Just In
- 2 hrs ago
శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధరలు,స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
ధర రూ.16,000 లోపే మీరు కొనుగోలు చేయగల, 43 ఇంచుల స్మార్ట్ టీవీలు!
- 21 hrs ago
కొత్త బడ్జెట్ లో PAN కార్డు పై కొత్త రూల్స్! ఇకపై అన్ని డిజిటల్ KYC లకు PAN కార్డు చాలు!
- 24 hrs ago
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
Don't Miss
- News
Ajit Doval:అమెరికాలో ప్రధాని మోదీ ఆయుధం..!
- Sports
INDvsNZ : అదే నా కెప్టెన్సీ మంత్ర.. వాళ్ల వల్లే ఈ ట్రోఫీ: హార్దిక్ పాండ్యా
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Movies
Guppedantha Manasu: తండ్రి ముందే రిషితో వసుధార రొమాన్స్.. షాక్ అయిన కాలేజీ స్టాఫ్!
- Lifestyle
Chanakya Niti: మహిళలు ఈ విషయాలను ఎప్పటికీ ఎవరితో షేర్ చేసుకోవద్దు, అవేంటంటే..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
నెట్ బ్యాకింగ్ చేస్తున్నారా,ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే !
దేశంలో డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ను వినియోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్యాంకుల్లో నగదు నిల్వలు తక్కువ కావడంతో నేరుగా ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేయడానికే చాలామంది మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ బ్యాంకులన్నీ మొబైల్ బ్యాంకింగ్ కోసం ప్రత్యేకంగా యాప్స్‌ను రూపొందించి ఖాతాదారులకు అందుబాటులో కి తెచ్చాయి. అయితే ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ ద్వారా గా నీ మొబైల్ ద్వారా కానీ నెట్ బ్యాకింగ్‌ను ఉపయోగించే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓ సారి చూద్దాం.

షాపింగ్ సమయంలో
షాపింగ్‌లు చేసినప్పుడు కనబడిన ప్రతీ సైట్‌ల మీద లాగిన్ కాకుండా పేరొందిన వెబ్‌సైట్స్‌లోనే షాపింగ్ చేయడం మంచిది. ఏదైనా సైట్‌లో షాపింగ్ చేసినప్పుడు ఆ పేమెంట్ గేట్‌వేకి మనం వెళ్లిన తర్వాత బ్యాంక్‌లాగిన్, పాస్‌వర్డ్ వేసే ముందు ఆ సైట్ అడ్రస్ హెచ్‌టీటీపీ://లో మొదలవుతోందా లేదా అనేది చూసుకోవాలి. ఇలా లేకపోతే ఆ సైట్‌లో షాపింగ్ చేయకండి. అటువంటి సైట్స్ సేఫ్ కాదనేది గుర్తించుకోండి.

స్పామ్ కాల్స్
బ్యాంక్ వివరాలను తెలియజేయమని వచ్చే కాల్స్, ఈ -మెయిల్స్, ఎస్‌ఎంఎస్‌లకు స్పందించకండి. ఎందుకంటే బ్యాంక్ సంబంధించిన వారు అటువంటి వివరాలను అడగరు. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్‌లకు వాడే ఈ-మెయిల్స్, ఫోన్ నెంబర్లను ఎవరికీ చెప్పకుండా ఉండటం మంచిది.

బ్యాంక్ వెబ్‌సైట్
ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే సంబంధిత బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఇంటర్నెట్ బ్రౌజర్‌లో టైపు చేసి మాత్రమే ఓపెన్ చేయాలి. వేరే వెబ్‌సైట్లలో ఉండే లింక్‌ల ద్వారా ఓపెన్ చేస్తే బ్యాంక్ సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

పాస్‌వర్డ్
మొబైల్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డులను కనీసం మూడు నెలలకొకసారి అయినా మారుస్తుండాలి. ఎవరెనా మీ ఫోన్ నెటవర్క్ బాగాలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి అని చెబితే వెంటనే జాగ్రత్త పడండి. ఒక వేళ అటువంటి ఫోన్ కాల్స్ వస్తే అప్పుడు మీ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అకౌంట్లను లాక్ చేయండి. పాస్‌వర్డ్‌లు, ఈ-మెయిల్స్, మొబైల్ నెంబర్‌ను మార్చండి.

స్టేట్‌మెంట్స్
మీకు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను ఎప్పుడూ పరిశీలించుకోవాలి. ఎప్పటికప్పుడు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూసుకోవడం మంచిది. బ్యాంక్ గానీ మొబైల్ సేవలకు సం బంధించి ఎలాంటి అంతరాయమున్నా వాటిని గమనించినట్లయితే వెంటనే సంబంధిత కంపెనీని సంప్రదించి వివరాలు తెలుసుకోవడం మర్చిపోవద్దు.

ఈ-మెయిల్ లో వివరాలు వద్దు
కొన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్‌కి ఏటీ ఎంకి లింక్ పెడతాయి. ఇటువంటి పరిస్థితులలో ఏటీఎం కార్డుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే క్రెడిట్ కార్డు ఇతర బ్యాంకు వివరాలను ఈ-మెయిల్ ద్వారా పంపడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు.

పరిచయం లేని వ్యక్తుల సాయం వద్దు
ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు పరిచయం లేని వ్యక్తుల నుంచి సాయాన్ని కోరడం మంచిది కాదు. నెట్ బ్యాంకింగ్ చేస్తున్నారని తెలిసే కొందరు హెల్ప్ చేస్తామంటూ ముందుకొస్తారు. అటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

రక్షణ వ్యవస్థ
యాంటీ వైరస్ రక్షణ లేని పీసీలను నెట్ బ్యాంకింగ్‌లకు వాడకపోవడం మంచిది. ఎందుకంటే సరైన రక్షణ వ్యవస్థ లేని సిస్టమ్‌లను హ్యాకర్లు సులువుగా వారీ అధీనంలోకి తీసుకోగలరు. వాడుతున్న బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470