మోసపూరిత ఫేస్‌బుక్ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

|

సోషల్ నెట్‌వర్కింగ్ మరింతగా విస్తరించిన నేపధ్యంలో ఫేస్‌బుక్ వినియోగం తారా స్ధాయికి చేరుతోంది. ఫేస్‌బుక్ ఆకౌంట్ యాక్సిస్ స్మార్ట్‌ఫోన్‌లలోనూ సాధ్యమవటంతో ఇండియా వంటి దేశాల్లో మొబైల్ ఫేస్‌బుక్ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

మోసపూరిత ఫేస్‌బుక్ అకౌంట్‌లను గుర్తించటం ఎలా..?

Read More : YouTube Go..ఈ యాప్‌కు ఇంటర్నెట్ అవసరం లేదు

హ్యాకింగ్ సమస్య ఆన్‌లైన్ ప్రపంచాన్ని వేధిస్తున్న నేపధ్యంలో ఫేస్‌బుక్ యూజర్లు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మీకు తెలయని ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందా. సదరు వ్యక్తి అభ్యర్థనను అంగీకరించే ముందు ఆ అకౌంట్ మంచిదో నకిలీదో తెలుసుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది.

స్టెప్ 1

స్టెప్ 1

మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను పంపిన అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి ప్రొఫైల్‌ను తెరచి ఫోటోల కోసం శోధించండి. ప్రొఫైల్‌లో ఒక ఫోటో మాత్రమే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా ఫేక్ అకౌంటే. ఆ అకౌంట్‍కు సంబంధించి స్టేటస్ అప్‌డేట్‌లతో పాటు వాల్ పోస్టులు ఇంకా కామెంట్‌లను చూడండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఆ ఫేస్‌బుక్ అకౌంట్ యూజర్ చాలా కాలం క్రితం నుంచి ఎటువంటి పోస్టింగ్స్ ఇంకా కామెంట్లకు పాల్పడనట్లయితే నకిలీ అకౌంట్ గానే భావించాల్సి ఉంటుంది.

స్టెప్ 3

స్టెప్ 3

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి స్నేహితుల జాబితాను తిరగవేయండి. అందులో ఎక్కువ శాతం మంది స్నేహితులు వ్యతిరేక జెండర్ అయినట్లయితే ఆ అకౌంట్ సరదా కోసం సృష్టించనదని నిర్థారణకు రావచ్చు.

స్టెప్ 4

స్టెప్ 4

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి వ్యక్తిగత సమాచారమైన ఎడ్యుకేషన్, ఉద్యగం ఇంకా ఇతర ఆసక్తిలకు సంబంధించిన వివరాలను అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి.

స్టెప్ 5

స్టెప్ 5

సదరు అకౌంట్ హోల్డర్, డేటింగ్ ఇంకా మహిళలు ఇంకా పురుషుల పట్ల ఆసక్తి వంటి అంశాలను ప్రస్తావించినట్లయితే నకిలీ అకౌంట్‌గా గుర్తించాల్సి ఉంటుంది.

స్టెప్ 6

స్టెప్ 6

ఆడవారి ప్రొఫైల్స్‌ను కలిగి ఉన్న నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఫోన్ నెంబర్లను కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు.

స్టెప్ 7

స్టెప్ 7

అనుమానాస్పద ఫేస్‌బుక్ అకౌంట్‌కు సంబంధించి పుట్టిన రోజు వివరాలను క్షుణ్నంగా పరిశీలించండి. 1-1-1990, 31-12-1988 వంటి ఫ్యాన్సీ తేదీలు మీరు తారసపడినట్లయితే ఓ సారి ఆలోచించండి.

Best Mobiles in India

English summary
5 Signs to Spot A Fake Facebook Profile. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X