8 బెస్ట్ వాట్సాప్ టిప్స్

Written By:

స్మార్ట్ మెసేజింగ్ విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీని సొంతం చేసుకున్న వాట్సాప్ సరికొత్త సంచలనాలతో దూసుకుపోతోంది. ఇందుకు కారణం ఈ యాప్ అందిస్తోన్న వేగవంతమైన సర్వీసులే. ఫోటో మొదలుకుని మ్యూజిక్ ఫైల్ వరకు ఏదైనా వాట్సాప్ ద్వారా క్షణాలో షేర్ చేసుకోవచ్చు.

8 బెస్ట్ వాట్సాప్ టిప్స్

ఆండ్రాయిడ్.. విండోస్.. ఐఓఎస్, ఇలా ఏ మోడల్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారైనా వాట్సాప్‌ను వినియోగించకుండా ఉండలేరు. సెప్టంబర్ 2015 లెక్కల ప్రకారం వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ల మంది యూజర్ బేస్‌ను కలిగి ఉంది. వాట్సాప్ అప్లికేషన్‌ను మరింత విజయవంతంగా వాడుకునేందకు 8 బెస్ట్ టిప్స్‌ను మీకు సూచిస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్‌సిమ్ కార్డ్

ఈ ప్రత్యేకమైన వాట్‌సిమ్ కార్డును పొందటం ద్వారా 140 దేశాల్లోని 400 మొబైల్ నెట్‌వ‌ర్క్‌లతో ఉన్న వాట్సాప్ యూజర్లతో కనెక్ట్ కావొచ్చు. ఈ సిమ్ ధర 11.60 డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.773). 

 

బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్ డెస్క్‌టాప్ నోటిఫికేషన్స్

క్రోమ్ ప్లగిన్‌ను ఇన్స్‌స్టాల్ చేసకోవటం ద్వారా మీ వాట్సాప్  అకౌంట్నో కు సంబంధించిన నోటిఫికేషన్‌‍లను డెస్క్‌టాప్ పై పొందవచ్చు. బ్రౌజర్ క్లోజ్ చేసి ఉన్నప్పటికి నోటిఫికేషన్ అలర్ట్స్ మీకు కనిపిస్తాయి. 

 

బెస్ట్ వాట్సాప్ టిప్స్

యాపిల్ ఐఓఎస్‌లో కొత్తగా క్విక్ రిప్లై ఫీచర్

యాపిల్ తన ఐఓఎస్ 8 ఆపరేటింగ్ సిస్టంలో క్విక్ రిప్లై ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్‌ను వాట్సాప్‌తో కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు.

 

బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్ విడ్జెట్

వాట్సాప్‌లోని కాంటాక్ట్స్‌కు షార్ట్ కట్ లను యాడ్ చేయాలని అనుకంటున్నారా..? 'Shortcut for WhatsApp Plus' అనే విడ్జెట్ సహాయంతో మీకు నచ్చిన వాట్సాప్ కాంటాక్ట్‌లను నోటిఫికేషన్ సెంటర్‌లో పిన్  చేసుకోవచ్చు.

 

బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్‌లో ఒకేసారి 10కి మించి ఎక్కువ ఫోటోలను పంపలేం. యాపిల్ ఐఫోన్ యూజర్లు వాట్సాప్ అన్‌లిమిటెడ్ మీడియా అనే యాప్‌‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా ఒకేసారి అన్‌లిమిటెడ్ ఫోటోలను చాట్‌లోని మిత్రులకు సెండ్ చేయవచ్చు.

బెస్ట్ వాట్సాప్ టిప్స్

మీ వాట్సాప్ నెంబర్ మార్చాలనుకుంటున్నారా..?

ఆండ్రాయిడ్ యూజర్లు మెనూ‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సాప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

యాపిల్ యూజర్లు అయితే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సాప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

 

బెస్ట్ వాట్సాప్ టిప్స్


మీ వాట్సాప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
8 Hidden WhatsApp Tricks That Every User Should Know [iPhone and Android]
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot