ఈ 15 టిప్స్‌తో మీ కంప్యూటర్ వినియోగం మరింత యూజర్ ఫ్రెండ్లీ..!

ఈ ఆర్టికల్ ద్వారా మీతో షేర్ చేసుకోబోతోన్న 15 క్రేజీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీ కంప్యూటర్ వినియోగాన్ని మరింత క్రియేటివ్‌‌గా తీర్చిదిద్దుతాయి.

|

ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నట్లుగానే మన వస్తువులను బాధ్యత కూడా మనమే చూసుకోవాలి. కంప్యూటర్ల వినియోగం విస్తృతమైన నేపథ్యంలో ప్రతి దాదాపుగా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కంప్యూటర్ దర్శనమిస్తోంది. ఈ ఆర్టికల్ ద్వారా మీతో షేర్ చేసుకోబోతోన్న 15 క్రేజీ టిప్స్ అండ్ ట్రిక్స్ మీ కంప్యూటర్ వినియోగాన్ని మరింత క్రియేటివ్‌‌గా తీర్చిదిద్దుతాయి. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ క్రియేటివ్ ఐడియాలను చూసేద్దామా మరి.

అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండిఅదిరే ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొస్తున్న మోటో ఫోన్లు ఇవే,ఓ లుక్కేయండి

 డిస్‌ప్లేను 90 డిగ్రీలకు రొటేట్ చేసుకుంటే..

డిస్‌ప్లేను 90 డిగ్రీలకు రొటేట్ చేసుకుంటే..

మీ కంప్యూటర్ ముందు ఓ వైపుగా పడుకొని మూవీస్ లేదా టీవీ షోస్ చూస్తున్నారా? అయితే స్ర్కీన్‌ను అటూ ఇటూ కదపకుండా 90 డిగ్రీలకు రొటేట్ చేసుకున్నట్లయితే వ్యూవింగ్ యాంగిల్ మరింత కంఫర్ట్ గా ఉంటుంది.

డస్ట్‌బిన్‌లో పడేసే ముందు

డస్ట్‌బిన్‌లో పడేసే ముందు

వాడేసిన పోస్ట్ స్టిక్కర్‌ను డస్ట్‌బిన్‌లో పడేసే ముందు కీబోర్డ్ బటన్ల మధ్య స్టిక్ చేసి తీసినట్లయితే దుమ్ము ఏమైనా ఉన్నట్లయితే స్టిక్కర్‌కు అతుక్కుపోతుంది.

ముందు జాగ్రత్త...

ముందు జాగ్రత్త...

మీరు కంప్యూటర్ సిస్టమ్స్ అనలిస్ట్‌గా ఎదగాలనుకుంటన్నట్లయితే భవిష్యత్ చాలా కష్టంగా ఉండబోతోందట. ఓ సర్వే ప్రకారం 2020 నాటికి కేవలం 22 శాతం వృద్ధి మాత్రమే ఈ సెగ్మెంట్‌లో నమోదయ్యే అవకాశముందట. కాబట్టి మీరు సిస్టమ్ అనలిస్ట్‌తో పాటు వివిధ రకాల జాబ్స్ అలానే అవకాశాల పై రిసెర్చ్ చేయటం మంచిది.

హీట్‌సింక్‌ను ఇలా మార్చేయండి..

హీట్‌సింక్‌ను ఇలా మార్చేయండి..

పాత సీపీయూలో నిరుపయోగం మారిన హీట్‌సింక్‌ను ఇలా అద్భుతమైన పేపర్ హోల్డర్‌లా మార్చుకోవచ్చు.
Shift + ఆప్షన్‌తో..
స్ర్కీన్ బ్రైట్నెస్ అలానే వాల్యుమ్‌లు ఖచ్చితమైన ప్రాధాన్యతతో ఉండాలనుకున్నట్లయితే సెట్టింగ్స్‌ను Shift + ఆప్షన్‌తో ఫైన్ ట్యూన్ చేసుకోవవచ్చు.

బైండర్ క్లిప్‌ను ఇలా కూడా..

బైండర్ క్లిప్‌ను ఇలా కూడా..

బైండర్ క్లిప్‌ను ఇలా టేబుల్ అంచుకు అమర్చటం ద్వారా కంప్యూటర్ హెడ్‌ఫోన్స్‌ను నలిగిపోకుండా సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకోవచ్చు.
యూజర్ మాన్యువల్స్ అన్ని క్లౌడ్ స్టోరేజ్‌లో భద్రం
మీ యూజర్ మాన్యువల్స్ అన్ని క్లౌడ్ స్టోరేజ్ లో భద్రంగా ఉండాలంటే మీరు కొనుగోలు చేసే ప్రతీ వస్తువుకు సంబంధించిన యూజర్ మాన్యువల్‌ను తయారీదారు వైబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకుని ఆ తరువాత గూగుల్ డ్రైవ్ లేదా డ్రాప్ బాక్సులోకి అప్ లోడ్ చేసుకోండి.

 

 

 వీడియో క్వాలిటీ మార్చాలంటే..?

వీడియో క్వాలిటీ మార్చాలంటే..?

నెట్‌ఫ్లిక్స్ వీడియో కంటెంట్‌ను కంప్యూటర్‌లో స్ట్రీమ్ చేస్తున్నపుడు స్ట్రీమ్ క్వాలిటీ నాసిరకంగా ఉన్నట్లయితే control+alt(opt)+shift+sను ప్రెస్ చేయటం ద్వారా బఫరింగ్ రేట్ ను మార్చుకోవచ్చు.
20-20-20 రూల్..
ఈ రూల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేసే వారు ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కళ్లకు విశ్రాంతినివ్వటం ద్వారా కంటి అలసట నుంచి తగ్గించుకోవచ్చు.

ప్రతిసారి ట్రాష్‌క్యాన్‌లోకి డ్రాగ్ చేసే బుదులు...

ప్రతిసారి ట్రాష్‌క్యాన్‌లోకి డ్రాగ్ చేసే బుదులు...

డెస్క్‌టాప్ పై నిరుపయోగంగా ఉన్న ఫైళ్లను ప్రతిసారి ట్రాష్‌క్యాన్‌లోకి డ్రాగ్ చేసే బుదులు సంబంధిత ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని + కమాండ్‌తో పాటు డిలీట్ బటన్ పై ప్రెస్ చేసినట్లయితే ఫైల్‌ను డిలీట్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది.
ఫ్రేమ్ టు ఫ్రేమ్ రూపంలో చూడాలంటే..
యూట్యూబ్ వీడియోను ఫ్రేమ్ టు ఫ్రేమ్ రూపంలో చూడాలనుకుంటున్నలయితే తొలత ఆ వీడియోను పాస్ చేసి కీబోర్డులోని J, L కమాండ్లను వినియోగించటం ద్వారా ఫ్రేమ్స్‌ను బ్యాక్‌వర్డ్ లేదా ఫార్వర్డ్ చేసుకోవచ్చు.

 

 

ఇన్‌స్టెంట్ డిక్షనరీ

ఇన్‌స్టెంట్ డిక్షనరీ

ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు మౌస్ కర్సర్‌ను ఏదైనా టెక్స్ట్ పై ఉంచి Command + Control + Dని ప్రెస్ చేసినట్లయితే ప్రత్యేకమైన సమచారంతో కూడిన పాపప్ మెనూ ఒకటి ఓపెన్ అవుతుంది.
స్టార్టప్ సౌండ్ వినిపించకుండా ఉండాలంటే
కంప్యూటర్ రిస్టార్ట్ అవుతున్న సమయంలో స్టార్టప్ సౌండ్ వినిపించకుండా ఉండాలంటే మ్యూట్ బటన్‌ను హోల్డ్ చేసి ఉంచండి.

క్రోమ్ బ్రౌజర్ ఫ్రీజ్ అయినట్లయితే..

క్రోమ్ బ్రౌజర్ ఫ్రీజ్ అయినట్లయితే..

ఒకవేళ మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఫ్రీజ్ అయినట్లయితే కీబోర్డులోని Shift + Esc పై హిట్ చేయండి. క్రోమ్ బ్రౌజర్ లోని ఇన్ బిల్ట్ టాస్క్ మేనేజర్ ఓపెన్ అవుతుంది.
ఫైల్ రీనేమ్ చేసేందుకు షార్ట్ కట్
కంప్యూటర్ డెస్క్‌టాప్ పై ఏదైనా ఫైల్‌ను రీనేమ్ చేయాలనుకున్నట్లయితే, మౌస్‌తో ఆ ఫైల్‌ను సెలక్ట్ చేసుకుని కీబోర్డులోని F2 బటన్ పై ప్రెస్ చేసి రీనేమ్ చేసుకుంటే సరిపోతుంది.

Best Mobiles in India

English summary
When it comes to technology chances are that you don't know everything there is to know. Hopefully this will help point out some shortcuts to help you be more effective.Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X