గుర్తుతెలియని మెయిల్స్ విసుగిస్తున్నాయా? వాటిని ఎవరు పంపుతున్నారో తెలుసుకోవాలా?

మీకు పరిచయంలేని మెయిల్ ఐడీ నుంచి అనుమానాస్పద ఈ-మెయిల్స్ రెగ్యులర్‌గా మీ జీమెయిల్ అకౌంట్‌కు వస్తున్నాయా..? అయితే, తప్పనిసరిగా మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయ్, వాటిని ఎవరు పంపిస్తున్నారు అనేదాని పై ఆరా తీయాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐపీ అడ్రస్‌లను హైడ్ చేసేస్తుంది..

సాధారణంగా జీమెయిల్, అవుట్ గోయింగ్ ఈమెయిల్ హెడర్స్ నుంచి సెండర్ ఐపీ అడ్రస్‌లను హైడ్ చేసేస్తుంది. ఒకవేళ మీకు మెయిల్ పంపిన వారి ఈ-మెయిల్ ఐడీ యాహూ, హాట్‌‌మెయిల్, AOL సర్వీసులకు సంబంధించనది అయితే ఐపీ అడ్రస్ ద్వారా లోకేషన్‌ను ట్రాక్ చేసే వీలుంటుంది. సెండర్ తాలుకా లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు 5 సింపుల్ టిప్స్..

జీమెయిల్‌లో నమోదైన ఐపీ అడ్రస్ ద్వారా

సెండర్ లోకేషన్‌ను జీమెయిల్ అందుబాటులో ఉన్న ఆ వ్యక్తి తాలుకా ఐపీ అడ్రస్‌ను బట్టి తెలుసుకునే వీలుంటుంది. ముందుగా సెండర్ మెసేజ్‌ను ఓపెన్ చేసిన 'Show Original' పై క్లిక్ చేసి మరొక టాబ్ పై ఆ పేజీ ఓపెన్ అయ్యేలా చూసుకోండి. వేరొక టాబ్‌లో ఒరిజినల్ మెసేజ్ ఓపెన్ అయిన తరువాత 'Receiver' కోసం సెర్చ్ చేసి సెండర్ కంప్యూటర్ తాలుకా IPV4 అడ్రస్‌‌ను కాపీ చేయండి. అడ్రస్ కాపీ అయిన తరువాత wolframalpha.com అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆ అడ్రస్‌ను పేస్ట్ చేయండి. ఐపీ అడ్రస్ తాలుకా లోకేషన్ వివరాలు తెలిసిపోతాయి.

Time Zone Map ద్వారా..

మరొక ప్రొసీజర్‌లో భాగంగా 'Time Zone Map' ద్వారా సెండర్ లోకేషన్‌ను తెలుసుకునే వీలుంటుంది. ముందుగా మీరు ఆ మెయిల్‌ను అందుకున్న సమయాన్ని గుర్తుపెట్టుకుని Time Zone Map అనే సైట్‌లో ఎంటర్ చేయటం ద్వారా మీకు మెయిల్ పంపిన వ్యక్తి తాలుకా దేశం లేదా ప్రాంతాన్ని తెలుసుకునే వీలుంటుంది.

ఫేస్‌బుక్ ద్వారా..

మరొక ప్రొసీజర్‌లో భాగంగా ఫేస్‌బుక్ ద్వారా సెండర్ లోకేషన్‌ను తెలుసుకునే వీలుంటుంది. మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి వెళ్లి లాగినై సెండర్ మెయిల్ ఐడీని సెర్చ్ చేసినట్లయితే ఆ వ్యక్తి తాలుకా ప్రొఫైల్ బయటపడే అవకాశముంది.

ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా..

ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక సంబంధాల మాధ్యమాలలో సెండర్ మెయిల్ ఐడీని సెర్చ్ చేయటం ఆ వ్యక్తి తాలుకా వివరాలు బయడపడే అవకాశాలు ఉన్నాయి.

ఆ రెండు వెబ్‌సైట్‌ల ద్వారా..

మెయిల్ ఐడీలకు సంబంధించి లోకేషన్‌ను ట్రాక్ చేసేందుకు 'Pipl', 'Spokio' అనే రెండు వెబ్‌సైట్‌లు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలోకి వెళ్లి సెండర్ ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేసినట్లయితే, ఆ వ్యక్తి తాలుకా లొకేషన్ వివరాలు బయటపడే అవకాశముంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 ways to find the location of Email sender in Gmail. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot