యాపిల్ స్మార్ట్ వాచ్‌తో మిమ్మల్ని ఫిట్‌గా ఉంచే 7సుత్రాలు ఇవే...

నిత్యం కొత్త గాడ్జెట్స్ తో అదరగొడుతున్న యాపిల్ ఇప్పడు స్మార్ట్ వాచ్ వెర్షన్ త్రీతో ముందుకు వచ్చింది. ఇందులో ప్రధాన ఫీచర్లు మిమ్మల్ని ఫిట్ గా చేసేందుకు దోహదపడనున్నాయి.

|

నిత్యం కొత్త గాడ్జెట్స్ తో అదరగొడుతున్న యాపిల్ ఇప్పడు స్మార్ట్ వాచ్ వెర్షన్ త్రీతో ముందుకు వచ్చింది. ఇందులో ప్రధాన ఫీచర్లు మిమ్మల్ని ఫిట్ గా చేసేందుకు దోహదపడనున్నాయి. ముఖ్యంగా బిల్టిన్ ఆప్టికల్ హార్ట్ రేట్, జీపీఎస్, వాటర్ ప్రూఫ్, కార్డియో జిమ్ పరికరాలతో ఆటో సింక్రనైజేషన్, అలాగే కంటిన్యూ హార్ట్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో యాపిల్ 3 స్మార్ట్ వాచ్ అదరగొడుతోంది. ముఖ్యంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న పలు ఫిట్ నెస్ గాడ్జెట్స్ తో పోల్చితే యాపిల్ 3 స్మార్ట్ వాచ్ అదరగొట్టే ఫీచర్లు కలిగి ఉందని చెప్పవచ్చు. బేసిక్ ఫీచర్లు అయిన స్టెప్స్ ట్రాకింగ్, స్విమ్మింగ్ లాగింగ్ టైం, అలాగే క్యాలరీ బర్నింగ్ వంటి వాటితో పాటు అరుదైన యాప్స్ ఎన్నో యాపిల్ 3 స్మార్ట్ వాచ్ లో ఉన్నాయి. అయితే కింద పేర్కొన్న విధంగా యాపిల్ 3 వాచ్ ను ఉపయోగించుకుంటే ఇంతకు మించిన ఫిట్ నెస్ గ్యాడ్జెట్ మరొకటి ఉండదేమో..

 

చందమామపై వొడాఫోన్ 4జీ నెట్‌వర్క్, ఇది నమ్మలేని నిజం !చందమామపై వొడాఫోన్ 4జీ నెట్‌వర్క్, ఇది నమ్మలేని నిజం !

మీ నిద్రలో భాగస్వామి..

మీ నిద్రలో భాగస్వామి..

ఒక మంచి నిద్ర అనేది ఆరోగ్యానికి తొలి మెట్టు. అదే నిద్రలేమి, లేదా సరైన నిద్ర పట్టకపోవడం అనేది ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. అంతేకాదు మీ రోజువారి జీవితాన్ని కూడా నిద్ర ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు మీకు రాత్రి నిద్ర పట్టకుండా కాసేపు మాత్రమే పడుకొని, మెలుకువ అనంతరం మీ డైలీ లైఫ్ స్టార్ట్ చేస్తే ఆ రోజంతా నిరాసక్తంగా గడుస్తుంది. అంతేకాదు మీ బ్లడ్ ప్రెజర్, జీర్ణశక్తిపై కూడా ప్రభావం చూపుతుంది.

మంచి నిద్రను పొందేందుకు

మంచి నిద్రను పొందేందుకు

మంచి నిద్రను పొందేందుకు యాపిల్ 3 స్మార్ట్ వాచ్ లో ప్రత్యేకమైన ఫీచర్లు లేకపోయినప్పటికీ ఇందులోని థర్డ్ పార్టీ స్లీప్ ట్రాకింగ్ యాప్స్ అయిన ఆటోస్లీప్, స్లీప్ ప్లస్ ప్లస్, పిల్లో లాంటివి అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా నిద్రతో పాటు మీ రెగ్యులర్ యాక్టివిటీని కూడా మానిటర్ చేయవచ్చు. ఈ చర్యల వల్ల సుఖనిద్రను పొందవచ్చు. కాస్త మీరు ఖర్చు పెట్టగలిగితే యాపిల్ లో మరింత అడ్వాన్స్ డ్ స్లీప్ ట్రాకర్స్ గా పేరొందిన యాపిల్ ఆక్విజిషన్ బెడిట్ లాంటివి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఇవి సుఖ నిద్రను పెంపొందించే సెన్సార్లుగా పనిచేస్తాయి.

మీ మార్గదర్శి
 

మీ మార్గదర్శి

సాధారణంగా ఇలాంటి గాడ్జెట్స్ జిమ్ లో ఎంతసేపు వర్కవుట్ చేశారు. ఎంత పల్స్ రేట్ పెరిగింది. అలాగే ఎన్ని కేలరీలు బర్న్ అయ్యాయి అనేది కేలిక్యులేట్ చేసి చెప్తాయి. ప్రతీ రోజులో కనీసం గంట సేపు వర్కవుట్ చేయాలనేది అందరూ చెప్పే విషయమే. అయితే అంతటితో సరిపోదు. మన బాడీలో మెటబాలిజం అనేది మన జీవన శైలి మార్పు ద్వారానే మారుతుంది. ఉదాహరణకు ఎక్కువగా కూర్చోడం వలన ఆయా ప్రదేశాల్లో కొవ్వు పేరుకుపోతుంది. అలాంటి ప్రాబ్లంకు కూడా యాపిల్ స్మార్ట్ వాచ్ పరిష్కారం చూపింది. ఇందులోని స్టాండ్ అనే ఆప్షన్ మనం ఎంతసేపు కూర్చున్నది, నిలబడింది లెక్కకడుతుంది. అంతే కాదు అదే పనిగా ఎక్కువ సేపు కూర్చుంటే ఇందులోని స్టాండ్ యాప్ మనల్ని కాసేపు నడవమని హెచ్చరిస్తుంది. అలాగే ఎంత సేపు నిలబడాలో యాప్ లోని బ్లూ రిమ్ మనకు లెక్కించి చెబుతుంది. కనీసం ఒక నిమిషం నిలబడమని స్టాండ్ ఆప్షన్ మనకు గుర్తు చేయడమే కాదు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఎంతసేపు నిలబడాలో స్మార్ట్ గా లెక్కించి రిమైండ్ చేస్తుంది.

 

 

కొవ్వు పెరిగిపోకుండా ..

కొవ్వు పెరిగిపోకుండా ..

దీని ద్వారా సీట్ భాగంలో కొవ్వు పెరిగిపోకుండా ఉండటమే కాదు, నడుము నొప్పి లాంటి దీర్ఘకాలిక సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అలాగే మీ పనిచేసే కార్యాలయంలోనే చిన్న పాటి వ్యాయామాలైన 5 నిమిషాల నడక, ఓ పది గుంజీలు, లేదా టీ, కాఫీ కోసం కాస్త దూరంగా వాక్ చేస్తూ వెళ్లడం, లిఫ్ట్ వాడకపోవడం, చిన్నపాటి స్ట్రెచెస్ లాంటివి ప్రయత్నం చేస్తే ఎంచక్కా ఫిట్ నెస్ మెయిన్ టెయిన్ చేయవచ్చు. ఇలాంటి చిన్నపాటి వ్యాయామాలకు యాపిల్ స్మార్ట్ వాచ్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది.

 

 

