ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

|

ఆధునిక యువత జీవితాల్లోకి శరవేగంగా విస్తరించిన ఫేస్‌బుక్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సరికొత్త అధ్యయానానికి నాంది పలికింది. ఫేస్‌బుక్‌కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నెటిజనులు దాసోహమంటున్నారు. చిన్ననాటి స్నేహితులు మొదలుకుని పెద్ద వయసు ప్రాణ స్నేహితుల వరకు ఫేస్‌బుక్ చాటింగ్‌లలో మునిగితేలుతున్నారు. ఫేస్‌బుక్ అకౌంట్‌లను కలిగి ఉన్న అనేక మంది యువతకు తామ నిర్వహిస్తోన్న అకౌంట్‌కు సంబంధించి చాలా సందేహాలే ఉంటాయి. వాటిని నివృత్తి చేసే ఉద్దేశ్యంతో రకరకాల
ఫేస్‌బుక్ చిట్కాలను ఆర్టికల్స్ రూపంలో గిజ్‌బాట్ పోస్ట్ చేయటం జరుగుతోంది.

 

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ ఫ్రెండ్‌కు సంబంధించి మెసేజ్ లేదా నోటిఫికేషన్‌ను మ్యూట్ చేయాలంటే ముందుగా Facebook App >Messagesలోకి వెళ్లి మీరు మ్యూట్ చేయదలిచిన మిత్రుడిని ఎంపిక చేసుకోండి. మెనూ పైన కనిపించే ఐకాన్‌ను క్లిక్ చేయటం ద్వారా నోటిఫికేషన్‌లు ఓపెన్ అవుతాయి వాటిలో Mute notificationsను సెలక్ట్ చేసుకోండి.

 

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్ ద్వారా మీరు మీ మిత్రులకు మెసేజ్ చేసిన ప్రతిసారీ లోకేషన్ ఆటోమెటిక్‌గా కనిపిస్తుంటుంది. ఈ లోకేషన్‌ను టర్న్ ఆఫ్ చేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లండి. ఆ తరువాత మెసెంజర్ లోకేషన్ సర్వీసెస్ ఆప్షన్‌ను అన్‌టిక్ చేయటం ద్వారా మెసేజ్ లోకేషన్ టర్నాఫ్ అవుతుంది.

 

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్
 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్‌లో నోటిఫికేషన్‌లు ప్రతి 30 నిమిషాలు, ప్రతి గంటా, ప్రతి 2 గంటలు, ప్రతి 4 గంటలకు రీఫ్రెష్ అయ్యేలా ఇంటర్వెల్ టైమ్‌‌ను మీరేసెట్ చేసుకోవచ్చు.

ఇలా చేయాలంటే ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేసి డివైస్ మెనూ బటన్‌ను ప్రెస్ చేసి సెటింగ్స్‌ను సెలక్ట్ చేసుకోండి. రిఫ్రెష్ ఇంటర్వెల్ పై క్లిక్ చేసి ఇంటర్వెల్ టైమ్‌‌ను సెట్ చేసుకోండి.

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ యాప్‌కు వచ్చే నోటిఫికేషన్‌లను పూర్తిగా డిసేబుల్ చేయాలంటే ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని నోటిఫికేషన్స్‌ను అన్‌టిక్ చేయండి.

 

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

మీ ఫేస్‌బుక్ ఐడీకి సంబంధించి టూ‌ స్టెప్ అథంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలంటే ముందుగా ఫేస్‌బుక్ యాప్ అకౌంట్ సెట్టింగ్స్‌‌లోకి వెళ్ళి సెక్యూరిటీ మెనూలోని Login Approvalsను ఆన్ చేయవల్సి ఉంటుంది. స్టార్ట్ సెటప్‌లో మీ ఫోన్ నెంబర్‌ను టర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయండి.ఇప్పుడు మీకు కన్ఫర్మేషన్ కోడ్ అందుతుంది. ఈ కోడ్‌‌ను ఖాళీ బాక్సులో టైప్ చేసి కంటిన్యూ బటన్‌ను ప్రెస్ చేయండి.

 

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

కోడ్ జనరేటర్ ద్వారా కోడ్‌లను పొందటం ఎలా

స్‌బుక్ యాప్‌ లోని Naviconలోకి వెళ్లి కోడ్ జనరేటర్‌ను టాప్ చేయటం ద్వారా కోడ్‌ను పొందవచ్చు.

 

 ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ టిప్స్

గ్రూప్ మెసేజ్‌ను స్టార్ట్ చేయటం ఏలా..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని ఫేస్‌‌బుక్ యాప్‌లో గ్రూప్ మెసెజ్‌ను స్టార్ట్ చేయాలంటే ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి మెసెజ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపన్ అయ్యే మెనూలో Group ఆప్సన్‌ను సెలక్ట్ చేసుకుని కావల్సిన మిత్రులకు గ్రూప్‌లోకి యాడ్ చేసుకుని మెసేజ్ టైప్ చేసి సెండ్ చేయండి.

 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఫేస్‌బుక్ యాప్‌లో ఏదైనా కామెంట్‌‌ను కాపీ చేయాలంటే ముందుగా ఆ కామెంట్ వద్దకు వెళ్లి కామెంట్ పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచినట్లయితే ఓ మెనూ ఓపెన్ అవుతుంది. మెనూలోని Copy Comment ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే కామెంట్ కాపీ అవుతుంది.

 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి ఫోటోను ఓపెన్ చేయండి. ఫోటో పై కొద్ది సేపు టాప్ చేసి ఉంచినట్లయితే ఫోటో పూర్తి సైజులో ఓపెన్ అవుతుంది.

 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లి Naviconను ఓపెన్ చేయండి. అకౌంట్ సెట్టింగ్స్ పై టాప్ చేసి Timeline and Tagging విభాగంలోకి వెళ్లి "Review posts friend tag you in before they appear on your timeline?" ఫీచర్‌ను ఆన్ చేుసుకోండి.

 

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల కోసం ఫేస్‌బుక్ చిట్కాలు

ఫేస్‌‌బుక్ యాప్‌లోకి వెళ్లి Naviconను ఓపెన్ చేయండి. ఆ తరువాత అకౌంట్ సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ విభాగంలోకి వెళ్లి Active Sessionsను సెల్టక్ట్ చేయండి. కరెంట్ సెషన్‌లోని X బటన్ పై టాప్ చేసినట్లయితే యాక్టివ్ ఫేస్‌బుక్సె షన్‌ల వెంటనే లాగవుట్ కాబడతాయి.

 

 ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.తరువాతి స్టెప్‌లో భాగంగా మీ అకౌంట్‌కు సంబంధించి ‘messages' ఐకాన్ పై క్లిక్ చేయండి. తరువాతి స్టెప్‌లో భాగంగా మీరు డిలీట్ చేయవల్సిన మెసేజ్ (message) లేదా సంభాషణ (conversation) పై క్లిక్ చేయండి. ఆ తరువాత మీరు ఎంపిక చేసుకున్న మెసేజ్ కు సంబంధించి సదరు మెసేజ్ బాక్స్ పై భాగంలో కనిపించే ‘‘Actions'' లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో ‘‘Delete messages'' అనే ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీరు సెలక్ట్  చేసుకున్న మెసేజ్‌లు మాత్రమే డిలీట్ అవుతాయి. ‘‘Delete conversation'' ఆప్షన్‌ను ఎంపిక  చేసుకున్నట్లయితే మొత్తం సంభాషణ డీలీట్ అవుతుంది. మొత్తం సంభాషణను డీలీట్ చేసే ముందు Delete This Entire conversation..? ఓ పాప్ అప్ పేజ్ మీకు కనిపిస్తుంది. Delete conversation పై క్లిక్ చేసినట్లయితే సంభాషణ పూర్తిగా తొలగించబడుతుంది.

 

 ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

సాధారణంగా, ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేద్దామన్న ఆలోచన వచ్చిన వెంటనే చాలా మంది అకౌంట్ సెట్టింగ్స్ (Account Settings) లోకి ప్రేవేశించి సెక్యూరిటీ (security) విభాగాంలోని Deactivate your Account ఆప్షన్‌ను క్లిక్ చేస్తుంటారు.

 

 ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

ఫేస్‌బుక్ టిప్ప్ అండ్ ట్రిక్స్

మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయాలంటే ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగినై ఆ తరువాత వేరొక ట్యాబ్‌లో ఈ క్రింది లింక్‌ను ఓపెన్ చేసి తదుపరి సూచనలను అనుసరిచండి.https://www.facebook.com/help/delete_account ఈ ప్రక్రియ ద్వారా మీ

ఫేస్‌బుక్ అకౌంట్‌ను డిలీట్ చేసేందుకు ధరఖాస్తు చేసుకున్నట్లయితే 14 రోజుల తరువాత మీ అకౌంట్ పూర్తిగా డిలీట్

కాబడుతుంది.

 

Best Mobiles in India

English summary
15 Facebook App Tips And Tricks For Android Phones. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X