మొబైల్ ఇంటర్నెట్ రాకెట్ కన్నా స్పీడ్‌గా ...

Written By:

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..అందులో ఇంటర్నెట్ ఉందా.. అయితే అది రాకెట్ కంటే స్పీడుగా పనిచేయాలా.. అయితే దీనిక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. చాలామంది తమ మొబైల్ ఇంటర్నెట్ స్పీడుగా పనిచేయడం లేదని తెగ వర్రీ అవుతుంటారు. ఏదైనా అర్జంట్ అవసరం వచ్చి ఇంటర్నెట్ ఆన్ చేస్తే అది సతాయిస్తుంటుంది కూడానూ..మీరు ఈ కింది టిప్స్ పాటిస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడు రాకెట్ కన్నా వేగంగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.

Read more: ఫేస్‌బుక్‌లో మిమ్మల్ని డిలీట్ చేసిందెవరో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ ఫోన్ కాచ్

మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న కాచ్ ని క్లియర్ చేస్తే మీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఉండటం వల్ల మొమరీ మొత్తం ఆక్రమించి మొబైల్ స్లో అయ్యే అవకాశం ఉంటుంది.దీని కోసం మీరు సెట్టింగ్స్ లోకెళ్లి అందులో స్టోరేజ్ సెలక్ట్ చేసుకుని అందులో క్లియిర్ కాచ్ అని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

అనవసర యాప్ లు

మీ మొబైల్ లో ఏవైనా అనవసర యాప్ లు ఉంటే వెంటనే యునిస్టాల్ చేయండి. అవసరమైన యాప్ లు మాత్రమే మొబైల్ లో ఉంచుకోండి.

మాగ్జిమమ్ డాటా ఆప్సన్

మీరు నెట్ వర్క్ సెట్టింగ్స్ లో కెళ్లి జీపీఆర్ ఎస్ నుంచి కాల్ ఫ్రిపేర్ మారుస్తుంటారు కదా .ఇప్పుడు దాన్ని డాటా ప్రిపేర్ కింద మార్చుకోండి. ఇంటర్నెట్ స్పీడు పుంజుకుంటుంది.

నెట్ వర్క్

ఎక్కువగా 3జీ నెట్ స్పీడుగా ఉంటుంది. 2జీ నెట్ వర్క్ వాడితే అది చాలా స్లో గా రన్ అవుతుంది. అందుకని మీ మొబైల్ లో 3జీ నెట్ వర్క్ సెలక్ట్ చేసుకోండి.

టెక్ట్స్ మోడ్

దీని కోసం మీరు యూసీ బ్రౌజర్ ఫాస్టర్ ని ఇన్ స్టాల్ చేసుకోండి. డౌన్ లోడ్ అయిన తరువాత సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ టెక్ట్స్ ని సెలక్ట్ చేసుకోండి. అక్కడ మీ బ్రౌజర్ ని ఎప్పుడూ టెక్ట్స్ మోడ్ లో పెట్టుకోండి. ఇంటర్నెట్ స్పీడు పెరగాలంటే ఇది చాలా ముఖ్యమైనది కూడా .మీరు ఇమేజ్ మోడ్ లో పెట్టుకుంటే నెట్ స్పీడు అంతగా ఉండదు.

ఫాస్ట్ వెబ్ బ్రౌజర్

మీరు ప్లే స్టోర్ లో కెళ్లి మీరు ఫాస్ట్ వెబ్ బ్రౌజర్ ని డౌన్ లోడ్ చేసుకోండి. ఒపెరా మినీ అలాగే యుసి బ్రౌజర్ ,క్రోమ్ ,ఇవి ఆండ్రాయిడ్ కి చాలా ఫాస్ట్ గా రన్ అవుతాయి.

ఆండ్రాయిడ్ యాప్స్

ఇంటర్నెట్ స్పీడ్ గా రన్ అవ్వాలంటే కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్ లో లభ్యమవుతున్నాయి. వాటిని ట్రౌ చేయండి ఓ సారి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 7 Tricks To Increase Internet Speed In Android Mobile
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot