మీ స్మార్ట్‌ఫోన్ నీళ్లలో పడిందా ? అయితే ఈ టిప్స్ పాటించండి
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు ఉంటుంది . అయితే ఒక్కోసారి అనుకోకుండానో ,ఆజాగ్రత్తతోనో స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడిపోవటం జరుగుతుంటుంది.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు ఉంటుంది . అయితే ఒక్కోసారి అనుకోకుండానో ,ఆజాగ్రత్తతోనో స్మార్ట్ ఫోన్ నీళ్లలో పడిపోవటం జరుగుతుంటుంది. అలా నీళ్లలో పడిపోయినప్పుడు ఎం చేయాలో తెలియక కంగారు పడుతుంటారు.మరి కొంత మంది వారి తెలివితేటలు ఉపయోగిస్తూ హెయిర్ డ్రైయర్ తో ఫోన్ లో పడిన నీళ్లను ఆరబెట్టి మొబైల్ ను పూర్తిగా పాడు చేస్తుంటారు . చివరికి ఆ ఫోన్ మొబైల్ రిపేర్ స్టోర్ కు తీసుకొని వెళ్తుంటారు . ఈ శీర్షిక లో భాగంగా మొబైల్ నీళ్లలో పడిపోయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుపుతున్నాము ఆసక్తి ఉన్నవారు ఓ లుక్కేయండి.

హెయిర్ డ్రైయర్ తో ఫోన్ ను ఆరబెట్టకండి :
హెయిర్ డ్రైయర్ తో ఫోన్ ను ఆరబెట్టకండి ఎందుకంటే ఆ హెయిర్ డ్రైయర్ లో నుంచి వేడి ఎక్కువుగా వస్తూ ఉంటుంది ఆ వేడి ఎలక్ట్రానిక్ భాగాలను దెబ్బ తీసే ప్రమాదం ఉంది.

మీ ఫోన్ ను ప్లగ్ ఇన్ చేయకండి :
ఫోన్ నీళ్లలో పడ్డాక చార్జర్ తో ప్లగ్ ఇన్ చేయకండి ఎందుకంటే అది షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది.

Switchoff చేయండి :
మీ ఫోన్ నీళ్లలో పడిన వెంటనే దాన్ని తీసుకొని Switchoff చేయండి. ఎందుకంటే తడిగా ఉన్న మీ ఫోన్ మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ పని చేసిన కాసేపటికి Switchoff అయిపోతుంది.

శుభ్రాంగా తుడిచి షేక్ చేయండి:
మీ ఫోన్ ను Switchoff చేసాక డ్రై క్లాత్ తో ఫోన్ లోని పార్ట్స్ తీసి శుభ్రాంగ తుడిచి బాగా షేక్ చేయండి. షేక్ చేసాక టిష్యూ పేపర్ తో మరో సారి తుడవండి ఆ టిష్యూ పేపర్ మీ ఫోన్ కు ఉన్న తేమను పీల్ చేసుకుంటుంది

రైస్ బ్యాగ్ లో పెట్టండి:
మీ ఫోన్ కు ఉన్న తేమ అంత పోయాక ఫోన్ ను ఫుల్ గా ఉన్న రైస్ బ్యాగ్ లో పెట్టండి.

సూర్యకాంతి తగిలేలా పెట్టండి:
మీ ఫోన్ లోని తేమ పోవడానికి మీ ఫోన్ ను సూర్యకాంతి బాగా తగిలే దగ్గర కూడా పెట్టుకోవచ్చు.

బ్యాక్ అప్ చేసుకోండి:
మీ ఫోన్ Switchon అయిన వెంటనే మీ ఫోన్ లోని డేటాను బ్యాక్ అప్ చేసుకోండి ఎందుకంటే ఒక్కోసారి ఫోన్ Switchon అయిన కూడా కాసేపటికి తిరిగి switchoff అయిపోవచ్చు.


Click it and Unblock the Notifications








