మీ ఫోన్‌లో మెమరీ కార్డ్ ఉందా..? ఇవి తెలుసుకోండి
కొన్ని సందర్భాల్లో మైక్రోఎస్డీ కార్డ్‌లలో కంటెంట్ ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్ అని చూపిస్తుంటాయి.
ఫోన్‌లో సేవ్ అయ్యే ప్రతి విషయాన్ని మెమరీ కార్డుల్లోకి బ్యాకప్ చేస్తుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మెమరీ కార్డులు అర్థంతరంగా పనిచేయటం మానేస్తుంటాయి. మైక్రోఎస్డీ కార్డులు ఫెయిల్ అవటానికి అనేక కారణాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం యూజర్ నిర్లక్ష్యం కారణంగా చోటు చేసేుకునేవే. అవేంటో ఇప్పుడు చూద్దాం...
Read More : మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

మీరు వాడుతోన్న ఎస్డీకార్డ్..
మీరు వాడుతోన్న ఎస్డీకార్డ్ కూడా పాత వర్షన్‌ది అయినట్లయితే రైటింగ్ స్పీడ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ కారణం చేత కార్డ్ నెమ్మదిగా రీడ్ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, మీ మైక్రోఎస్డీ కార్డును లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవటం మంచిది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అనుకోకుండా లాక్ పడిపోతుంటుంది..
కొంత మంది అనుకోకుండా తమ ఎస్డీ కార్డ్‌లను లాక్ చేసేస్తుంటారు. కార్డ్ లాక్ చేయబడి ఉన్నందు వల్ల కార్డ్ సిస్టంలోకి తీసుకోదు. ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు. లాక్ తీయటం వల్ల యదావిధిగా పనిచేస్తుంది. మీ కార్డ్ రీడర్ స్లోగా ఉన్నా, మెమెరీ కార్డ్ తీసుకోవటం ఆలస్యమవుతుంది. కాబట్టి మీ కార్డ్ రీడర్ లేటెస్ట్ వర్షన్‌దిగా ఉండాలి.

రఫ్‌గా హ్యాండిల్ చేస్తున్నారా..?
కొంత మంది ఎస్డీ కార్డ్‌లను రఫ్‌గా హ్యాండిల్ చేసేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కార్డులు ఫిజికల్‌గా డామేజ్ అవుతుంటాయి. ఫలితంగా కొత్త కేసింగ్‌ను మార్చుకోవల్సి ఉంటుంది.

Eject చేసే విషయంలో...
కొంత మంది తమ ఎస్డీ కార్డ్‌లను సరైన ప్రికాషన్స్ ఫాలో అవకుండా Eject చేసేస్తుంటారు. పర్యావసానంగా కార్డ్ లోపలి డేటా కరప్ట్ అయ్యే ప్రమాదముంది. ఇటువంటి అనర్థాల భారి నుంచి మీ ఎస్డీ కార్డ్‌ను రక్షించుకోవాలంటే సరైన ప్రికాషన్స్ ఫాలో అవుతూ సేఫ్‌గా రిమూవ్ చేయవల్సి ఉంటుంది.

కంటెంట్ ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్..
కొన్ని సందర్భాల్లో మైక్రోఎస్డీ కార్డ్‌లలో కంటెంట్ ఫుల్‌గా ఉన్నప్పటికి బ్లాంక్ అని చూపిస్తుంటాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం Wrong Format. ఒకే మైక్రోఎస్డీ కార్డ్‌ను వేరు వేరు డివైసుల్లో ఉపయోగించటం వల్ల, ఈ ఫార్మాటింగ్ సమస్యలు తెలెత్తే అవకాశముంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








