మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

Posted By:

ఇతర ఆపరేటింగ్ సిస్టంల పై పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇందుకు కారణం, ఆండ్రాయిడ్ ఫోన్‌లు సులువుగా ఉపయోగించుకోగలిగే యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉండటమే. అంతే కాదండోయ్, ఈ ఫోన్‌లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో లభ్యమవుతున్నాయి.

మీ ఫోన్ నెమ్మదిగా ఛార్జ్ అవుతోందా..?
అనేక సౌకర్యాలను చేరువచేస్తోన్న ఆండ్రాయిడ్ ఫోన్‌లలో త్వరగా చార్జింగ్ అయిపోవటం, నెమ్మదిగా చార్జ్ అవటం, హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్ వంటి సమస్యలు తరచూ ఏర్పడటం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో సింపుల్ టెక్నిక్స్‌ను అప్లై చేయటం ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు.

మీ ఫోన్ తరచూ "Network not available" , "Not registered on Network", "Insert SIM card", వంటి నెట్‌వర్క్ సమస్యలను ఫేస్ చేస్తున్నట్లయితే ఈ సింపుల్ ట్రిక్స్‌ను ఫాలో అవ్వండి. మీకు తప్పనిసరిగా సొల్యూషన్ దొరుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ - 1 (ఫోన్ నుంచి బ్యాటరీ ఇంకా సిమ్ కార్డ్‌ను తొలగించటం)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

ఫోన్ నుంచి బ్యాటరీ ఇంకా సిమ్ కార్డ్‌ను తొలగించి రీ-ఇన్సర్ట్ చేయటం ద్వారా నెట్‌వర్క్ ఎర్రర్ తొలగిపోయే అవకాశముంది. ఈ ట్రిక్‌ను అప్లై చేసేందుకు..

ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను పవర్ ఆఫ్ చేసి బ్యాటరీ ఇంకా సిమ్ కార్డ్‌ను తొలగించాలి. ఒక 5 నిమిషాల తరువాత తిరిగి వాటిని రీ-ఇన్సర్ట్ చేసి ఫోన్ స్విచ్ ఆన్ చేయండి. మీ నెట్‌వర్క్ ఎర్రర్ పరిష్కారమయ్యే అవకాశముంది.

 

 

ట్రిక్ - 2 (సెట్టింగ్స్‌లోకి వెళ్లటం)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

ట్రిక్ - 1ను ప్రయత్నించి చూసినప్పటికి ఫలితం లేనట్లయితే డివైస్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ట్రిక్-2ను ప్రయత్నించండి. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి వైర్‌లెస్ అండ్ నెట్‌వర్క్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. ఈ సెట్టింగ్స్‌లో మొబైల్ నెట్‌వర్క్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకని నెట్‌వర్క్ ఆపరేటర్స్ ఆప్షన్ పై టాప్ చేయండి. మీ నెట్‌వర్క్ ఆటోమెటిక్‌గా సెలక్ట్ అవుతుంది.

 

ట్రిక్ - 3

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

ట్రిక్ - 3

ట్రిక్ - 1, ట్రిక్ - 2లను ప్రయత్నించి చూసినప్పటికి సమస్య పరిష్కారం కాకపోయినట్లయితే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి. సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

 

ట్రిక్ - 4

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

ట్రిక్ - 4

ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయటం ద్వారా నెట్‌వర్క్ సమస్యలు తొలగిపోయే అవకాశముంది. ఫోన్‌ను రీసెట్ చేసే క్రమంలో ముందుగా డివైస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తరువాత బ్యాకప్ అండ్ రీసెట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఫ్యాక్టరీ డేటా రీసెట్ పై క్లిక్ చేయండి. ఫోన్ రీసెట్ అయిపోతుంది.

 

ట్రిక్ - 5 (రేడియో సిగ్నల్ టెస్ట్)

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో నెట్‌వర్క్ సమస్యలా..?

ట్రిక్ - 5 (రేడియో సిగ్నల్ టెస్ట్)

రేడియో సిగ్నల్ టెస్ట్ చేయటం ద్వారా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఎర్రర్‌కు సంబంధించి ఏమైనా హార్డ్‌వేర్ సమస్యలు ఉన్నట్లయితే తెలిసిపోతాయి...

స్టెప్ 1: ముందుగా మీ ఫోన్ నుంచి *#*#4636#*#* డయల్ చేయండి.

స్టెప్ 2: టెస్టింగ్ మెనూకు ప్రాంప్ట్ చేయబడతారు.

స్టెప్ 3: ఇక్కడ ఫోన్ ఇన్ఫర్మేషన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4: పింగ్ టెస్ట్‌ను రన్ చేయండి.

స్టెప్ 5 : ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Quick Steps to Fix 'Mobile Network Not Available' Error on your Android Smartphone!. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot