యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

Posted By:

యూట్యూబ్‌లో వీడియో వీక్షణ అత్యుత్తమ వినోదాలలో ఒకటి. ఈ వీడియోలను అంతరాయం లేకుండా వీక్షించేందుకు కంప్యూటర్ అదేవిధంగా ఇంటర్నెట్ ఉంటే చాలు. అయితే, యూట్యాబ్‌లోని వీడియోలను కంప్యూటర్‌లో ఏలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?. యూట్యూబ్ ఇంకా ఇతర వీడియో సైట్‌ల నుంచి నచ్చిన వీడియోలను వివిధ ఫార్మాట్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఐదు అత్యుత్తమ టూల్స్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా సులువైన మార్గాలలో మీకు నచ్చిన ఆన్‌లైన్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

యూట్యాబ్‌లోని వీడియోలను మొబైల్‌లోకి ఏలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..?, ‘యూట్యూబ్ గెట్'అనే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ యూట్యూబ్ వీడియోలను వివిధ ఫార్మాట్‌లలో డౌన్‌లోడ్ చేసుకునేందుకు దోహదపడతుంది. ఈ అప్లికేషన్‌ను ముందుగా మీ పీసీలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఎంపిక చేసుకున్నయూట్యాబ్‌లోని వీడియోలను ‘యూట్యూబ్ గెట్' అప్లికేషన్ ద్వారా కావల్సిన ఫార్మాట్‌లలోకి మలచుకుని ఓ ఫోల్డర్‌లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్న వీడియోలను యూఎస్బీ కేబుల్ ఆధారంగా మీ మొబైల్‌లోకి డౌన్ చేసుకుని కంప్యూటర్ అదేవిధంగా ఇంటర్నెట్‌తో పనిలేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

కీప్‌విడ్ (KeepVid):

ఇంటర్నెట్ నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కీప్‌విడ్ టూల్ మరింత అనువుగా ఉంటుంది. ముందుగా డౌన్‌లోడింగ్ కావలనుకున్న వీడియో యూఆర్‌ఎల్‌ను కాపీ చేసుకుని సదరు లింక్‌ను http://keepvid.com/లోకి లాగినై డౌన్‌లోడ్ లింక్‌లో ఎంటర్ చేస్తే సరిపోతుంది. అయితే, మీ పీసీ జావాను సపోర్ట్ చేసేదిగా ఉండాలి.

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

సేవ్‌విడ్ (SaveVid):

ఇంటర్నెట్ ద్వారా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఏర్పడ్డ మరో టూల్ సేవ్‌విడ్. కీప్‌విడ్ తరహాలోనే ఈ టూల్ స్పందించాలంటే మీ సిస్టం జావాను సపోర్ట్ చేసేదిగా ఉండాలి. యూట్యూబ్, గూగుల్ వీడియోస్, మెటాకేఫ్, ఫేస్‌బుక్, విమియో, బ్లిక్.టీవీ వంటి సైట్‌లను ఈ టూల్ సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

వైటీడీ వీడియో డౌన్‌లోడర్ (YTD Video Downloader):

ఈ వీడియో డౌన్‌లోడింగ్ టూల్ యూట్యూబ్‌తో సహా 60 సైట్‌లను సపోర్ట్ చేస్తుంది. హెచ్‌డి ఇంకా ఇంకా హెచ్‌క్యూ క్వాలిటీలలో వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ టూల్ ప్రో ఆకౌంట్ ధర రూ.800. లింక్ అడ్రస్

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

వీడియోగ్రాబర్ (VideoGrabber):

ఈ టూల్‌ను ఎంచుకోవటం ద్వారా యూట్యూబ్, విమియో, డెయిలీ మోషన్, మెటాకేఫ్, మైస్పేస్ టీవీ, దిఆనియన్, నేషనల్ జియోగ్రాఫిక్, బ్లిప్.టీవీ, బ్రేక్ వంటి ప్రముఖ సైట్‌ల నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైడెఫినిషన్ వీడియోలను సైతం ఈ టూల్ సపోర్ట్ చేస్తుంది. సదరు వీడియో లింక్‌ను టూల్‌లో ఎంటర్ చేసిన వెంటనే వివిధ ఫార్మాట్ ఆప్షన్‌లను క్రింద డిస్‌ప్లే చేస్తుంది. లింక్ అడ్రస్

యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు 5 టూల్స్

ఫైర్‌ఫాక్స్ వీడియో డౌన్‌లోడ్ హెల్పర్ (Firefox Video Download Helper):

ఈ ఫైర్‌ఫాక్స్ వీడియో డౌన్‌లోడ్ హెల్పర్ యూట్యూబ్, విమియో, గూగుల్ వీడియో, నేషనల్ జియోగ్రాఫిక్, హౌ‌స్టఫ్ వర్క్స్, నాసా వంటి ప్రముఖ సైట్‌లను సపోర్ట్ చేస్తుంది. లింక్ అడ్రస్

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot