కొత్త ఫోన్ కొంటున్నారా? ఈ తప్పులు ఏ మాత్రం చేయకండి

|

ఈ పండుగ సీజన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటున్నారా, మీరు ఎంపిక చేసుకునే స్మార్ట్ డివైజ్ ఏలాంటి స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటే బాగుంటుంది? ఫోన్ కొనుగోలు సమయంలో ఏఏ అంశాలను నిశితంగా పరిశీలించాలి? ఎటువంటి తప్పులు చేయకూడదు అనే దాని పై ఓ ప్రత్యేకమైన స్టోరీని మీతో షేర్ చేసుకుంటున్నాం.

టీవీ ప్రకటనలు చూసి నిర్థారణకు రాకండి..
 

టీవీ ప్రకటనలు చూసి నిర్థారణకు రాకండి..

ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన అనేక వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానల్స్‌లో ఊదరగొడుతున్నాయి. హైక్వాలిటీ విజువల్స్‌తో కనువిందు చేస్తోన్న ఈ కమర్షియల్ యాడ్స్‌లో ఆయా ఫోన్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫీచర్లను మాత్రమే కంపెనీలు ప్రస్తావిస్తున్నాయి. అవగాహన లేని చాలా మంది యూజర్లు ఈ యాడ్స్ ఆధారంగానే కొత్త ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు. వాస్తవానికి ఏదైనా కొత్త స్మార్ట్‌ఫోన్‌‌ను కొనుగోలు చేసే ముందు టీవీ కమర్షియల్స్‌ను ఆధారంగా చేసుకోకూడదు. ఫోన్‌లోని స్పెషల్ ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలను కూడా క్షుణ్నంగా తెలుసుకున్న తరువాతనే ఓ నిర్థారణకు రావాలి.

బ్రాండ్ కాదు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం..

బ్రాండ్ కాదు బిల్డ్ క్వాలిటీ అనేది చాలా ముఖ్యం..

కొత్త ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో చాలా మంది యూజర్లు బిల్డ్ క్వాలిటీ కంటే బ్రాండ్ వాల్యూకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇది అంతగా కరెక్ట్ కాదు. ప్రస్తుతం నెలకున్న పోటీ మార్కెట్ నేపథ్యంలో బ్రాండ్ వాల్యూతో సంబంధం లేకుండా హైక్వాలిటీ ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. కాబట్టి కొత్త ఫోన్‌ల‌ను సెలక్ట్ చేసుకునే మందు బ్రాండ్ వాల్యూను పక్కనపెట్టి బిల్డ్ క్వాలిటీకి ప్రాధాన్యతనివ్వండి.

స్టోర్‌ వాళ్లు చెప్పే మాటలను వినకండి..

స్టోర్‌ వాళ్లు చెప్పే మాటలను వినకండి..

కొత్త ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో స్టోర్‌ ఎగ్జిక్యూటివ్స్ లేదా సెల్స్ పర్సన్ సలాహాలు తీసుకోకండి. వాస్తవానికి వీళ్లు వాళ్లకు వ్యక్తిగతంగా లబ్థి చేకూర్చే ఫోన్‌లను మాత్రమే మీకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి, కొత్త ఫోన్‌ల‌ను సెలక్ట్ చేసుకునే విషయంలో టెక్నాలజీ గురించి బాగా తెలిసిన వ్యక్తి వద్ద సలహాలు తీసుకోవటం మంచిది.

ఫేమస్ బ్రాండ్స్ కోసం చూసుకోవద్దు..
 

ఫేమస్ బ్రాండ్స్ కోసం చూసుకోవద్దు..

కొత్త ఫోన్‌లను ఎంపిక చేసుకునే విషయంలో చాలా మంది యూజర్లు ఫేమస్ బ్రాండ్‌లను గుడ్డిగా ఫాలో అవుతూ రూ.50,000 వరకు వెచ్చించేస్తుంటారు. వాస్తవానికి రూ.20,000 ధర ట్యాగ్‌లోనూ అదే ఫీచర్లతో కూడిన హైక్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లభ్యమవుతన్నాయి.

పాత మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి..

పాత మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి..

ఇండియన్ మార్కెట్లో నిత్యం అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ అవుతూనే ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ నేపథ్యంలో పాత వాటికి పాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త ఫోన్‌ల మోజులో పడి చాలా మంది యూజర్లు అప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన ఉన్న అనేక మంచి మంచి మోడల్స్‌ను విస్మరించేస్తున్నారు.

కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకండి..

కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వకండి..

నేటి యువత కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కొనగోలు చేసే ముందు కెమెరా విభాగానికి ఎక్కువుగా ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇది సరైన నిర్ణయం కాదు. ఫోన్‌ను ఎంపిక చేసుకునే ముందు ఆ డివైస్‌లోని కెమెరాతో అన్ని విభాగాలు బాగుండేలా చూసుకోవాలి.

ప్రస్తుత అవసరాలను బట్టి...

ప్రస్తుత అవసరాలను బట్టి...

ప్రస్తుత అవసరాలను బట్టి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ 3జీబి అంతకంటే ఎక్కువ ర్యామ్‌ను కలిగి ఉంటే బాగుంటుంది. ఇదే సమయంలో ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి మీరు ఎంపిక చేసుకునే ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఆక్టా కోర్ ప్రాసెసర్ పై రన్ అయ్యేదిగా ఉంటే బాగుంటుంది. ఇదే సమయంలో ఫుల్ విజన్ డిస్‌ప్లే, డ్యుయల్ రేర్ కెమెరా, హై-క్వాలిటీ ఫ్రంట్ కెమెరా, మైక్రోఎస్డీ స్లాట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ వోల్ట్ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ వంటి ఫీచర్స్ ఉండేటా చూసుకోండి.

Most Read Articles
Best Mobiles in India

English summary
10 biggest mistakes you might make when buying a smartphone.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X