ఈ టిప్స్‌తో మీ గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీ గ్యారంటీ..

|

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచం ఇంటర్నెట్ పై ఆధారపడి జీవిస్తోందన్న విషయం మనందరికి తెలుసు. ఇటీవల కాలంలో చోటుచేసుకుంటోన్న పరిస్థితులను గమనిస్తున్నట్లయితే కంప్యూటర్స్ అలానే స్మార్ట్‌ఫోన్‌ల పై సెక్యూరిటీ పరమైన రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రోజువారి అవసరాల నిమత్తం మనం వినియోగించుకుంటోన్న గాడ్జెట్‌లకు మినిమమ్ సెక్యూరిటీని కల్పించుకుందుకు 5 ప్రాథమిక చిట్కాలు...
యాంటీ వైరస్ అవసరం...
ఇంటర్నెట్ వినియోగం పెరుగుతోన్న కొద్దీ వైరస్‌ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. వైరస్‌తో ఎఫెక్ట్ అయిన కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్‌లో పనితీరు అనేది పూర్తిగా మందగిస్తుంది. అప్లికేషన్‌లు వాటికిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తాయి. ఈ సమస్య మరింత ఉధృతమయితే డివైస్ పనిచేయటమే మానేస్తుంది. ఈ వైరస్‌లను నియంత్రించే కమ్రంలో అనేకమైన యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లు మార్కెట్లో పుట్టుకొస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లను ముందస్తుగానే మీ డివైసుల్లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే వైరస్‌ల ముప్పునుంచి బయపడొచ్చు.

 

 ఈమెయిల్ ఫిష్షింగ్‌తో జాగ్రత్త..

ఈమెయిల్ ఫిష్షింగ్‌తో జాగ్రత్త..

ఈ తరహా స్కామ్‌లలో భాగంగా మీకో మెయిల్ వస్తుంది. మీ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని, కాబట్టి ఈ లింక్ పై క్లిక్ చేసి ఐడీ ఇంకా పాస్‌వర్డ్ మార్చుకోవాలని ఆ మెయిల్‌లో ఉంటుంది. పొరపాటున ఈ విధమైన లింక్స్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి.

 

 

పబ్లిక్ వై-ఫైతో జరభద్రం..

పబ్లిక్ వై-ఫైతో జరభద్రం..

మనలో చాలా మంది పబ్లిక్ వై-ఫై పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఎందుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉచితం కాబట్టి. షాపింగ్ మాల్స్, కాఫీ షాప్స్, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇలా అనేక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ వై-ఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్ ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్స్ మాత్రం చాలానే ఉన్నాయి.

వినియోగించటం వల్ల..
 

వినియోగించటం వల్ల..

పబ్లిక్ వై-ఫైను వినియోగించటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. పబ్లిక్ వై-ఫై హాట్ స్పాట్‌లకు మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసినపుడు కొన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా సేఫ్ జోన్‌లో ఉండొచ్చు. పబ్లిక్ వై-ఫైతో కనెక్ట్ అయి ఉన్నపుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్ వంటి లావాదేవీలను నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

 పటిష్టమైన పాస్‌వర్డ్స్ అవసరం..

పటిష్టమైన పాస్‌వర్డ్స్ అవసరం..

ఇంటికి తాళం ఎంత ముఖ్యమో, ఆన్‌లైన్‌ సర్వీసులకు పాస్‌వర్డ్‌ అంతేనని తెలిసిందే. చాలా మంది తమ పేరునే పాస్‌వర్డ్‌గా వాడుతుంటారు. ఇది సురక్షితం కాదంటున్నారు నిపుణులు. కేవలం Lowercase అక్షరాలతో పెట్టుకున్న మీ పాస్‌వర్డ్‌ తెలుసుకోడానికి హ్యాకర్లకు 10 నిమిషాలే పడుతుందట. అదే పాస్‌వర్డ్‌ని Uppercase అక్షరాల్లో పెడితే కనుక్కోవడానికి 10 గంటలు పడుతుందని చెబుతున్నారు. అంకెల్ని, గుర్తుల్ని కూడా పాస్‌వర్డ్‌లో పెడితే తెలుసుకోవడానికి హ్యాకర్‌ కంప్యూటర్‌కి సుమారు 18 రోజులు పడుతుందట.

 డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం

డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం

డైలీ మెయిల్‌ నివేదిక ప్రకారం సుమారు 50 శాతం మంది నెటిజెన్లు ఒకే రకమైన పాస్‌వర్డ్‌లు వాడుతున్నారు. చాలామంది 123456, Password, 12345678, qwerty, abc123లనే వాడుతున్నారని వారి పరిశీలనలో తేలింది. నిపుణుల సలహా ఏంటంటే పాస్‌వర్డ్‌ కచ్చితంగా 9 అంకెల కంటే తక్కువ ఉండకూడదు. అక్షరాలతో పాటు నెంబర్లు, గుర్తుల్ని జత చేయాలి. ఇదే సమయంలో టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ (2FA) సెక్యూరిటీ ప్రాసెస్ ను కూడా యూజర్లు వినియోగించుకోవాలి.

 Wi-Fi router సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త..

Wi-Fi router సెక్యూరిటీ విషయంలో జాగ్రత్త..

మార్కెట్లో లభ్యమవుతోన్న చాలా వరకు రౌటర్స్ బేసిక్ సెక్యూరిటీ ఫీచర్లతో వస్తున్నాయి. వీటిని మీరు కస్టమైజ్ చేసుకుని శక్తివంతమైన పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోవటం ద్వారా మీ నెట్ వర్క్ మరింత బలోపేతమవుతుంది. మార్కెట్లో లభ్యమవుతున్న కొన్ని టాప్‌ఎండ్ రౌటర్స్.. ఇన్‌బుల్ట్ యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు అదనపు సెక్యూరిటీ సెట్టింగ్స్‌తో వస్తున్నాయి. కొంచం డబ్బులు ఎక్కువైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఎంపిక చేసుకోండి.

 

 

Best Mobiles in India

English summary
Given the plethora of threats across these multiple devices, users need to be especially vigilant. We’ve got you covered, so check out these recommendations.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X