10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ (SIM cutterతో పనిలేకుండా)

సిమ్ కార్డ్.. పరిమాణంలో కాస్తంత చిన్నగా కనిపించినప్పటికి, ప్రతి మొబైల్ ఫోన్‌కు ఇది చాలా కీలకం. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఆధునిక స్టాండర్ట్స్‌కు అనుగుణంగా తమ ఫోన్‌లలోని సిమ్ స్లాట్‌లను స్టాండర్డ్ సిమ్ వర్షన్‌ నుంచి మైక్రో, నానో వర్షన్‌లకు మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతోన్న యూజర్లు కొత్త సిమ్ కోసం టెలికామ్ ఆపరేటర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

 10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ (SIM cutterతో పనిలేకుండా)

అలా కాకుండా తమ వద్ద ఉన్నపాత సిమ్‌నే, మైక్రోసిమ్‌గా కన్వర్ట్ చేసుకునేందుకు కొన్ని ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో మొదటి సిమ్ కటర్ ఆప్షన్. అయితే, ఇది అందరికి అందుబాటులో ఉండదు. ఇప్పడు మేము సూచించబోయే కొన్ని చిట్కాలను అప్లై చేయటం ద్వారా ఖర్చు లేకుండా నిమిషాల వ్యవధిలో మీ సాధారన సిమ్‌ను మైక్రోసిమ్ మార్చేసుకోవచ్చు...

Read More : Wi-Fi router కొంటున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టాండర్డ్ సిమ్‌ను మైక్రోసిమ్‌గా మార్చే క్రమంలో

- మైక్రోసిమ్ అడాప్టర్
- పొదునైన పెన్సిల్
- కత్తెర
- నమ్మకం

10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ

ముందుగా మీ కరెంటు సిమ్ అవుట్‌లైన్‌ను మీరు ట్రేస్ చేయవల్సి ఉంటుంది. ఈ క్రమంలో సిమ్‌ను మైక్రోసిమ్ ట్రే క్రింద ఉంచండి. (గమనిక : సిమ్ ముఖ ద్వారం ఫోటోలో చూపించిన విధంగా క్రిందకే ఉండాలే చూసుకోండి).

 

10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ

అలైనింగ్ కరెక్టుగా సరిపోయిందని నిర్థారించుకున్న తరువాత పెన్సిల్ సహాయంతో సిమ్ అవుట్‌లైన్‌ను మార్క్ చేయండి. ఇది చాలా కీలకమైన పని. దృష్టి మొత్తం ఈ పని మీదనే ఉంచండి

10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ

అవుట్ లైనింగ్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత కత్తెర సహాయంతో సిమ్‌ను జాగ్రత్తగా కట్ చేయండి. ఈ సమయంలో మీ చేతులు వణకకుండా చూసుకోండి. కాస్తంత ఆలస్యమైనప్పటికి సిమ్ పర్‌ఫెక్ట్‌గా కట్ అయ్యేలా చూసుకోండి.

 

10 నిమిషాల్లో మైక్రోసిమ్ రెడీ

సిమ్ కటింగ్ పూర్తయిన తరువాత, ఫోన్ స్లాట్‌లో ఇన్సర్ట్ చేసి చూడండి. సిమ్‌ యాక్సెప్ట్ అయిన్నట్లయితే మీ పని విజయవంగా పూర్తి అయినట్లే.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
4 simple steps to get your Micro SIM in 10 minutes!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot