Just In
- 9 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 12 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 14 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Movies
Malikappuram Movie Review అయ్యప్పస్వామి ట్రావెలాగ్.. ఆకట్టుకొన్న దేవ నందా, ఉన్ని ముకుందన్
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఈ 8 సీక్రెట్లు గురించి తెలుసుకోవాల్సిందే
మొబైల్ ఫోన్ అనుభవాలను రోజురోజుకు మార్చేస్తున్న గూగుల్ ఆండ్రాయిడ్, రకరకాల ఆపరేటింగ్ సిస్టంలతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్నే శాసిస్తోంది. కప్ కేక్‌తో మొదలైన ఆండ్రాయిడ్ వోఎస్‌ల ప్రస్థానం అంచెలంచెలుగా ఎగబాకుతూ డోనట్, ఇక్లెయర్, ఫ్రోయో, జింజర్ బ్రెడ్, హనీకూంబ్, ఇస్‌క్రీమ్ శాండ్విచ్, జెల్లీబీన్, కిట్‌క్యాట్, లాలీపాప్, మార్ష్‌మల్లో, నౌగట్, ఓరియో, ఆండ్రాయిడ్ పీ ఇలా రకరకాల పేర్లతో విస్తరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ డివైస్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. అంతేకాకుండా వీటిలోని పలు రహస్య ఫీచర్లను వెలికితీయటం ద్వారా మీ ఫోన్‌కు మరింత బూస్టప్ లభిస్తుంది. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో దాగి ఉన్న 8 ఆసక్తికర ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

కేవలం కొంత మంది కాల్స్ మాత్రమే అటెండ్ చేయవచ్చు..
వాస్తవానికి మనం ఏదైన అర్జెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ను ‘Do not disturb' మోడ్లో ఉంచుతాం. అయితే ‘do not disturb' ఫీచర్ అనేది "Priority" ఓన్లీ మోడ్‌తో వస్తోందన్న విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ మోడ్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా సెలక్టెడ్ పీపుల్ నుంచి వచ్చే కాల్స్ మాత్రమే అటెండ్ చేసేలా సెట్టింగ్స్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు.

మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఫోన్ అన్ లాక్ అవ్వాలా..?
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేస్తోన్న స్మార్ట్‌లాక్ ఫీచర్ డివైస్‌లను మరింత స్మార్ట్‌గా లాక్ లేదా
అన్‌లాక్ చేస్తోంది. ఇలా కాకుండా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో దాగి ఉన్న మరో స్పెషల్ ఫీచర్‌తో మీరు ఇంట్లోకి వచ్చిన వెంటనే ఫోన్ ఆటోమెటిక్‌గా అన్‌లాక్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ పనిచేయాలంటే తప్పనిసరిగా జీపీఎస్ ఆన్ అయి ఉండాలి.

పర్సనలైజిడ్ యాడ్స్‌కు ‘నో’ చెప్పండిలా..
పర్సనలైజిడ్ యాడ్స్ అనేవి కొన్ని సందర్భాల్లో మనల్ని ఆందోళణకు గురిచేస్తుంటాయి. మన వ్యక్తిగత బ్రౌజింగ్ అలవాట్లను ఎవరైనా చూస్తున్నారా అన్న భావనను కలిగిస్తాయి. ఈ నేపథ్యంలో వీటికి స్వస్తి పలకాలనుకుంటున్నట్లయితే Settingsలోకి వెళ్లి -> Google -> Ads -> Enable ‘Opt out of Ads Personalizationను సెలక్ట్ చేసుకోవాటి.

హార్ట్‌రేట్‌ను ట్రాక్ చేసుకోవచ్చు..
మీ స్మార్ట్‌ఫోన్ ద్వారా హార్ట్‌రేట్‌ను మానిటర్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ‘Instant Heart Rate' అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ లాంచ్ అయిన తరువాత మీ ఇండెక్స్
ఫింగర్‌ను కెమెరా లెన్స్ పై ఉంచి మీ హార్డ్‌రేట్‌ను చెక్ చేసుకోండి.

స్ర్కీన్ మాగ్నిఫైర్‌ను ఉపయోగించుకోండి..
మీరు బలహీనమైన కంటిచూపును కలిగి ఉన్నట్లయితే స్ర్కీన్ మాగ్నిఫైర్‌ను ఉపయోగించుకోండి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవటం వల్ల సింగిల్ ఫింగర్‌తో స్ర్కీన్‌ను మాగ్నిఫై చేసుకోవచ్చు. స్ర్కీన్
మాగ్నిఫైర్‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "Settings"-> select " Accessibility"-> And then tap on "Magnification".

గెస్ట్ మోడ్‌లో ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుకోవటం ఎలా..?
కొన్ని సందర్భాల్లో మొహమాటం కొద్ది మన వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు గెస్ట్ మోడ్ పీచర్ ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. మీ ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను అవతలి వ్యక్తి కంట పడకుండా చర్యలు తీసుకుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గెస్ట్ మోడ్‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు.

మీ క్రోమ్ టాబ్‌లను ఫోన్‌లలో కాకుండా ఇతర డివైస్‌లలో యాక్సిస్ చేసుకోవటం ఎలా..?
ముందుగా మీ జీమెయిల్ ఐడీ నుంచి అన్ని డివైసుల్లోని క్రోమ్ బ్రౌజర్‌లలో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తరువాత ‘Recent tabs' ఆప్షన్‌లోకి వెళ్లి రీసెంట్‌గా ఓపెన్ చేయబడిన టాబ్స్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అవి ఓపెన్ అవుతాయి.

కళ్ల పై ఒత్తిడి పడకుండా ఉండాలంటే..?
రాత్రుళ్లు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నప్పుడు కళ్ల పై ఒత్తిడి పడకుండా ఉండాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి "Colour Inversion" ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470