 మీ కేలరీలను లెక్కించుకోవడం ఇక సులువు

మీ కేలరీలను లెక్కించుకోవడం ఇక సులువు

యాపిల్ 3 స్మార్ట్ వాచ్‌లో ఉన్నమరో ప్రత్యేకత మీ కేలరీలను కరిగించుకోవడం ఎలాగో చూసుకోవచ్చు. ఇది అల్లాటప్పా కేలోరీ మీటర్ కాదు. ఖచ్చితత్వానికి పెద్ద పీట వేస్తూ తయారు చేసిన మీటర్ ఇది. సాధారణంగా కేలరీలు ఎంత కరిగాయో తెలుసుకోవాలంటే లేబోరేటరీ స్థాయిలోనే కచ్చితంగా వేల్యూలు రాబట్టగలం. ఉదాహరణకు మీరు 400 కేలరీలను ఖర్చు చేసారని తెలుపగానే, మీరు అంతే తాపత్రయంతో బర్గర్లను, డోనట్ లను లాగించడానికి గ్రీన్ సిగ్నల్ లభించింది అనుకుంటే పొరపాటే, ఇందులో వర్కవుట్స్ చేసేటప్పుడు ఎంత వరకూ కేలరీలు బర్న్ కావాలో అనాలిసిస్ చేస్తూనే, సాధారణ లైఫ్ లోనూ రోజువారి పనుల్లోనూ ఎన్ని కేలరీలు బర్న్ చేసుకోవచ్చో సూచిస్తుంది. ఫలితంగా కేలరీల వినియోగం అనే అంశంపై కచ్చితమైన కమాండ్స్ ను ఈ స్మార్ట్ వాచ్ మీకు అందిస్తుంది. ఏ పనికి ఎన్ని కేలరీలు కావాలి. ఎన్ని కేలరీలు తీసుకోవాలో కూడా సూచిస్తుంది.

 మీలో ఎవరు బాహుబలి ?

మీలో ఎవరు బాహుబలి ?

పోటీ తత్వం అనేది మనలో కసిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన పోటీ అనేది ఎప్పటికీ మంచిదే. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో మీకు పార్ట్ నర్ అనేవారు, ఉత్సాహం, ప్రోత్సాహం అందిస్తుంటారు. అయితే ప్రతీ సందర్భంలోనూ పార్ట్ నర్ మీకు లభించకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఈ షేరింగ్ యాప్ ఉపయోగపడుతుంది. ఇందులోని షేర్ ది లోడ్ ఆప్షన్ ద్వారా మీ సన్నిహితులకు మీ ఫిట్ నెస్ స్టేటస్ ను, వర్కవుట్ స్టేటస్ ను షేర్ చేసుకునే వీలుంది. ఉదాహరణకు మీరు ఓ రెండు కిలోమీటర్ల నడక లేద పరుగు ద్వారా ఓ వెయ్యి కేలరీలు బర్న్ చేసుకున్నారు అనుకుంటే, మీ వర్కవుట్ స్టేటస్ ను మీ మిత్రుడు, లేదా సన్నిహితుల స్మార్ట్ వాచ్ కు షేర్ ది లోడ్ ఆప్షన్ ద్వారా పంపవచ్చు. అప్పుడు వారు వర్కవుట్ స్టేటస్ చూసి మిమ్మల్ని బీట్ చేయాలనే ఉత్సాహం మొదలవుతుంది. వారు పంపిన స్టేటస్ చూసి మీకు కూడా మరింత ఉత్సాహం కలుగుతుంది. అప్పుడు మీకు పార్టనర్ లేరనే వెలితి తీరిపోతుంది. మేసచూసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే ఫిట్ నెస్ మెయిన్‌టెయిన్ చేయాలనే తపన పెరుగుతుందని తేల్చింది. భలే ఉంది కదూ..మరీ మీలో ఎవరు బాహుబలో తేల్చుకోండి మరీ..

 

 

గ్రీన్ సిగ్నల్ అంటే పరుగే పరుగు

గ్రీన్ సిగ్నల్ అంటే పరుగే పరుగు

ఈ ఫిచర్ లో మీరు ఓ ఎక్సర్ సైజ్ రింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో గ్రీన్ సర్కిల్ పెరిగింది అంటే మీరు యాక్టివిటీ పెంచాలి అని అర్థం. అదే గ్రీన్ రింగ్ తగ్గిపోతే మీ వేగం తగ్గించమని అర్థం. ఇందులో గ్రీన్ రింగ్ ఆధారంగానే మీ యాక్టివిటీ గోల్స్ ను నిర్ధారించుకోవచ్చు. ఈ గ్రీన్ రింగ్ ను మీరే సెట్ చేసుకునే వీలుంది. మీ సామర్థ్యాన్ని బట్టి ఆటోమేటిగ్గా కూడా సెట్ అయిపోతుంది. ఇలా మీ ఫిట్ నెస్ గోల్స్ సెట్ చేసుకోవచ్చు.

