మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

By Sivanjaneyulu
|

ముద్దుగా ల్యాపీ అని పిలవబడుతోన్నల్యాప్‌టాప్, పోర్టబుల్ కంప్యూటింగ్ అవసరాలను తీర్చటంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తోంది. ల్యాప్‌టాప్ డివైస్ లను అత్యధికంగా ఉపయోగించే వారిలో బిజినెస్ ప్రొఫెషనల్స్ తో పాటు స్టూడెంట్స్ ఉంటున్నారు.

 మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

డాక్యుమెంటేషన్, వీడియో ఎడిటింగ్ వంటి పనులు స్మార్ట్ ఫోన్ లలో కుదరకపోవటంతో ల్యాప్ టాప్ ల వినియోగం విస్తృతమైంది. కీలకమైన కంప్యూటింగ్ పనులు ల్యాప్‌టాప్ తో ముడిపడి ఉన్ననేపథ్యంలో ఈ డివైస్ ను జాగ్రత్తగా వాడుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ల్యాప్‌టాప్ పనితీరుతో పాటు లైఫ్ స్పాన్‌ను మరింతగా పెంచుకునేందుకు 8 ముఖ్యమైన చిట్కాలు...

Read More : 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ల్యాప్‌టాప్‌ను ఎప్పుడైన సరే స్థిరమైనా ఇంకా మృదువైన సర్‌ఫేస్ పై ఉంచండి. ఇలా చేయటం వల్ల ఎయిర్ ఫ్లో బాగా జరిగి హీటింగ్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ల్యాప్‌టాప్‌ను తమ ప్రైమరీ వర్క్ మీడియమ్‌గా ఎంచుకుంటున్నచాలా మంది యూజర్లు తమ డివైస్‌ను రోజుల తరబడి స్లీప్ మోడ్‌లో ఉంచేస్తుంటారు. కనీసం మూడు, నాలుగు రోజులకు ఒకసారైన ల్యాప్‌టాప్‌ను షట్‌డౌన్ చేయటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇలా చేయటం వల్ల క్యాచీ క్లియర్ అవటంతో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు ఇన్‌స్టాల్ అవుతాయి.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ల్యాప్‌టాప్‌ను డెస్క్‌టాప్‌ రీప్లేస్‌మెంట్‌గా భావిస్తున్న కొంత మంది యూజర్లు శక్తివంతమైన కాన్ఫిగరేషన్‌తో కూడిన తమ ల్యాప్‌టాప్‌లను తమ డెస్క్ టేబుల్ పై స్థిరంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ల్యాప్‌టాప్ ఛార్జింగ్ కేబుల్‌ను నిరంతరం పవర్ సాకెట్‌కు ఉంచేస్తున్నారు. ఇది మంచి ప్రక్రియ కాదంటున్నారు నిపుణులు. కనీసం రెండు, మూడు రోజులకు ఒకసారైన చార్జర్‌ను అన్‌ప్లగ్ చేయటం వల్ల ఇంటర్నల్ బ్యాటరీ పై ఆ ప్రభావం ఉండదట.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ల్యాప్‌టాప్‌‌లలో సెన్సిటివ్ డేటాను స్టోర్ చేస్తుంటాం. ఈ డేటాకు సెక్యూరిటీ చాలా అవసరం. కాబట్టి పటిష్టమైన పాస్‌వర్డ్ ఏర్పాటుతో పాటు ముఖ్యమైన ఫైల్స్‌కు ఎన్‌క్రిప్షన్‌ను ఏర్పాటు చేయండి.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్‌‌లోని వ్యక్తిగత అలానే వర్క్ రిలేటెడ్ డేటాకు బ్యాకప్ చాలా అవసరం. ఓ ఎక్స్‌టర్నల్ హార్డ్‌డ్రైవ్‌ను మీ వద్ద ఉంచుకుని తరచూ బ్యాకప్ నిర్వహించుకోవటం వల్ల ల్యాపీ పై ఒత్తిడిని తగ్గించవచ్చు.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

ల్యాప్‌టాప్‌ క్లీనింగ్ మీ దినచర్యలో ఓ భాగంగా ఉండేలా చూసుకోండి. మీ డివైస్‌ను ఎంత క్లీన్‌గా ఉంచుకుంటే అంత మంచిది. ల్యాపీ క్లీనింగ్‌లో భాగంగా కాటన్ స్వాబ్స్‌తో పాటు వ్యాక్యుమ్ క్లీనర్‌లను ఉపయోగించటం మంచిది. సర్వీసింగ్ చేయంచటం విస్మరించకండి.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

భారత్‌లోని 80 శాతం కంప్యూటర్ యూజర్లు పైరేట్ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించటం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఓ సర్వే తెలిపింది. కాబట్టి మీ ల్యాప్‌టాప్‌లో జెన్యున్ సాఫ్ట్‌వేర్‌లను మాత్రమే ఇన్‌స్టాల్ చేయండి.

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్ ఎక్కువ కాలం పనిచేయాలంటే..?

మీ ల్యాప్‌టాప్‌ను క్యారీ చేసేందుకు బ్రాండెడ్ స్టర్డీ బ్యాగ్ లేదా కేస్‌ను ఉపయోగించండి. ఇది మీ ల్యాపీని భౌతిక ప్రమాదాల నుంచి రక్షిస్తుంది.

Best Mobiles in India

English summary
8 Simple Hacks that will improve your Laptop Experience. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X