మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..? అయితే, మీ ఫోన్ పనితీరు అంతకంతకు బాగుండాలంటే గూగుల్ ప్లే స్టోర్‌లో హల్‌చల్ చేస్తోన్న పలు ఉపయుక్తమైన అప్లికేషన్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటంది. నేటి ప్రత్యేక శీర్షికలో మేము సూచించబోయే 5 ఆండ్రాయిడ్ యాప్‌లను ఓ సారి ట్రై చేసి చూడండి. ఫలితాలు మీకే తెలుస్తాయ్...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

GreenPower Free Battery Saver

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

GreenPower Free Battery Saver
ఇన్‌స్టాల్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.

బ్యాటరీ బ్యాకప్‌ను ఆదా చేసేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. బ్యాటరీ శక్తిని హరించివేస్తున్న అవసరం లేని అన్ని బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లన్నింటిని ఈ యాప్ దాదాపుగా నిలిపివేస్తుంది. వై-ఫై, మొబైల్ డేటా (2జీ, 3జీ, 4జీ), బ్లూటూత్, జీపీఎస్, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ తదితర అంశాల పై ఈ యాప్ ప్రధానంగా దృష్టిసారించటం వల్ల బ్యాటరీ ఆదా అదే సమయలో డేటా ఛార్జీలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఫ్రోయో నుంచి కిట్‌క్యాట్ వరకు అన్ని ఆండ్రాయిడ్ వర్షన్‌లను ఈ యాప్ సపోర్ట్ చేస్తుంది.

 

Clean Master Speed Booster

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

Clean Master Speed Booster

ఇన్‌స్టాల్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.

పేరుకు తగ్గట్టుగానే ఈ క్లీన్ మాస్టర్ స్పీడ్ బూస్టర్ యాప్ మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతంది. ఫోన్‌లో పేరుకుపోయి ఉన్న అన్ని పనికిరాని ఫైళ్లను ఈ యాప్ తొలగించి డివైస్ పనితీరను మరింత వేగవంతం చేస్తుంది. స్మార్ట్‌ఫోన్ ఓవర్ హీట్‌కు లోనుకాకుండా ఈ యాప్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ర్యామ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఫోన్ ను ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూ మిమ్మల్ని అప్రమత్తం చేస్తుంది. యాప్ మేనేజర్, సీపీయూ బూస్ట్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ యాప్‌లో దాగి ఉన్నాయి.

 

AirDroid - Android on Computer

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

AirDroid - Android on Computer

ఇన్‌స్టాల్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.

ఎయిర్‌డ్రాయిడ్ యాప్‌ను ఈ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా యూఎస్బీ కేబుల్ అవసరం లేకుండా ఫైళ్లను టాబ్లెట్ ఇంకా పీసీలకు వైర్‌లెస్ సౌకర్యంతో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అయితే, ఫైళ్లను అందుకోబోయే పీసీ లేదా టాబ్లెట్‌లలోనూ ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ యాప్ ఐపీ అడ్రస్ ద్వారా కనెక్ట్ అవుతుంది.

 

Titanium Backup

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

Titanium Backup

ఇన్‌స్టాల్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని డేటాతో పాటు అప్లికేషన్‌లను బ్యాకప్ చేసుకునేందుకు ఈ యాప్ దోహద పడుతుంది. ఇందులో భాగంగా ఫోన్‌కు రూట్ యాక్సెస్ అవసరం ఉంటుంది.

 

Root Browser

మీ ఆండ్రాయిడ్ ఫోన్ కోసం 5 యాప్స్!

Root Browser

ఇన్‌స్టాల్ చేసేకునేందుకు క్లిక్ చేయండి.

ఈ ఫైల్ మేనేజర్ యాప్ మీ ఫోన్‌లోని ఫైల్స్‌ను ఎటుకావాలంటే అటు మార్చుకునేందుకు, జిప్ ఫైల్స్‌లా మార్చేందుకు అవసరం లేకుంటే డిలీట్ చేసేకునేందుకు దోహదపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రూట్ బ్రౌజర్ యాప్ ద్వారా మీ ఫోన్‌లోని  ఫైల్స్‌ను ఇస్టమొచ్చిన రితీలో సార్ట్ చేసుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Usefull Apps For Every Android Smartphone User. Read more in Telugu Gizbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting