స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

Posted By:

మనిషి శరీర భాగాల్లో కళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే, మనిషి తన నేత్రాల ద్వారానే వాస్తవిక ప్రపంచాన్ని వీక్షంచగలడు. ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకున్న పెను మార్పుల రిత్యా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్‌లు వినియోగించాల్సి వస్తోంది. చిన్న పిల్లలు మొదలుకుని పెద్ద వయసు వారి వరకు స్మార్ట్‌ఫోన్‌లను ఎదతెరిపి లేకుండా వాడేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లతో ఎక్కువ సేపు గడిపేవారు తమ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా అవసరం. స్మార్ట్‌ఫోన్ తెరను నిరంతరాయంగా చూస్తుండటం వల్ల కళ్ల పై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి, కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ స్మార్ట్‌ఫోన్‌ల పై ఎక్కువ గంటల గడుపుతోన్న యూజర్లకు పలు సూచనలు....

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

ఫోన్ బ్రెట్‌నెస్‌ను తగ్గించుకోండి

ఫోన్ బ్రెట్‌నెస్‌ స్థాయిను సౌకర్యవంతంగా అమర్చుకోవటం వల్ల కళ్ల పై ఒత్తిడిని కొంత మేర తగ్గించుకోవచ్చు. ఫోన్ బ్రెట్‌నెస్‌ స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రభావం కళ్ల పై కచ్చితంగా ఉంటుంది.

 

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్‌ను అడ్జస్ట్ చేసుకోండి

ఫోన్‌లోని టెక్స్ట్ సైజ్ ఇంకా క్రాంటాస్ట్‌ స్థాయిని అడ్జస్ట్ చేసుకోవటం వల్ల కంటెంట్‌ను సౌకర్యవంతంగా వీక్షించవచ్చు. అంతే కాకుండా, కళ్ల పై పడే ఒత్తిడి ఎంతో కొంత తగ్గుతుంది.

 

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

యాంటీ రిఫ్లెక్టివ్ స్ర్కీన్ ప్రొటెక్టర్

మీ స్మార్ట్‌ఫోన్‌కు ఒరిజినల్ క్వాలిటీతో కూడిన యాంటీ రిఫ్లెక్టివ్ స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను అమర్చటం ద్వారా కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

 

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

15 అంగుళాల దూరంలో ఉంచండి

ఫోన్ ఆపరేట్ చేస్తున్నపుడు మీ కళ్లకు ఫోన్‌కు మధ్య కనీసం 15 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోండి. అలానే స్మార్ట్‌ఫోన్‌ను నిరంతరాయంగా వినియోగించాల్సి వచ్చినపుడు ప్రతి 10 నిమిషాలకు కొద్ది సేపు మీ కళ్లకు విశ్రాంతినివ్వండి.

 

స్మార్ట్‌ఫోన్ ఒత్తిడి నుంచి మీ కళ్లను రక్షించుకోవటం ఏలా..?

స్మార్ట్‌ఫోన్ తెరను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Simple Ways To Save Your Eyes From Smartphone Strain. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot