

Smart Assistant

Smart Assistant

గూగుల్ నౌలో ఉన్న కార్డ్స్‌ ఆప్షన్‌ తరహాలో MIUI 9లో ఈ స్మార్ట్ అసిస్టెంట్‌ని జోడించారు. షియోమి ఫోన్లలోని హోమ్ స్కీన్ కుడివైపున మీకు ఈ స్మార్ట్‌ అసిస్టెంట్‌ వివరాలు కనిపిస్తాయి. అక్కడ మీకు సెర్చ్ ఆప్సన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు photos, text messages, emails, notesలాంటి వాటిని సెర్చ్ చేయవచ్చు.
image source: beebom.com

Smart App Launcher

Smart App Launcher

స్క్రీన్ మీద యాప్స్ కి సంబంధించిన మొత్తం సమాచారం మీకు కనిపిస్తుంది. మీరు ఒక్కో యాప్ కోసం వెతికే పని లేకుండా అన్ని యాప్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. తద్వారా మీకు నచ్చిన యాప్స్ ని నేరుగా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు దీని కోసం హోమ్ స్క్రీన్ మీదకు వెళ్లనవసరం లేదు.
image source: beebom.com

Image Search

Image Search

ఈ ఫీచర్ ద్వారా మీరు అన్ని రకాల ఫోటలను సెర్చ్ చేసుకోవచ్చు. ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నా కాని మీరు ఈ ఫీచర్ ద్వారా people, locations, expressions, events, documents, screenshotsలాంటి వాటిని సెలక్ట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ మాదిరిగానే ఈ ఫీచర్ ఉంటుంది.
image source: beebom.com

System Optimizations

System Optimizations

ఈ ఫీచర్ ద్వారా మీ బ్యాటరీ బాగా సేవ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాక్ రన్ అవుతున్న యాప్స్ ని ఇట్టే పసిగట్టేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 7.0లో కూడా వచ్చింది.
image source: beebom.com

Quick Reply and Notification management

Quick Reply and Notification management

ఈ ఫీచర్లో ఒక ఆప్‌కు సంబంధించి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినా అవన్నీ కలసిపోయి ఒకే నోటిఫికేషన్‌ రూపంలో కనిపిస్తాయి. దాని మీద ఒకేసారి రెండు వేళ్లతో స్వైప్‌ చేసి, అక్కడి నుంచే క్విక్‌ రిప్లై ఇచ్చుకోవచ్చు. ఆ నోటిఫికేషన్‌ను ఎడమవైపు జరిపితే ‘అన్‌ ఇంపార్టెంట్‌' అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకుంటే ఇకపై ఆ ఆప్‌కు సంబంధించిన నోటిఫికేషన్లకు ప్రాధాన్యం తక్కువగా ఉండి దిగువన కనిపిస్తాయి.
image source: beebom.com

Home Screen Enhancements

Home Screen Enhancements

ఈ ఫీచర్ ద్వారా మీరు మీకు నచ్చిన వాటిని హోమ్ స్క్రీన్ మీద సెట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ యాప్స్ ని మీరు నచ్చిన స్క్రీన్ మీదకు మూవ్ చేసి తీసుకెళ్లవచ్చు.అయితే ఇందుకోసం మీరు సెట్టింగ్స్ లో లాక్ స్క్రీన్ లే అవుట్ ని డిసేబుల్ చేయాల్సి ఉంటుంది.
image source: beebom.com

Lock Screen Enhancements

Lock Screen Enhancements

MIUI 9లో మీరు లాక్ స్క్రీన్ ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఓ పేజీ ప్రత్యక్షమవుతుంది. ఇందులో మీకు Mi Home and Mi Remote ఫీచర్లు కనిపిస్తాయి. అలాగే ఫ్లాష్ లైట్ కూడా కనిపిస్తుంది. మాములుగా ఎంఐయూఐ 8'లో లాక్‌ స్క్రీన్‌ను ఎడమవైపునకు జరిపితే మెసేజ్‌ లేదా కెమెరా ఓపెన్‌ అవుతుంది.
image source: beebom.com

