మీ ఫోన్ బ్యాటరీ సురక్షితమో కాదో చెక్ చేసుకోండి

ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్‌లు పేలుడుకు గురువుతున్న సంఘటనలను అనేకం వింటున్నాం. మొబైల్ ఫోన్‌లు బ్లాస్ట్ అవటానికి బ్యాటరీనే ప్రధాన కారణం. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడేందుకు పలు ముఖ్యమైన సూచనలు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టిప్ 1

బ్యాటరీలు బ్లాస్ట్ అవటానికి ప్రధాన కారణం అవి హీటెక్కటమే. మీరు ఫోన్ వాడుతున్నప్పుడుగాని, ఛార్జింగ్‌లో ఉంచినప్పుడు గాని ఫోన్ అమితంగా హీటెక్కుతున్నట్లయితే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్యాటరీనీ రీప్లేస్ చేయవల్సి ఉంటుంది.

టిప్ 2

మీ ఫోన్‌ బ్యాటరీ మంచి కండీషన్‌లో ఉందో, లేదో..? తెలుసుకోవడానికి స్పిన్ టెస్ట్‌ను నిర్వహించండి. ముందుగా మీ బ్యాటరీ చదునైన నేల పై ఉంచి బొంగరంలో తిప్పండి. బ్యాటరీ చాలా సులువుగా తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా బ్యాటరీ ఉబ్బినట్లే. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే బ్యాటరీనీ రీప్లేస్ చేయవల్సి ఉంటుంది.

టిప్ 3

మీ ఫోన్‌‌లలో ఓరిజినల్ బ్యాటరీలను మాత్రమే ఉపయోగించండి. నాసిరకం బ్యాటరీల జోలుకు పోకండి. ఉబ్బి ఉన్న బ్యాటరీని వాడటం మంచిది కాదు. కాబట్టి, వీలైనంత త్వరగా బ్యాటరీని మార్చేయండి. ఫోన్ పూర్తిగా చార్జ్ అయిన వెంటనే బ్యాటరీ ప్లగ్ నుంచి ఫోన్ ను తొలగించండి. వేడి ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచొద్దు.

టిప్ 4

మీ ఫోన్ బ్యాటరీ లెవల్స్ త్వరగా డ్రాప్ అవుతున్నట్లయితే బ్యాటరీ ప్రమాదంలో ఉందని గ్రహించండి. వెంటనే కొత్త బ్యాటరీని ఫోన్ లో రీప్లేస్ చేయండి.

టిప్ 5

నాసిరకం చార్జర్లలో తక్కువ నాణ్యతతో కూడిన హార్డ్‌వేర్‌ను ఉపయోగిచటం వల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, బ్యాటరీ చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం.

టిప్ 6

ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి. వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం వల్ల బ్యాటరీ పై ఆ వేడి ఉష్ణోగ్రతలు కచ్చితంగా దుష్ప్రభావం చూపుతాయి. కాబట్టి, సాధ్యమైనంత వరకు వేడి వాతావరణంలో మీ స్మార్ట్‌‌ఫోన్‌ను ఉంచొద్దు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Ways to Check if Your Phone Battery Safe Or Not. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot