Just In
- 34 min ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 24 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
Don't Miss
- News
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ వర్సెస్ కశ్మీర్ ఫైల్స్ ప్రదర్శన
- Movies
Waltair Veerayya 2 Weeks Collections: చిరంజీవి మరో సెంచరీ.. 14వ రోజు అన్ని కోట్లు.. లాభం చూస్తే షాకే
- Sports
INDvsNZ : పృథ్వీ షాకు అవకాశం లేదు.. తేల్చి చెప్పిన మాజీ దిగ్గజం!
- Finance
Stock Market: బేజారులో దేశీయ స్టాక్ మార్కెట్లు.. అక్కడ అంతా బాగానే ఉన్నప్పటికీ.. ఎందుకిలా
- Automobiles
XUV400 EV బుకింగ్స్ ప్రారంభించిన మహీంద్రా.. బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా?
- Lifestyle
ఉస్త్రాసనం క్యామెల్ పోజ్: నడుముకు బలం చేకూర్చి శరీరానికి శక్తినిస్తుంది
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
ఫేస్‌బుక్‌లో ఈ సీక్రెట్ ఆప్సన్లు మీరు ఎప్పుడైనా గమనించారా..?
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. మరి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే వారు ఆ ఫోన్లో ముందుగా ఏమి చూస్తారు అనే దానికి అందరూ చెప్పే సమాధానం వాట్సప్, ఫేస్‌బుక్, మెసేంజర్ లాంటివేనని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే వీటిల్లో ముఖ్యంగా ఫేస్‌బుక్ అనేది చాలా పాపులర్ అయిపోయింది. అందులో రకరకాల మనస్తత్వాలు , వారి అభిప్రాయాలను గమనించవచ్చు. వాల్లో అనేక రకాల పోస్టులు పెడుతూ అలాగే ఇతర పోస్టులకు లైకులు, కామెంట్లు లాంటివి పెడుతూ గడిపేస్తారు. ఇదిలా ఉంటే అందులో మీకు తెలియని కొన్ని ఫీచర్లను అసలు గమనించరు. అవేంటో మీరే చూడండి.

Inbox messages
మీ ఇన్‌బాక్స్‌లో మీకు పరిచయం లేని ఒక ఆప్షన్ ఉంటుందని గమనించారా.. అదే ‘మెసేజ్ రిక్వెస్ట్స్'. మీ గ్రూపులో లేని గుర్తు తెలియని వ్యక్తులు మీకు పంపే మెసేజ్‌లను భద్రంగా ప్రత్యేక విభాగంలో ఉంచుతుంది. దానిపై క్లిక్ చేస్తే వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలో అన్ని మెసేజ్‌లను చూడొచ్చు. పంపిన వ్యక్తి మీకు తెలిసిన వారైతే మెసేజ్‌లు చదవడమే కాకుండా వారి ఛాట్ మెసెంజర్ ఆహ్వానాన్ని మన్నించొచ్చు.ఫేస్‌బుక్ ఇలాంటి మెసేజ్‌ల్లో కొన్నింటిని ఫిల్టర్ చేసి వేరుగా ఉంచుతుంది. వాటిని See Filtered Request ఆప్షన్‌పై క్లిక్ చేసి చూడొచ్చు.

Block option
FBలో గేమింగ్ నోటిఫికేషన్స్ విసిగిస్తుంటాయి. వాటిని బ్లాక్ చేయాలనుకుంటే మీరు అకౌంట్ సెట్టింగ్స్‌లోని ‘నోటిఫికేషన్స్' విభాగంలోకి అక్కడ వాటిని బ్లాక్ చేసుకోవచ్చు. అక్కడ On Facebook,App Requests and activity లాంటి వాటిని సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు దీన్నుంచి బబటపడవచ్చు.

సెర్చింజిన్
ఫేస్‌బుక్‌లో విలువైన సమాచారాన్ని పొందేందుకు ప్రత్యేక ఫ్లాట్‌ఫాం ఉంది. అదే ‘ఫేస్‌బుక్ గ్రాఫ్ సెర్చ్'. ఈ సర్వీసుని వాడుకునేందుకు ముందుగా మీరు అకౌంట్‌లో లాగిన్ అవ్వాలి. తర్వాత ఎఫ్‌బీ సెర్చ్‌బాక్స్‌లో Facebook Graph Search కీబోర్డ్‌ని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. దీంతో విభాగాల వారీగా గ్రాఫ్ సెర్చ్ కనిపిస్తుంది. ఈ ఫేస్‌బుక్ గ్రాఫ్ సెర్చ్‌ని www.facebook.com/graphsearcher/ యూఆర్‌ఎల్ లింక్ ద్వారా కూడా గ్రాఫ్ సెర్చ్‌ని పొందొచ్చు.

