మీ స్మార్ట్‌ఫోన్‌ను హ్యాకింగ్ నుంచి కాపాడుకోండిలా..

|

మీ స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ కు గురికాకుండా కాపాడుకోవాలనుకుంటున్నారా.. లేదా మీ ప్రైవసీకి భంగం కలగకుండా సెట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ టిప్స్ పాటించండి. ముఖ్యంగా హ్యాకర్లు మనకు తెలియకుండానే కెమెరాను ఓపెన్ చేయడం, లేదా మైక్ ను ఆపరేట్ చేసి వాయిస్ కమాండ్స్ ను రికార్డ్ చేయడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా హై ఎండ్ స్మార్ట్ ఫోన్లలోనూ, ట్యాబ్స్, లాప్ టాప్స్ లో ఈ బెడద చాలా ఎక్కువ.ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి వచ్చిన అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ లాంటివి మీ వాయిస్ కమాండ్ ద్వారానే పనిచేస్తున్నాయి. వీటిని కూడా హ్యాక్ చేసేందుకు కూడా హ్యాకర్లు వెనుకాడట్లేదు. పర్సనల్ డేటాను కాపాడుకోవడం ఈ టెక్నాలజీ యుగంలో చాలా కీలకం ఎందుకంటే డేటా ఎప్పుడు ఎవరి చేతుల్లో ఏ రూపంలో మిస్ యూజ్ అవుతుందో అంచనా వేయడం కష్టం. ఇప్పుడు హ్యాకర్ల నుంచి మీ గాడ్జెట్స్ ను కాపాడుకునే కొన్ని టిప్స్ చూద్దాం.

 

వేరు వేరు డిజిటల్ వాలెట్స్ మధ్య నగదు బదిలీ సాధ్యమే!వేరు వేరు డిజిటల్ వాలెట్స్ మధ్య నగదు బదిలీ సాధ్యమే!

మైక్ ను డిజేబుల్ చేయండిలా..

మైక్ ను డిజేబుల్ చేయండిలా..

సాధారణంగా స్మార్ట్ స్పీకర్స్ లో మైక్రో ఫోన్ ను డిజేబుల్ చేసే సదుపాయం ఉంది. ఆ బటన్ ను డీయాక్టివేట్ చేసేందుకు ఏర్పాటు చేశారు. సాధారణంగా మైక్ ఆఫ్ చేయడం ద్వారా ప్రైవేట్ సంభాషణలను ప్రైవసీని కాపాడుకోవచ్చు.

మైక్ యాక్సెస్‌ను తగ్గించుకోండిలా...

మైక్ యాక్సెస్‌ను తగ్గించుకోండిలా...

మీ స్మార్ట్ గాడ్జెట్స్ ను మైక్రో ఫోన్ యాక్సెస్ నుంచి దూరం చేసుకునేందుకు సెట్టింగ్స్ లోకి వెళ్లి ఏ యాప్స్ మైక్రో ఫోన్ తో యాక్సెస్ ఉన్నాయో గుర్తించి వాటిని డిజెబుల్ చేయడం ద్వారా కూడా వాయిస్ కమాండ్స్ హ్యాకర్ల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

 కెమెరాను స్విచ్ఛాప్ చేయండిలా..
 

కెమెరాను స్విచ్ఛాప్ చేయండిలా..

అన్నింటికన్నా సులభమైన పద్ధతి మీ కెమెరాకు అడ్డంగా ఒక తెల్లటి టేపు అంటించండి నిజమే..మీరు చదివింది. హ్యాకర్లకు కెమెరాను ఆపరేట్ చేయడం ద్వారా మీ లొకేషన్, ఐడెంటిటీ లాంటివి హ్యాక్ చేయడం చాలా ఈజీగా మారిపోయాయి. దీన్నుంచి బయట పడాలంటే మాత్రం మీరు ఫోన్ వాడని సమయంలో కెమెరాకు అడ్డంగా తెల్లటి టేప్ ఒకటి టెంపరరీగా తగిలించండి.

 

 

 ఫారడే బ్యాగ్స్..

ఫారడే బ్యాగ్స్..

ఈ బ్యాగ్ లో ఫోన్ ఉంచడం ద్వారా అన్ని రకాల సిగ్నల్స్ కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా మీ వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్ కు గురవ్వకుండా అవకాశం ఉంది. అయితే మీరు కాల్స్ రిసీవ్ చేసుకునే అవకాశం మాత్రం ఉండదు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకొని ఈ బ్యాగ్స్ వాడకం చేయాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Worried about losing your privacy? Here's how you stop your gadgets from spying on you.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X