సింపుల్ ట్రిక్స్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఓ నిత్యావసర వస్తువుగా మారింది.

|

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో అది ఓ నిత్యావసర వస్తువుగా మారింది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఈ స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కోసం స్మార్ట్‌ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు బ్యాంకింగ్ సేవలు ఇతరత్రా లావాదేవీల కోసం స్మార్ట్‌ఫోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే అన్ని పనులకు ఈ స్మార్ట్‌ఫోన్లను వినియోగించడం వల్ల బ్యాటరీ అనేది తొందరగా అయిపోయి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ వాడకం వల్ల బ్యాటరీ త్వరగా అయిపోయి ఇతర పనులకు ఉపయోగించులేక సతమతమవుతుంటాం. అలా బ్యాటరీ త్వరగా అయిపోతుందని భావించేవారు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఛార్జింగ్ ని వీలైనంత ఎక్కువ సేపు ఉంచుకోవచ్చు.

మీ సీపీయూ పెద్ద శబ్దాలతో మొరాయిస్తోందా ?మీ సీపీయూ పెద్ద శబ్దాలతో మొరాయిస్తోందా ?

డిసేప్లే

డిసేప్లే

స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్ డిసేప్లేని కలర్‌ఫుల్‌ గా ఉంచడం, ఫోన్‌ స్క్రీన్‌పై అధిక బ్రైట్‌‌నెస్‌ ఉంచడం వల్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతూ ఉంటుంది. అందుకే మనకు కనిపించినంత మేర బ్రైట్‌నెస్‌ ఉంచుకోవడం వల్ల చార్జింగ్‌ ఆదా అవుతుంది.

డిస్‌ప్లే టైమ్‌

డిస్‌ప్లే టైమ్‌

ఫోన్‌లో డిస్‌ప్లే సమయం తగ్గించుకోవడం ద్వారా ఛార్జింగ్ పెంచుకోవచ్చు. అందుకే ప్రతిఒక్కరూ తమ ఫోన్‌ డిస్‌ప్లే టైమ్‌ను తగ్గించుకోవాలి. మహా అయితే 30సెకన్లు లోపు ఫోన్‌ స్క్రీన్ ఆగిపోయే విధంగా సెట్‌ చేసుకోవాలి.

బ్లూటూత్‌

బ్లూటూత్‌

బ్లూటూత్‌తో కూడా బ్యాటరీపై భారం పడుతుందనేది చాలా మందికి తెలియదు. అవసరం లేని సమయంలో బ్లూటూ త్‌ను ఆపితే ఎంతో మేలు.

వైఫై కనెక్షన్‌
 

వైఫై కనెక్షన్‌

వైఫై కనెక్షన్‌ లేని చోటఫోన్‌లో వైఫై ఆపేయాలి. లేకుంటే బ్యాటరీపై భారం పెరిగి చార్జింగ్‌ తగ్గిపోతుంది.వైఫై ఉన్నప్పుడు మాత్రమే మీరు వైఫై ఆన్ చేసుకుంటే బ్యాటరీ ఎక్కువ సేపు వచ్చే అవకాశం ఉంది.

జీపీఎస్‌

జీపీఎస్‌

అవసరం ఉన్నా లేకపోయినా చాలామంది ఫోన్‌లో జీపీఎస్‌ను స్క్రీన్‌పై సెట్‌చేసి ఉంచుతారు. పూర్తిస్థాయిలో జీపీఎస్‌ ఆన్‌లో ఉండడం వల్ల బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. అందుకే మనం ఏ ఏరియాలో ఉన్నమో తెలుసుకున్నాక దాన్ని ఆఫ్‌ చేస్తే బ్యాటరీ ఆదా అవుతుంది.

యాప్స్‌

యాప్స్‌

బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యాప్స్‌ను తొలగించాలి. ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగ్రామ్‌ వంటి వాటిని చెక్‌ చేసిన తర్వాత అలాగే వదిలేయకూడదు. వాటిని ఉపయోగించిన తర్వాత వెంటనే తొలగించాలి.

వైబ్రేషన్‌

వైబ్రేషన్‌

వైబ్రేషన్‌వల్ల కూడా ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్‌ తగ్గిపోనుంది. చాలామంది రింగ్‌టోన్‌ ఉన్న వైబ్రేషన్‌ను ఉంచుతారు. దీంతో కాల్‌ వచ్చిన వెంటనే ఫోన్‌ వైబ్రేషన్‌ ప్రారంభమవుతుంది. దీనివల్ల బ్యాటరీ బాగా ఖర్చవుతుంది. అందుకే రింగ్‌టోన్‌, లేదంటే వైబ్రేషన్‌ ఏదొకటి మాత్రమే వినియోగించడం ఉత్తమం.

పవర్‌ సేవింగ్‌ మోడ్‌

పవర్‌ సేవింగ్‌ మోడ్‌

చాలామంది స్మార్ట్‌ఫోన్లలో పవర్‌ సేవింగ్‌ మోడ్‌ ఆప్షన్‌ ఉంటుంది. అయితే సెల్‌ వినియోగిస్తున్న వారిలో 60శాతం మందికిపైగా అవగాహన లేదు. దీన్ని వినియోగించుకో గలిగితే అదనంగా రెండు గంటలు పాటు చార్జింగ్‌ను పొందొచ్చు.

 20నుంచి 30 శాతం బ్యాటరీ

20నుంచి 30 శాతం బ్యాటరీ

దీనిని ఆన్‌ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యాప్స్‌ ఆప్‌గ్రేడ్‌ కావడం స్క్రీన్‌ టైం తగ్గడం, స్క్రీన్‌పై ఉన్న యానిమేషన్స్‌ డిసేబుల్‌లోకి వెళ్లడం, వైబ్రేషన్‌ టర్న్‌ఆఫ్‌ కావడం వంటివి జరుగుతాయి. మొత్తంగా 20నుంచి 30 శాతం బ్యాటరీ ఆదా అవుతుంది.

Best Mobiles in India

English summary
here we have listed out some lesser known tricks that will help you get the most out of your smartphone battery more news at gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X