ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో ప్రతి ఇంటికి నిఘా వ్యవస్థ ఎంతో అవసరం. ముఖ్యంగా ఎవరూ లేని సమయంలో ఇంటికి భద్రత కల్పించుకోవల్సిన అవశ్యకత తప్పనిసరి అయ్యింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేయటంలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి మన ఇళ్లకు కల్పిస్తోన్న 24x7 పర్యవేక్షణ పూర్తి భరోసాగా నిలుస్తోంది. ఇంట్లోని ముఖ్యమైన వస్తువుల పై రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 5 ముఖ్యమైన మార్గాలను ఇప్పుడు చూద్దాం...

Read More : కొత్తగా ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

మీ కంప్యూటర్ వెబ్‌క్యామ్‌ను ఫోన్‌కు అనుసంధానించుకుని సెక్యూరిటీ కెమెరాలో వాడుకోవచ్చు. iCam అనే సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ రెండు డివైస్‌లను కనెక్ట్ చేయవచ్చు.

ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సీసీటీవీ కెమెరాలా మార్చి మీ ఇంటి నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఫోన్ కెమెరాను సీసీ కెమెరాలో మార్చేందుకు అనేకమైన అప్లికేషన్స్ మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. వాటిలో మీ ఫోన్ స్పెసిఫికేషన్స్‌కు సూట్ అయ్యే యాప్‌ను ఎంపిక చేసుకుని లైవ్ వీడియో స్ట్రీమ్‌‍ను మీ కొత్త ఫోన్‌లో చూసుకోండి.

ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

మార్కెట్లో సిద్దంగా ఉన్న FLIR FX క్యామ్ 160 డిగ్రీ వైడ్ యాంగిల్ క్యాప్చర్ వ్యవస్థతో వస్తోంది. 1080పిక్సల్ హైడెఫినినిషన్ వీడియో రికార్డింగ్ మరో సౌలభ్యత, ఇంట్లోని ఉష్ణోగ్రతతో పాటు గాలిలోని తేమను ఎప్పటికప్పుడు ఈ కెమెరా డిస్‌ప్లే చేయగలదు. యాప్స్ సహాయంతో కెమెరాను ఫోన్‌కు అనుసంధానించుకున్నట్లయితే ఇంట్లోని ముఖ్యమైన వస్తువుల పై రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవచ్చు.

ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

ఆధునిక ఫీచర్లతో కూడిన రిమోట్ వీడియో నిఘాను అందించేందకు అనేక ప్రోఫెషనల్ కెమెరా ఆప్షన్స్ మార్కెట్లో సిద్దంగా ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ కొంచం ఖర్చుతో కూడుకుని ఉంటుంది.

ఇంట్లో రిమోట్ వీడియో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయటం ఏలా..?

Raspberry Pi Security Cam

తక్కువ ధరలో అందుబాటులో ఉన్న ఈ మల్టీ పర్పస్ కెమెరా డివైస్‌ను సెక్యూరిటీ కెమెరా అలానే యూఎస్బీ వెబ్ క్యామ్ లా ఉపయోగించుకోవచ్చు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Ways to Set Up Remote Video Surveillance At Home. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot