ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి

ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ సర్వ సాధారణమైపోయింది. వేలాది రూపాయిలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ఈ ఫోన్‌లను అనుకోకుండానో, అజాగ్రత్త కారణంగానో జార విడిచేస్తోన్న సంఘటనలు నిత్యం ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఫోన్ పోగొట్టుకున్న వెంటనే అయోమయానికి గురికాకుండా సమయస్పూర్తితో చేయవల్సిన 6 ముఖ్యమైన పనులను క్రింది స్లైడర్‌లో సూచించటం జరుగుతోంది...
Read More : 6జీబి ర్యామ్‌తో చైనా ఫోన్.. త్వరలో

ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి
మీ ఫోన్ పోయిందని నిర్థారణకు వచ్చిన వెంటనే వేరొక ఫోన్ నుంచి మీ నెంబర్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్ ఇవ్వండి. మీ ఫోన్ వెరొకరికి దొరికినట్లయితే వెంటనే వాళ్లు స్పందించి ఫోన్ తిరిగి ఇచ్చే అవకాశముంది.

ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి
మీ ఫోన్ పోయిందని నిర్థారణకు వచ్చిన వెంటనే డెస్క్‌టాప్ పీసీ నుంచి లాగినై మీ ఫోన్‌లోని ఈమెయిల్ అలానే సోషల్ మీడియా అకౌంట్‌లకు సంబంధించి పాస్‌వర్డ్‌లను మార్చేయండి.

ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి
మీ మిస్సింగ్ ఫోన్‌లోని ఫోటోలు, వీడియోలు అలానే మెసేజ్‌లను పూర్తి స్థాయిలో డిలీట్ చేసేందుకు ఓ అత్యుత్తమ సొల్యూషన్‌ను ఆండ్రాయిడ్ అందిస్తోంది. మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ డివైస్, గూగుల్ అకౌంట్ అలానే ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లయితే లోపలి డేటాను రిమోట్ విధానంలో డిలీట్ చేయవచ్చు.

రిమోట్ విధానం ద్వారా మీ ఫోన్‌లోని డేటాను డిలీట్ చేయదలచినట్లయితే ముందుగానే మీ ఫోన్‌లో Android Device Manager feature ఎనేబుల్ చేసి ఉంచుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే Google Settings >> Security >> Android Device Manager. Now look for 'allow remote lock and erase and switch it on.
వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రిమోట్ విధానంలో లోకేట్ చేయవచ్చు. డివైస్ లోకేషన్‌ను మ్యాప్‌లో చూడొచ్చు. (గమనిక: ఫోన్ ఆన్ చేసిన ఉంటేనే దాని లోకేషన్‌ను మీరు ట్రేస్ చేయగలరు). ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజర్ ద్వారా మీ డివైస్‌ను ట్రేస్ చేసిన తరువాత మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి. అందులో ఒకటి రింగ్, మరొకటి లాక్ అండ్ ఎరేజ్. రింగ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ డివైస్ ఫుల్ వాల్యుమ్‌తో 5 నిమిషాల పాటు బెగ్గరగా రింగ్ అవుతుంది.

ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి
ఫోన్ అపహరణకు గురైన వెంటనే సమీపంలోని పోలీసులకు ఫిర్యాదునందించండి. పూర్తి వివరాలను వారికి తెలియజేయటం ద్వారా దర్యాప్తు వేగవంతంగా జరిగే అవకాశముంటుంది. మీ ఫోన్‌కు సంబంధించిన వివరాలను రికార్డు రూపంలో భద్రపరచుకోవటం మంచిది. ఫోన్ ప్రమాదాలకు గురైన సమయాల్లో ఈ వివరాలు ఉపయోగపడతాయి. భద్రపరచాల్సిన వివరాలు: - ఫోన్ నెంబరు - మోడల్ నెంబరు - రంగు ఇతర గుర్తుల సమాచారం, - పిన్ లేదా సెక్యూరిటీ లాక్ కోడ్, - ఐఎమ్ఈఐ నెంబరు.

ఫోన్ పోగొట్టుకున్నారా..? వెంటనే ఇలా చేయండి
ఫోన్‌లోని సోషల్ మీడియా అకౌంట్స్ పై కన్నేసి ఉంచండి. వాటిలో అప్‌డేట్స్ జరుగుతున్నట్లయితే మీ డివైస్‌ను సులువుగా ట్రేస్ చేయవచ్చు.

Click it and Unblock the Notifications