Security App Enhancements

Security App Enhancements

ఈ ఫీచర్ ద్వారా మీరు ఫోన్ బూస్ట్ చేసుకోవచ్చు. హోమ్ పేజీ మీద మీకు అన్ని రకాల actions కనిపిస్తాయి. ఇది MIUI 9లో వచ్చిన బెస్ట్ ఫీచర్.
image source: beebom.com

Split Screen Multitasking

Split Screen Multitasking

ఆండ్రాయిడ్ 7.0లో ఉన్నట్లు మల్టి టాస్కింగ్ ఫీచర్ MIUI 9లో కూడా ఉంది .దీని ద్వారా మీరు ఒకేసారి అన్ని రకాల పనులు చేయవచ్చు. ఇందుకోసం మీరు పైన కనిపిస్తున్న SplitScreenModeను సెలక్ట్ చేసుకోవాలి. మొబైల్‌లోని మెనూ (స్క్రీన్‌ కింద ఉన్న మూడు అడ్డ గీతల బటన్‌)ను క్లిక్‌ చేసి స్ప్లిట్‌ స్క్రీన్‌ మోడ్‌ సెలక్ట్ చేసుకుంటే స్క్రీన్‌ రెండు భాగాలుగా వస్తుంది. ఏ భాగంలో ఏ ఆప్‌ రన్‌ అవ్వాలనేది మీరే ఎంచుకోవచ్చు. అలా ఒకే స్క్రీన్‌ మీద రెండు ఆప్స్‌ను ఒకేసారి రన్‌ చేసుకోవచ్చు.
image source: beebom.com

New Animations across the whole UI, New Themes

New Animations across the whole UI, New Themes

మీకు కావాల్సిన అన్ని రకాల ధీమ్స్ ఈ ఫీచర్లో పొందుపరిచారు.
image source: beebom.com

 MIUI Lab

MIUI Lab

ఈ ఫీచర్ ఎందుకు పెట్టారనేది పూర్తిగా తెలియదు. కావున మీరు MIUI 9 అప్ డేట్ చేసుకున్నట్లయితే ఓ సారి చెక్ చేసుకోగలరు.
image source: beebom.com

ఒకేసారి అన్‌ఇన్‌స్టాల్‌

ఒకేసారి అన్‌ఇన్‌స్టాల్‌

మీరు ఒకటికిమించి ఎక్కువ యాప్స్ ని అన్‌ఇన్‌స్టాల్‌ చేయాలనుకుంటే ఈ ఫీచర్ ద్వారా చేయవచ్చు. స్క్రీన్‌ మీద లాంగ్‌ ప్రెస్‌ చేస్తే... ఐకాన్లను టిక్‌ మార్క్‌ చేసే ఆప్షన్‌ వస్తుంది. అలా మీకు కావల్సిన ఆప్‌లను ఎంచుకొని పైకి డ్రాగ్‌ చేస్తే అన్‌ఇన్‌స్టాల్‌ ఆప్షన్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. అలాగే ఒక స్క్రీన్‌ నుంచి మరో స్క్రీన్‌కు ఆప్స్‌ మార్చాలన్నా ఈ పద్ధతిని అనుసరించొచ్చు.

మినిమైజ్‌ బటన్‌

మినిమైజ్‌ బటన్‌

MIUI 9లో యాప్స్‌ ఓపెన్‌ చేశాక మినిమైజ్‌ చేస్తే... యాప్‌ ఐకాన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. అంటే ఉదాహరణకు సెట్టింగ్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేసి మినిమైజ్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే... ఆ ఐకాన్‌లోని చక్రం బొమ్మ గిరగిరా తిరుగుతుంది. ఇలా ప్రతి ఐకాన్‌కు ఓ యానిమేషన్‌ ఇచ్చారు.

Best Mobiles in India

English summary
Top 12 MIUI 9 Features That You Shouldn’t Miss More News at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X