స్మార్ట్‌ఫోన్ వెళుతరు కళ్లకు మంచిదేనా?

|

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను రోజంతా తదేకంగా చూస్తున్నారా? అయితే మీ కళ్లు జాగ్రత్త. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లను రోజుకు 150 కంటే ఎక్కువ సార్లు వీక్షించే వారిలో కంటి ఒత్తిడనేది ఎక్కువుగా ఉంటుందని అనేక సర్వేలు రుజువు చేసాయి. ఈ ఒత్తిడి అనేది ఒక్క స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాదట. కంప్యూటర్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ ఇలా దేని ముందు గంటల తరబడి కూర్చున్నా కళ్లకు ఇబ్బంది తప్పదట.

తీసుకోవల్సిన జాగ్రత్తలను విస్మరిస్తున్నారు...
 

తీసుకోవల్సిన జాగ్రత్తలను విస్మరిస్తున్నారు...

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో చాలా మంది తమతమ ఉద్యోగాల రిత్యా రోజస్తమానం కంప్యూటర్స్, ల్యాప్‌టాప్స్ అలానే స్మార్ట్‌ఫోన్స్ ముందు కూర్చుంటున్నారు. ఈ క్రమంలో వీళ్లు కంటి సంరక్షణ పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తలను విస్మరిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల కారణంగా తలెత్తే కంటి ఒత్తిడి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

రెండు సెకన్లకొకసారి కళ్లను బ్లింక్ చేస్తుండాలి..

రెండు సెకన్లకొకసారి కళ్లను బ్లింక్ చేస్తుండాలి..

స్మార్ట్‌ఫోన్ ముందు కూర్చొని ఎక్కువు సేపు వర్క్ చేస్తున్నప్పుడు ప్రతీ రెండు సెకన్లకు ఒకసారి కళ్లను బ్లింక్ చేస్తుండాలి. ఇదే సమయంలో కళ్లు తడారి పోకుండా ఎప్పటికప్పుడు నీటితో శుభ్రం చేస్తుండాలి.ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పెట్టేసి అటూ ఇటూ నడుస్తూ దృష్టిని మరలుస్తుండాలి. ఇంటీరియర్ లైటింగ్ కూడా ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

యాంటీ గ్లేర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్..

యాంటీ గ్లేర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్..

స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ల పై యాంటీ గ్లేర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ లేదా మాటీ స్క్రీన్ ప్రొటెక్టర్ ఫిల్మ్‌ను ఎక్విప్ చేయటం ద్వారా వ్యతిరేక కాంతి నుంచి దాదాపు మీ కళ్లను రక్షించుకోవచ్చు. అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు యాంటీ గ్లేర్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌లను.

డిస్‌ప్లే బ్రెట్‌నెస్‌‌ను తగ్గించుకోవటం ద్వారా..
 

డిస్‌ప్లే బ్రెట్‌నెస్‌‌ను తగ్గించుకోవటం ద్వారా..

ఫోన్ బ్రెట్‌నెస్‌ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం కళ్ల పై కచ్చితంగా ఉంటుంది. డిస్‌ప్లే బ్రెట్‌నెస్‌‌ను తగ్గించుకోవటం ద్వారా ఈ ఒత్తిడిని కొంత మేర తగ్గించుకోవచ్చు. టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్‌ స్థాయిని అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కంటెంట్‌ను సౌకర్యవంతంగా వీక్షించే వీలుంటుంది.

స్క్రీన్ కు  మీ కంటికి మధ్య గ్యాప్ ఉండాలి..

స్క్రీన్ కు మీ కంటికి మధ్య గ్యాప్ ఉండాలి..

స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం ద్వారా బ్యాక్టీరియా వంటి వ్యర్థాలు ఏమైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా తొలగిపోతాయి. తద్వారా స్క్రీన్ మరింత క్లియర్‌గా మీకు కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సేపు వర్క్ చేయవల్సి వచ్చినపుడు స్ర్కీన్‌కు మీ కంటికి మధ్య 16 నుంచి 18 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఇలా చేయటం వల్ల కొంత మేర ఒత్తిడిని మీరు జయించవచ్చు. నిత్యం కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు కంటి వైద్యుల సమక్షంలో రెగ్యులర్ చెకప్‌లకు హాజరవటం మంచిది.

Most Read Articles
Best Mobiles in India

English summary
5 Easy Ways to Save Your Eyes From Smartphone Strain.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X