చిన్న టార్గెట్స్ పెద్ద ప్రయోజనం

చిన్న టార్గెట్స్ పెద్ద ప్రయోజనం

చిన్న చిన్న లక్ష్యాలే ఓ పెద్ద లక్ష్యాన్ని ఛేదించేందుకు దోహదపడతాయి. ఫిట్ నెస్ విషయంలోనూ ఇది నూటికి నూరుపాళ్లు అమలయ్యే సూత్రమనే చెప్పవచ్చు. మీ ఫిట్ నెస్ సామర్థ్యాలను పెంచుకునేందుకు చిన్నపాటి ఫిట్ నెస్ చాలెంజ్ లను ఏర్పాటు చేసుకునే యాప్స్ బోలేడు ఈ స్మార్ట్ వాచ్ లో అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు గంటకు వంద ఆడుగులు వేయడం, రెండు కిలో మీటర్ల నడక, డైటింగ్ చేయడం, తక్కువ కేలరీల ఫుడ్ తీసుకోవడం ఎక్సర్ సైజ్ రింగ్ లిమిట్ పెంచడం వంటి చిన్నపాటి ఛాలెంజెస్ సెట్ చేసుకొని పనిచేస్తే మీరు అనుకున్న ఫలితాన్ని సాధించవచ్చు.

 మీ గుండె లయను వింటారా ?

మీ గుండె లయను వింటారా ?

యాపిల్ వాచ్ ద్వారా హార్ట్ పల్స్ ట్రాకింగ్ అనేది అత్యంత అడ్వాన్స్ డ్ సిస్టంను డెవలప్ చేశారు. యాపిల్ హెల్త్ యాప్ ను మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకొని స్మార్ట్ వాచ్ కనెక్ట్ చేసుకుంటే మీ గుండె లయ ఎంత ఆరోగ్య వంతంగా పనిచేస్తుందో తెలుసుకోవచ్చు. ఈ పల్స్ ట్రాకింగ్ ద్వారా మీ హార్ట్ ఎలాంటి పొజిషన్ లో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మీ గుండె లయ ద్వారా ఎక్సర్‌సైజులు అలాగే వెయిట్ గెయిన్, లాస్ వర్క్ అవుట్స్ లో మీ కెపాసిటీ ఎంత పెంచుకోవచ్చో తెలుస్తుంది.

 

 

రెస్టింగ్ హార్ట్ రేట్

రెస్టింగ్ హార్ట్ రేట్

అంతే కాదు, స్ట్రావా, నైక్ ట్రైనింగ్ క్లబ్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా మరింత బెటర్ రిజల్ట్స్ కలిగి ఉన్న యాప్స్ పొందవచ్చు. అంతే కాదు ఈ యాప్స్ ద్వారా రెస్టింగ్ హార్ట్ రేట్ (నిద్రలో గుండె లయ) ఎంత మెయిన్ టెయిన్ అవుతుందో తెలుసుకోవచ్చు. మీరు రెస్ట్ తీసుకునే సమయంలో మీ రెస్టింగ్ హార్ట్ రేట్ తక్కువగా ఉండాలి. అది ఆరోగ్య వంతమైన సిగ్నల్ గా చెప్పుకోవచ్చు. అలాగే రెస్టింగ్ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంది అంటే అది అనారోగ్యానికి సిగ్నల్ గా చెప్పుకోవచ్చు. ఇలాంటి స్పెషల్ ఫీచర్ యాపిల్ స్మార్ట్ వాచ్ సొంతం.

ఫిట్ నెస్ ప్రోగ్రాంలో ..

ఫిట్ నెస్ ప్రోగ్రాంలో ..

ఇక చివరిగా కేవలం యాపిల్ స్మార్ట్ వాచ్ ద్వారా వెంటనే ఫలితాలు వస్తాయి అనుకోవడం పొరపాటు. యాపిల్ వాచ్ కేవలం మీ ఫిట్ నెస్ ప్రోగ్రాంలో అసిస్టెన్స్ ఇవ్వడంతో పాటు, మీ శరీర స్థితిని తెలుపుతుంది. దాన్ని బట్టి మీరు వర్కవుట్స్, హెల్తీ డైట్ ప్లాన్, దినసరి యాక్టివిటీ ప్లాన్ చేసుకోవాలే తప్ప స్మార్ట్ వాచ్ ఏదో అద్భుత దీపంలా పనిచేస్తుంది అనుకుంటే పొరపాటే..

Best Mobiles in India

English summary
7 ways to use your Apple Watch to get fit More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X