పీసీ నుండి ఐఫోన్‌లోకి ఫోటోలు కాపీ చేయాలనుకుంటున్నారా..?
మీ కంప్యూటర్ నుండి ఐ ఫోన్ కు ఫోటోలను ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటున్నారా.. మీ పీసీలో సేవ్ అయిన ఫోటోలను ఐ ఫోన్ లోకి ఎలా కాపీ చేసుకోవాలి..మీ పీసీలో ఫోటోలు ఎక్కడ సేవ్ అయి ఉన్నాయి..అనేవి పక్కన బెడితే ఐ ఫోన్ లోకి పీసీ నుంచి ఫోటోలు కాపీ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఆండ్రాయిడ్ డివైస్ నుంచి ఓఎస్‌లోకి కాపీ చేయాలంటే చాలా కష్టమైన పని. అయితే ఇందుకోసం మీకు అయిదు సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం చూసేయండి.
Read more : మార్ష్‌మల్లో 6.0 వర్షన్‌తో దూసుకొస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే..

ఐ క్లౌడ్ ( iCloud )
ఐ క్లౌడ్ లో మీరు మీ ఫోటోలను సేవ్ చేసుకోవచ్చు. ఇది గూగుల్ డ్రైవ్ లాగా ఉంటుంది. ఇందులో మీకు 5 జిబి దాకా స్పేస్ లభిస్తుంది. ఇందులో నుంచి మీరు మీ ఫోటోలను ఐ ఫోన్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది వద్దనుకుంటే మీకు ఇంకా అనేక ఆప్సన్స్ ఉన్నాయి.

గూగుల్ డ్రైవ్ ( Google Drive )
ముందుగా మీ పీసీలో ఉన్న ఫోటోలను గూగుల్ డ్రైవ్ లోకి ట్రాన్స్ ఫర్ చేయండి. తరువాత మీరు అందులో నుంచి మీ ఐ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

గూగుల్ ఫోటోస్
మీరు ఐ ఫోన్ లోకి ఫోటోలను కాపీ చేసుకోడానికి మరొక బెస్ట్ వే ఇది.గూగుల్ ఫోటోల నుంచి ఆండ్రాయిడ్ లోకి కాని ఓఎస్ లోకి కాని మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఐ ట్యూన్స్
మీరు ఇందులోకి కూడా మీ ఫోటోలను కాపీ చేసుకోవచ్చు. అయితే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ

కాపీ ట్రాన్స్ ఫర్
ఇదొక ధర్డ్ పార్టీ యాప్. ఈ యాప్ నుంచి మీరు పీసీ నుండి ఓఎస్ లోకి మీ ఫైల్స్ ను కాపీ చేసుకోవచ్చు. ఇది పాత వర్సన్ అలాగే కొత్త వర్సన్ ఓఎస్ లకు పనిచేస్తుంది.ఓ సారి ప్రయత్నించి చూడండి.


Click it and Unblock the Notifications