గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించడానికి సూచించదగిన 5 మార్గాలు

కంప్యూటర్ మరియు మొబైల్ గేమ్స్ అనేవి పదుల సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూనే ఉన్నాయి.

|

కంప్యూటర్ మరియు మొబైల్ గేమ్స్ అనేవి పదుల సంవత్సరాలుగా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూనే ఉన్నాయి. పెరుగుతున్న జనాదరణ మూలంగా గేమ్స్ విప్లవాత్మకంగా సమయానుసారం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. మీలో చాలా మంది, మీతో సహా, ఎక్కువసేపు గేమ్స్ లో కాలం గడిపినందుకు ఎగతాళి, విమర్శల వంటి వాటికి గురవడం కూడా సాధారణంగా ఉంటుంది. అవునా ? ఒక్కొక్కరికి ఒక్కోరకమైన గేమ్స్ మీద ఆసక్తి ఉంటుంది. కొందరికి, ఆర్కేడ్ గేమ్స్, కొందరికి పజిల్స్, కొందరికి రేస్ గేమ్స్, కొందరికి వార్ లేదా షూటింగ్ గేమ్స్ అలా పలురకాలుగా ఆసక్తి ఉంటుంది.

ఈ గేమ్స్ లో కూడా పలురకాల ప్లాట్ఫార్మ్స్ ఉంటాయి. కంప్యూటర్, మొబైల్, ప్లేస్టేషన్ వంటివి. గేమ్స్ వాటి పరిధులని విస్తరించుకుంటూ వేలల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. శత్రువులను కనుగొనడం, మట్టుబెట్టడం, కొండలు గుట్టలు ఎక్కడం, రేస్ ఆడి ఇతరులను ఓడించడం, కాసినో, ఇలాంటి వందల ఆసక్తుల నడుమ వినియోగదారులు గేమ్స్ లో సమయాన్ని వెచ్చించడం పరిపాటిగా ఉంటుంది. కానీ, కేవలం డబ్బు, సమయాన్ని వెచ్చించడానికేనా గేమ్స్ ఆడేది ? కాలం మారింది. ఇప్పుడు మీకు డబ్బును కూడా సంపాదించి పెడుతున్నాయి కొన్ని గేమ్స్.

5-ways-make-money-while-playing-games

అవును నిజమే, గేమ్స్ ద్వారా మీరు డబ్బు కూడా సంపాదించవచ్చు. మీకు గేమ్స్ అంటే మక్కువ ఎక్కువగా ఉన్న ఎడల, కొన్ని గేమ్స్ ద్వారా డబ్బును కూడా సంపాదించుకోండి. కొందరు డబ్బును సంపాదించడానికి గేమ్స్ ఆడుతుంటే, కొందరు గేమ్స్ మాధ్యమంగా చేసుకుని అభిమానుల సంఖ్యను ఉపయోగించుకుంటూ మల్టీ బిలియన్ డాలర్ ఇండస్ట్రీగా మలచుకున్నారు. ఒకపక్క కొన్ని వీడియో గేమ్స్ ఆడటం ద్వారా డబ్బును సంపాదించే మార్గాలు ఉంటే, మరోపక్క ఎటువంటి గేమ్స్ ఆడినా స్ట్రీమింగ్ సర్వీసులను వాడుకుంటూ ఆదాయార్జన చేసే వెసులుబాటు కూడా ఉంది.

OLXలో వెలుగు చూసిన మరో మోసం, తక్కువ ధరకే ఐఫోన్ అంటూ బురిడీOLXలో వెలుగు చూసిన మరో మోసం, తక్కువ ధరకే ఐఫోన్ అంటూ బురిడీ

గేమింగ్ స్ట్రీమర్ అవుతారా :

గేమింగ్ స్ట్రీమర్ అవుతారా :

యుట్యూబ్ మరియు ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీసులు డబ్బును సంపాదించడానికి సూచించదగిన రెండు గొప్ప మార్గాలుగా ఉన్నాయి, మీరు ఏదైనా ఒక గేమ్ నందు నైపుణ్యంగలవారిగా ఉంటే, మీ ఆటలను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు చూసేందుకు ఈ వెబ్సైట్స్ మీకు అనుమతినిస్తాయి. అదే అభిరుచి కలిగిన అనేకమంది కంప్యూటర్ స్క్రీన్లకు కళ్ళను అప్పగించడం పరిపాటి అవుతుంది. వీక్షకులు పెరిగే కొలది, ఆదాయం పెరుగుతుంటుంది. యూట్యూబ్, యూట్యూబ్ గేమింగ్ అని పిలువబడే, ప్రత్యేకమైన విభాగాన్ని గేమర్స్ కోసం కలిగి ఉంది.

గూగుల్ నుండి వచ్చే ప్రకటనల సహాయంతో స్ట్రీమ్స్ సంపాదించవచ్చు. మీకు యూట్యూబ్ ప్లాట్ఫారమ్ గురించిన అవగాహన ఉన్నట్లయితే, మీ గేమింగ్ వీడియోలను ప్రసారం చేస్తూ, ప్లాట్ఫారమ్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా త్వరగానే ఆదాయానికి దారులు తెరుచుకుంటాయి.

 

 

ఈ-స్పోర్ట్స్:

ఈ-స్పోర్ట్స్:

ఈ-స్పోర్ట్స్ కమ్యూనిటీ దినదినాభివృద్దితో ముందుకు సాగుతున్న గేమింగ్ ఫోరంగా ఉంది. మరియు ఆటలో శూన్యతను పూరించగల లేదా ఆటలో సరికొత్త ఎత్తులు వేసి పారించగల నైపుణ్యాలు కలిగిన గేమర్స్ కోసం చూస్తుంది. గేమర్స్ వారి నైపుణ్యాలను ప్రదర్శించగల ఆన్లైన్ గేమింగ్ పోటీలలో పాల్గొనే ఉత్తమమైన అవకాశాన్ని కలిపిస్తూ, గేమింగ్ బిగ్విగ్స్ ద్వారా రిక్రూట్ చేయబడుతూ సమర్థవంతంగా నియమించబడతాయి.

 

 

గేమ్ రివ్యూస్ :
 

గేమ్ రివ్యూస్ :

ఒక గేమ్ ఆడుతున్నప్పుడు, మీకు నచ్చిన మరియు నచ్చని విషయాలతో పాటు, మీ అనుభవాలను పంచుకోగల అవకాశాలు ఉంటాయి. డెవలపర్లతో పాటు, తదుపరి గేం కొనుగోలు కోసం చూస్తున్న సగటు వినియోగదారుడు కూడా నిజాయితీతో తమ అనుభవాలను పంచుకోగల అవకాశాలను గేమింగ్ కమ్యూనిటీలు కల్పిస్తున్నాయి. అంతేకాకుండా, మీ వ్యక్తిగత బ్లాగ్లో మీ సమీక్షలను భాగస్వామ్యం చేసి, ఆపై "గూగుల్ యాడ్స్" ద్వారా ఆదాయాన్ని ఆర్జించడం చేయవచ్చు. కనీసం, SEO మరియు ఇంటర్నెట్ మార్కెటింగ్ అవగాహన ఉండడం ద్వారా మోనటైజేషన్ ట్రాఫిక్స్ పెంచుకోవచ్చు.

 

 

గేమింగ్ వ్యూహాలు:

గేమింగ్ వ్యూహాలు:

ఇతర ఆటగాళ్ళను ఉపయోగించుకోగల నైపుణ్యం, మీ యూట్యూబ్ ఛానెల్ లేదా వెబ్సైట్ కోసం అధిక సంఖ్యలో వీక్షకులను లేదా సందర్శకులను కలిగి ఉండటం, స్థిరమైన ఫాలోవర్లను నిర్వహించడం వంటివి గేమింగ్ వ్యూహాలుగా ఉంటాయి. ఈ వ్యూహాలు, గూగుల్ ప్రకటనల సహాయంతో స్ట్రీమింగ్ జరుపబడుతున్న చానెల్ మానిటైజేషన్ నిర్వహిస్తూ, ఆదాయాన్ని ఆర్జించడానికి మీకు సహాయం చేయగలవు.

బీటా టెస్టింగ్:

బీటా టెస్టింగ్:

గేమింగ్ పరిశ్రమ నిరంతరం జనాదరణ తగ్గని పరిశ్రమగా ఉంటుంది కాబట్టి, నిరంతరం ఈ పరిశ్రమలోనికి అడుగులు పడుతూనే ఉంటాయి, మరియు ఏదో ఒక సంస్థ కొత్త గేమ్స్ ప్రారంభిస్తూనే ఉంటాయి. గేమ్ లోని మలుపులు, ఎత్తులు, గేమ్ పని తీరు, హార్డ్వేర్ కంపాటబిలిటీ మొదలైన అంశాలను పరీక్షించడానికి, మరియు వినియోగదారుల అనుభవాలను తెలుసుకునేందుకు బీటా టెస్టర్స్ అవసరం ఉంటారు. ఇక్కడ ఆట యొక్క వివిధ అంశాలపై పూర్తి అవగాహన అవసరం, ఇక్కడే బీటా టెస్టింగ్ చిత్రంలోకి వస్తుంది. సంస్థల యొక్క బీటా టెస్టింగ్ అవకాశాలను కనుగొనేందుకు, మరియు బీటా టెస్టర్లను పొందేందుకు కంపెనీల కోసం వివిధ రకాల ఆన్లైన్ ప్లాట్ఫార్ములు అందుబాటులో ఉన్నాయి కూడా. మీరు ఎంత సంపాదించగలరు అనేది, మీరు చేసే పని మరియు మీ అభిప్రాయాల స్పష్టత మీద ఆధారపడి ఉంటుంది.

 

 

Best Mobiles in India

English summary
5 ways to make money while playing games.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X