ఫ్రీ వై-ఫైతో నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారా..?

మనలో చాలా మంది పబ్లిక్ వై-ఫై పట్ల ఆసక్తి చూపుతుంటారు. ఎందుకుంటే ఇక్కడ ఇంటర్నెట్ ఉచితం కాబట్టి. షాపింగ్ మాల్స్, కాఫీ షాప్స్, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్ ఇలా అనేక ప్రాంతాల్లో ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లు అందుబాటులో ఉన్నాయి. పబ్లిక్ వై-ఫై ద్వారా ఉచిత ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికి సెక్యూరిటీ రిస్క్స్ మాత్రం చాలానే ఉన్నాయి.

Read More : రూ.501 ఫోన్ గుర్తుందా..?, సేల్ అనౌన్స్ చేసారు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం

పబ్లిక్ వై-ఫైను వినియోగించటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో మీ వ్యక్తిగత డేటా హ్యాక్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.

జాగ్రత్తలను పాటించటం ద్వారా..

పబ్లిక్ వై-ఫై హాట్‌స్పాట్‌లకు మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కనెక్ట్ చేసినపుడు కొన్ని జాగ్రత్తలను పాటించటం ద్వారా సేఫ్ జోన్‌లో ఉండొచ్చు.

వాటికి దూరంగా ఉండండి..

పబ్లిక్ వై-ఫైతో కనెక్ట్ అయి ఉన్నపుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి లావాదేవీలను నిర్వహించటం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. ఈ విధమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు హోమ్ లేదా వర్క్‌ప్లేస్ నెట్‌వర్క్ చాలా సురక్షితం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొబైల్ డేటాను ఉపయోగించుకోండి

మార్గమధ్యంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలను వినయోగించుకోవల్సి వస్తే పబ్లిక్ వై-ఫైకు బదులుగా మొబైల్ డేటాను ఉపయోగించుకోండి.

ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా..

మీరు వినియోగించే స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏ చిన్న సెక్యూరిటీ లోపమున్నా మీ డివైస్ హ్యాకర్లకు అందుబాటులో ఉన్నట్లే. మీ విండోస్ పీసీలో ఫైర్‌వాల్‌ను తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ఉంచాలి.

యాంటీ వైరస్ యాప్‌..

మీ స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్‌ను తప్పనిసరిగా ఇన్ స్టాల్ చేయాలి. తరచూ లేటెస్ట్ ఓఎస్ అప్‌డేట్‌లను పొందటం ద్వారా కూడా సెక్యూరిటీ సమస్యల నుంచి బయటపడవచ్చు.

అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే...

కొన్ని పబ్లిక్ వై-ఫైల వద్ద పాస్‌వర్డ్ చాల సులభతరంగా ఉండటం కారణంగా మీ డేటాను హ్యాకర్లు సులువుగా దొంగిలించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి, అత్యవసర పరిస్ధితుల్లో మాత్రమే పబ్లిక్ వై-ఫైను ఎంపిక చేసుకోండి.

సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకండి

పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవద్దు. ఈ చర్య మీ వ్యక్తిగత డేటాకే ప్రమాదం కావొచ్చు. కొన్ని పబ్లిక్ వై-ఫై కేంద్రాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ముసుగులో మాల్వేర్లతో కూడిన ప్రోగ్రామ్‌లను, మీ డివైస్‌‌లోకి జొప్పించి మీ డేటాను దొంగిలించే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి పబ్లిక్ వై-ఫైల వద్ద ఏ విధమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకండి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Ways to Stay Safe While Browsing on Free WiFi. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot