Home
How to

ల్యాప్‌టాప్ కొనేముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి

విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు.

By Sivanjaneyulu Bommu

డెస్క్‌టాప్ పీసీలకు అప్‌డేటెడ్ వర్షన్‌గా పుట్టుకొచ్చిన ల్యాప్‌‌టాప్‌లు, పోర్టబుల్ కంప్యూటింగ్‌ను చేరువ చేయటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులు మొదలుకుని జాబ్ ప్రొఫెషనల్స్ వరకు ల్యాప్‌టాప్‌లను అనేక విధాలుగా వాడుకుంటున్నారు. కంప్యూటర్‌ కొనాలి అనుకునే వారికి ముఖ్యంగా 3 ప్రధానమైన ఆప్షన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు..

ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు..

మొదటిది డెస్క్‌టాప్‌, అంటే మానిటర్‌, సిపియు, కీబోర్డ్‌, మౌస్‌ ఇలా విడివిడిగా ఉంటాయి. రెండవది లాప్‌టాప్‌ డెస్క్‌టాప్‌ కన్నా లాప్‌టాప్‌ చాలా చిన్నదిగా సింపుల్‌గా ఉంటుంది. మూడవది టాబ్లెట్. కాంపోనెంట్స్ మార్చుకునే విషయంలో డెస్క్‌టాప్ యూజర్‌కు ఉన్నంత స్వేచ్ఛ ల్యాప్‌టాప్ యూజర్‌కు ఉండదు. ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు గుర్తుపెట్టుకోవల్సిన 5 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం...

15 అంగుళాల డిస్‌ప్లేతో..

15 అంగుళాల డిస్‌ప్లేతో..

మీరు ఎంపిక చేసిన ల్యాప్‌టాప్ ఖచ్చితమైన డిస్‌ప్లే సైజులో ఉండాలి. 15 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ల్యాప్‌టాప్ మీ డెస్క్‌టాప్ కంప్యూటర్‌కు మంచి రీప్లేస్‌మెంట్‌గా భావించవచ్చు. మార్కెట్లో 12 అంగుళాల సైజులో ల్యాప్‌టాప్‌లు దొరకుతున్నప్పటికి, ఇవి డెస్క్‌టాప్‌తో పోటీగా పనిచేయకపోవచ్చు.

పోర్ట్స్ ఎక్కువుగా ఉండాలి...

పోర్ట్స్ ఎక్కువుగా ఉండాలి...

మీరు ఎంపిక చేసుకునే ల్యాప్‌టాప్‌కు పోర్ట్స్ (Ports) చాలా ముఖ్యం. స్టాండర్డ్ ల్యాప్‌టాప్‌కు కనీసం రెండు మూడు పోర్ట్స్ అయినా ఉండాలి. వీటి ద్వారా మీ డివైస్‌ను రకరకాల డివైస్‌లకు కనెక్ట్ చేసుకునే వీలుంటుంది. ఆడియో జాక్ కూడా అవసరం.

 డిటాజబుల్ డిస్‌ప్లేలతో..

డిటాజబుల్ డిస్‌ప్లేలతో..

విండోస్ 10తో వస్తోన్న ల్యాప్‌టాప్‌లు డిటాజబుల్ డిస్‌ప్లేలతో లభ్యమవుతున్నాయి. ఈ కన్వర్టబుల్ కంప్యూటింగ్ డివైస్‌లను ల్యాప్ అలానే, టాబ్లెట్ పీసీలా రెండు రకాలుగా వాడుకోవచ్చు.

టచ్‌స్ర్కీన్ ల్యాప్‌టాప్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్త...

టచ్‌స్ర్కీన్ ల్యాప్‌టాప్‌ల ఎంపిక విషయంలో జాగ్రత్త...

మార్కెట్లో దొరుకుతున్న పలు విండోస్ టచ్‌స్ర్కీన్ ల్యాప్‌టాప్‌లు ఫేలవమైన పనితీరును కలిగి ఉండటంతో నెగిటివ్ టాక్ వ్యక్తమవుతోంది. కాబట్టి, ఆధునిక వర్షన్ ల్యాప్‌టాప్‌ల ఎంపికలో ఆచితూచి వ్యవహరించండి.

గూగుల్ క్రోమ్ బుక్‌ల వినియోగం  పెరుగుతోంది....

గూగుల్ క్రోమ్ బుక్‌ల వినియోగం పెరుగుతోంది....

మార్కెట్లో గూగుల్ క్రోమ్ బుక్‌ల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా స్టూడెంట్ కమ్యూనిటీ ఈ క్రోమ్‌బుక్‌లకు అట్రాక్ట్ అవుతోంది. క్రోమ్‌బుక్‌లను వాడుతోన్న చాలామంది యూజర్లు పాజిటివ్ రెస్పాన్స్‌ను వ్యక్తం చేస్తున్నారు.

Best Mobiles in India

English summary
5 things to consider Before buying a new laptop. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X