మీ కొత్త ఫోన్‌కు ఇవి ఎంతో అవసరం

Written By:

కష్టపడి దాచుకున్న డబ్బులతో మీ డ్రీమ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసారా..? అయితే, ఇక్కడితో పనైపోయిందిని సంబరపడిపోకండి.

మీ కొత్త ఫోన్‌కు ఇవి ఎంతో అవసరం

ఫోన్‌ను ఎంతైతే ఇష్టపడి కొన్నారో..? అంతే పర్యవేక్షణతో ఆ ఫోన్‌ను మెయింటేన్ చేస్తుండాలి. కొంత మంది కొత్త ఫోన్‌కు ఏ విధమైన ప్రొటెక్షన్‌ను కల్పించకుండా ఇష్టమొచ్చినట్లు రఫ్ అండ్ టఫ్‌‍గా వాడేస్తుంటారు. ఇలా చేయటం అనేది ఫోన్‌ను ఓపెన్ రిస్క్‌లో పడేసినట్లే. కొంత స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసిన వెంటనే, ఆ ఫోన్ నిమిత్తం వీలైనంత త్వరగా చేయవల్సిన 7 ముఖ్యమైన పనులను ఇక్కడ సూచించటం జరుగుతోంది...

Read More : భారత్‌లోనే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

డిస్‌ప్లేకు ప్రొటెక్షన్ ఎంతో అవసరం కాబట్టి ఫోన్ స్ర్కీన్ పై మంచి క్వాలిటీ tempered screen ప్రొటెక్షన్‌ను ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల చిన్నచిన్న ప్రమాదాల నుంచి మీ ఫోన్ సేఫ్!

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

ఫోన్ వెనుక భాగాన్ని స్ర్కాచ్ ప్రూఫ్‌గా ఉంచుకునేందుకు ట్రెండీ లుక్‌లో ఉన్న ఓ సాలిడ్ బ్యాక్ కవర్‌ను ఏర్పాటు చేసుకోండి.

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

మీకు తెలుసా! మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ చేయించుకోవచ్చని..? అనేక కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లకు ఇన్స్యూరెన్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఫోన్‌కు సంబంధించి ఫిజికల్ అలానే లిక్విడ్ డ్యామెజీలను ఈ ఇన్స్యూరెన్స్ కవర్ చేస్తుంది. కాబట్టి మీ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరుమీద ఓ ఇన్స్యూరెన్స్ పాలసీని పొందండి.

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

మీరు కొనుగోలు చేసిన కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యేది అయితే వెంటనే డివైస్‌లోని గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Android Device Manager ఆప్షన్‌ను యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయటం పొరపాటున మీ ఫోన్ మిస్సైనట్లయితే గూగుల్ ద్వారా సులువుగా వెతికిపట్టుకునే ఆస్కారం ఉంటుంది.

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

మీ కొత్త ఫోన్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయుక్తమైన బ్రాండెడ్ యాక్సెసరీస్‌ను కొనుగోలు చేయండి.

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

మీ కొత్త ఫోన్‌లోకి ఎటువంటి ప్రమాదకర వైరస్‌లు ఎంటర్ కాకుండా శక్తవంతమైన యాంటీ మాల్వేర్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని తరచూ ఆ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తుండండి.

కొత్త ఫోన్ కొన్న వెంటనే ఇలా చేయండి

మీ ఫోన్‌లోని డేటాను బయట వ్యక్తులు చూసే ఆస్కారం లేకుండా లాక్ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
7 Things you must do to your new smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot