Home
How to

మీ ఫోన్‌లో Jio స్పీడ్ తగ్గుతోందా..?

By Sivanjaneyulu Bommu

ప్రస్తుత టెలికం మార్కెట్లో Reliance Jio హవా నడుస్తోంది. ప్రివ్యూ ఆఫర్‌తో గడిచిన మేలో మార్కెట్లోకి దూసుకొచ్చిన జియో తొలినాళ్లలో కొంత మంది యూజర్లకే పరిమితమైంది.

మీ ఫోన్‌లో Jio స్పీడ్ తగ్గుతోందా..?

Read More : LeEcoతో చేతులు కలిపిన Jio

సెప్టంబర్ 5 లాంచ్ తరువాత జియో అందరికి అందుబాటులోకి వచ్చేసింది. Welcome offer పేరుతో జియో అందిస్తోన్న ఉచిత ఆఫర్ స్కీమ్ డిసెంబర్ 31, 2016 వరకు అందుబాటులో ఉంటుంది. జియో వెలకమ్ ఆఫర్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ 4జీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే అన్‌లిమిటెడ్ ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు.

Read More : మీ ఏరియాలో Jio 4G నెట్‌వర్క్ కవరేజ్‌ను చెక్ చేయటం ఎలా..?

#1

#1

సెప్టంబర్ 5 నుంచి రిలయన్స్ జియో అందరికి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఈ సిమ్‌లకు భారీగా డిమాండ్ నెలకుంది. దేశవ్యాప్తంగా జియో నెట్‌వర్క్ వాడకం ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కొన్ని చోట్లా స్లో డేటా స్సీడ్స్ నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో యూజర్లు కొన్ని ట్రిక్స్‌ను ఫాలో అవటం ద్వారా జీయ్ స్పీడ్ సమస్యను అధిగమించవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం...

#2

#2

రిలయన్స్ జియో వివిధ రకాల డేటా స్పీడ్‌లను వివిధ రకాల bandలలో ఆఫర్ చేస్తుంది. వాటిలో band 40 ఇతర బ్యాండ్‌లతో పోలిస్తే వేగవంతమైన డేటా స్పీడ్స్‌ను ఆఫర్ చేస్తోంది. మీ ఫోన్ ఎల్టీఈ బ్యాండ్‌ను బ్యాండ్ 40కి మార్చుకోవటం ద్వారా హై డేటా స్పీడ్‌ను మీరు ఆస్వాదించవచ్చు.

#3

#3

మీరు క్వాల్కమ్ ప్రాసెసర్‌తో వస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లను వాడుతున్నట్లయితే *#*#4636#*#* సీక్రెట్ కోడ్‌ను అప్లై చేసి ఎల్టీఈ బ్యాండ్‌ను band 40కి మార్చుకోవచ్చు. అయితే ఈ ట్రిక్ వన్‌ప్లస్ 3, షియోమీ ఎంఐ 5 వంటి క్వాల్కమ్ చిప్ డివైస్‌లలో మాత్రమే వర్క్ అవుతోంది.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్‌ను ప్రయోగించే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, దానికి GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

#4

#4

మీడియాటెక్ ప్రాసెసర్‌తో వస్తోన్న కొన్ని ఫోన్‌లలో ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చేందుకు స్టెప్ 1ను అనుసరిస్తే సరిపోతుంది. మరికొన్ని ఫోన్ లలో మాత్రం MTK Engineering toolను డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్‌ను ప్రయోగించే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, దానికి GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

 

#5

#5

ఎల్టీఈ బ్యాండ్‌ను మార్చిన తరువాత ఫోన్‌లోని APN Settingsను మార్చుకోవల్సి ఉంటుంది. కాబట్టి ఈ క్రింది విధంగా APN Settingsను క్రియేట్ చేయండి.

Name - RJio
APN - jionet
APN Type - Default
Proxy - No changes
Port - No changes
Username - No changes
Password - No changes
Server - www.google.com
MMSC - No changes
MMS proxy - No changes
MMS port - No changes
MCC - 405
MNC - 857 or 863 or 874
Authentication type - No changes
APN Protocol - Ipv4/Ipv6

#6

#6

ఈ APN Settings అన్ని సందర్భాల్లో వర్క్ కాకపోవచ్పు. కాబట్టి ట్రిక్‌ను అప్లై చేసే ముందు మీ పాత APN వివరాలను బ్యాకప్ చేసుకోవటం మంచిది.

#7

#7

APN Settingsను మార్చిన తరువాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి Snap VPN appను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ యాప్ పూర్తిగా ఉచితం.

#8

#8

Snap VPN appను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత మీరు France/ Singapore సర్వర్‌కు కనెక్ట్ అవుతారు. ఈ రెండు సర్వర్లు హై స్పీడ్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను ఆఫర్ చేస్తాయి. దీంతో మీ జియో నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్స్ మరింతగా మెరుగుపడతాయి.

(పాఠకులకు మనవి : ఈ ట్రిక్‌ను ప్రయోగించే క్రమంలో ఏమైనా తప్పిదాలు చోటుచేసుకున్నట్లయితే, దానికి GIZBOT ఏ విధమైన బాధ్యత వహించదు. యూజర్ పూర్తిగా తన రిస్క్‌తోనే నిర్ణయం తీసుకోవల్సి ఉంది)

Best Mobiles in India

English summary
100% Working: 5 Simple Steps to Increase Reliance Jio 4G Download Speed up to 20mbps. Read More in TelugU Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X