ఎస్‌బిఐ అకౌంట్ వివరాలు మరచిపోయారా, అయితే ఇలా చేయండి

By Hazarath
|
SBI అకౌంట్ వివరాలు మరచిపోయారా, అయితే ఇలా చేయండి

డిజిటల్ టెక్నాలజీ ఊపందుకోవడంతో ఇప్పుడు అంతా తమ బ్యాంకు లావాదేవీలను ఆన్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. అయితే ఇంటర్నెట్ బ్యాకింగ్ వాడేవారు ఒక్కోసారి తమ లాగిన్ వివరాలను మరచిపోయి ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. ముఖ్యంగా ఎస్‌బిఐ వినియోగదారులకి ఈ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాగా ఖాతాదారుడు వరుసగా మూడుసార్లు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ పాస్‌వర్డ్‌ను తప్పుగా ఎంటర్ చేస్తే నెట్ బ్యాకింగ్ ఖాతా లాక్ అయ్యే ప్రమాదం కూడా ఉండటంతో చాలా టెన్సన్ కు గురి అవుతుంటారు. అలాంటి వారికోసం ఎస్‌బిఐ పాస్‌వర్డ్‌ రీసెట్‌ చేసుకోవడం, ఎస్‌బీఐలాగిన్‌ పాస్‌వర్డ్‌ మార్చుకోవడం లాంటి ఆప్సన్లను అందించింది. మరి వీటిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

 

దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !

ట్రిక్ 1

ట్రిక్ 1

మీరు ముందుగా Sbi లాగిన్ పేజీ ఓపెన్ చేయాలి. ఇందుకోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి. https://www.onlinesbi.com

ట్రిక్ 2

ట్రిక్ 2

పేజీలో లాగిన్ అయిన తరువాత అక్కడ మీకు forget login password ఆప్సన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే కొన్ని వివరాలతో కూడిన విండో ప్రత్యక్షమవుతుంది.

ట్రిక్ 3

ట్రిక్ 3

అక్కడ మీ యూజర్‌ నేమ్, బ్యాంక్‌ ఖాతా సంఖ్య దేశం, పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్‌ చేసిన మొబైల్‌ సంఖ్య, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చెయ్యాలి.వెంటనే మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపి వస్తుంది.

ట్రిక్ 4
 

ట్రిక్ 4

దాన్ని ఓటీపీలో ఎంటర్ చేస్తే మళ్లీ మీకు మూడు ఆప్సన్లతో కూడిన పేజీ ఓపెన్ అవుతుంది. ఏటీఎమ్‌ కార్డును ఉపయోగించి, ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను ఉపయోగించి, ఏటీఎమ్‌ కార్డు వివరాల్లేకుండా అనే ఆప్సన్లు ఉంటాయి.

ట్రిక్ 5

ట్రిక్ 5

వీటిలో ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ను సెలక్ట్ చేసుకుని దాన్ని ఎంటర్ చేస్తే మీకు క్రియేట్ న్యూ పాస్‌వర్డ్‌ అనే ఆప్సన్ గల పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ కొత్త పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి మీ అకౌంట్ లాగిన్ కావచ్చు.

ట్రిక్ 6

ట్రిక్ 6

మరో ఆప్సన్ ఏటీఎం ద్వారా మీరు పాస్‌వర్డ్‌ ని సెట్ చేసుకోవాలంటే ఈ స్క్రీన్ షాట్ లో కనిపిస్తున్నవివరాలను ఎంటర్ చేయాలి.

 ట్రిక్ 7

ట్రిక్ 7

అవన్నీ ఎంటర్ చేసిన తరువాత మీకు క్రియేట్ న్యూ పాస్‌వర్డ్‌ అనే ఆప్సన్ గల పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ కొత్త పాస్‌వర్డ్‌ ఎంటర్ చేసి మీ అకౌంట్ లాగిన్ కావచ్చు.

ట్రిక్ 8

ట్రిక్ 8

ఇక మూడో ఆప్సన్ సెలక్ట్ చేసుకుంటే మీకు రెండు ఆప్సన్లు కనిపిస్తాయి. బ్యాంకు దగ్గర రీసెట్ కాని లేకుంటే కొత్త పాస్‌వర్డ్‌ పోస్ట్ ద్వారా పంపమనే వివరాలు కనిపిస్తాయి.

ట్రిక్ 9

ట్రిక్ 9

వాటిల్లో మీరు సెలక్ట్ చేసుకునే దాన్ని బట్టి వివరాలను అందిచాల్సి ఉంటుంది. పోస్టు ద్వారా మీరు వివరాలు కావాలనుకుంటే అడ్రస్ ఇచ్చి సబ్ మిట్ బటన్ నొక్కాలి. 10 రోజుల్లో మీరు ఇచ్చిన అడ్రస్ కి వారు కొత్త పాస్‌వర్డ్‌ తో కూడిన వివరాలను పోస్ట్ ద్వారా పంపిస్తారు.

Source : alldigitaltricks.com

Best Mobiles in India

English summary
3 Ways To Reset SBI Internet Banking Login Password Online Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X