ఈ అప్లికేషన్‍‌లు మీ ఫోన్‌లో ఉంటే బిల్లు సగానికి తగ్గుతుంది!

|

నేటి తరం సమాచార బంధాలను ధృడ పరచటంలో మొబైల్ కమ్యూనికేషన్ వ్యవస్థ కీలకంగా మారింది. స్నేహితులతో చాటింగ్ మొదలుకుని అత్యవసర సమావేశాల వరకు మొబైల్ ద్వారానే సాగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు రీఛార్జుల నిమిత్తం అధిక మొత్తంలో డబ్బులను ఖర్చుపెడుతున్నారు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల ఫోన్ బిల్లులను కొంత మేర తగ్గించే 5 అత్యుత్తమ అప్లికేషన్‌లను పరిచయం చేస్తున్నాం.

 
ఈ అప్లికేషన్‍‌లు మీ ఫోన్‌లో ఉంటే బిల్లు సగానికి తగ్గుతుంది!

skype:

కంప్యూటర్ల ద్వారా వాయిస్ కాన్ఫిరెన్స్ నిర్వహించుకునేందకు స్కైప్ చక్కటి సదుపాయం. ఈ అప్లికేషన్ ద్వారా టెక్స్ట్, వాయిస్ ఇంకా వీడియో ఛాటింగ్‌లను ఉచితంగా నిర్వహించుకోవచ్చు.

సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్‌ఫోన్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్, మ్యాక్

WeChat

వివిధ మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను వుయ్‌చాట్ (WeChat) అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్, పుష్ - టూ -టాక్ వంటి సౌలభ్యతలను ఈ అప్లికేషన్ అందిస్తోంది.

సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియాన్, విండోస్‌ఫోన్, వెబ్


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

Google Hangouts

సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ గూగుల్ హ్యాంగవట్స్ పేరుతో ఉచిత వీడియో చాటింగ్ సర్వీసును అందిస్తోంది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఒకేసారి 10 మంది సభ్యులతో ఉచిత వీడియో కాల్స్ నిర్వహించుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ 2.3
జింజర్‌బ్రెడ్ ఆపై వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్

Tango:

ఈ నిఫ్టి అప్లికేషన్ ద్వారా ఉచితంగా వీడియో చాటింగ్, వాయిస్ కాల్స్, టెక్స్ట్ సందేశాలు, ఫోటో షేరింగ్, గేమ్స్ తదితర అంశాలను నిర్వహించుకోవచ్చు. ట్యాంగో అప్లికేషన్ మీ స్మార్ట్‌ఫోన్‌ను వాకీ-టాకీలా మార్చగలదు.

సపోర్ట్ చేసే ప్లాట్‌ఫామ్స్: ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్7, విండోస్

WhatsApp

ఈ మొబైల్ మెసెంజర్ అప్లికేషన్ ద్వారా పైసా చెల్లించకుండా ఎస్ఎంఎస్‌లను షేర్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఐఫోన్, బ్లాక్‌బెర్రీ, ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్ ఇంకా నోకియా హ్యాండ్‌సెట్‌లకు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X