ఆల్బమ్ డౌన్‌లోడ్...
మీరు మీ ఫోటో ఆల్బమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే డౌన్‌లోడ్ చేయాల్సిన ఆల్బమ్‌ని సెలెక్ట్ చేసి, పక్కనే కనిపించే సెట్టింగ్స్ గుర్తుని క్లిక్ చేస్తే డ్రాప్‌డౌన్ మెనూ వస్తుంది. దాంట్లోని Download Album ఆప్షన్‌ని సెలెక్ట్ చేస్తే చాలు. చిటికెలో మొత్తం ఆల్బమ్‌ని జిఫ్ ఫార్మెట్‌లో సిద్ధం చేసి నోటిఫికేషన్ లింక్‌ని అందిస్తుంది. దానిపై క్లిక్ చేసి సిస్టంలో సేవ్ చేయవచ్చు. తర్వాత ఆల్బమ్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసి చూడడమే!

హిస్టరీ
మొత్తం ఫేస్‌బుక్ యాక్టివిటీని చూడాలా.. అయితే, ముందుగా ఫేస్‌బుక్‌లోకి లాగిన్ అవ్వండి. తర్వాత www.facebook.com/me/allactivity యూఆర్‌ఎల్ లింక్‌ని అడ్రస్‌బార్‌లపై టైప్ చేసి ఎంటర్ నొక్కండి. మొత్తం సెర్చ్ హిస్టరీ అంతా క్షణాల్లో ముందు ప్రత్యక్షమవుతుంది .ఒకవేళ మీరు పోస్ట్ చేసినవి మాత్రమే కావాలనుకుంటే అక్కడ కనిపించే సెర్చ్‌లో posts by me టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

అలర్ట్
మీ ఎఫ్‌బీ ఎకౌంట్‌ని మీరు తప్ప మరెవరైనా, మరేదైనా సిస్టంపై ఓపెన్ చేయకుండా ఉండేందుకు మీరు సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Login Alerts విభాగంలోని ఆప్షన్స్‌ని Get Notifications సెట్ చేసుకోండి. ఇతరులు ఎవరైనా వారి సిస్టంలో లాగిన్ అయితే చాలు. వెంటనే మెయిల్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది.

ఛాట్ సెట్టింగ్స్
మీరు ఆన్‌లైన్‌లో ఉన్న విషయం మీ స్నేహితులకు తెలియకూడదనుకుంటే ఛాట్ మెసేజర్ సైడ్‌బార్‌లోని సెట్టింగ్స్ గుర్తుపై క్లిక్ చేయండి. పాప్‌అప్ మెనూలో Advanced Settings ఆప్షన్‌ని క్లిక్ చేయండి. వచ్చిన విండోలోని Turn off chat for only some friends ఆప్షన్‌ని ఎనేబుల్ చేసి కిందే ఉన్న బాక్స్‌లో ప్రొఫైల్ పేర్లు ఎంటర్ చేస్తే చాలు. మీరు సెలెక్ట్ చేసిన వ్యక్తులకు ఎన్నడూ ఛాట్ మెసేంజర్‌లో కనిపించరు.

On this Day
మీరు ఎఫ్‌బీలోకి లాగిన్ అయ్యాక facebook.com/onthisday అని యూఆర్‌ఎల్‌ని టైప్ చేసి ఎంటర్ నొక్కడం ద్వారా మీరు ఆ గతంలో మీరు షేర్ చేసివన్నీ జాబితాగా వచ్చేస్తాయి. కావాలంటే వాటిని తిరిగి షేర్ చేయవచ్చు.

Legacy Contact
మీ తదనంతరం మీ ఎకౌంట్‌ని ఎవరు ఆపరేట్ చేయవచ్చో దీని ద్వారా చెప్పవచ్చు. సెట్టింగ్స్‌లోని ‘సెక్యూరిటీ' విభాగంలోకి వెళ్లి లెగసీ కాంటాక్ట్‌ని క్లిక్ చేసి, అక్కడ కనిపించే Choose a friend బాక్స్‌లో అకౌంట్ ఆపరేట్ చేసే వ్యక్తి పేరు టైప్ చేసి యాడ్ చేయాలి. మీరు పెట్టుకున్న లెగసీ కాంటాక్ట్ వివరాల్ని ప్రతి ఏడాది రివ్యూ చేసి మార్చుకునేలా Legacy Contact Annual Reminder సెట్ చేసి పెట్టుకోవచ్చు.

మొత్తం డేటా
ఎఫ్‌బీలో మీరు పోస్ట్ చేసిన ఫొటోలు, మెసేజ్‌లు, వీడియోలు, ఫ్రొఫైల్‌లోని సమాచారం... ఇలా మొత్తం డేటాని ఒకేసారి సిస్టంలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు హోం పేజీలోని సెట్టింగ్స్‌ని క్లిక్ చేయండి. వచ్చిన పేజీలోని Download a copy... లింక్‌పై క్లిక్ చేసి మొత్తం ఫేస్‌బుక్ డేటాని పొందొచ్చు. డేటాని పొందేందుకు ఎఫ్‌బీ ఎకౌంట్ పాస్‌వర్డ్‌ని ఎంటర్ చేయాలి. కొంత సమయం తర్వాత మెయిల్‌కి వచ్చిన డౌన్‌లోడ్ లింక్‌పై క్లిక్ చేసి డేటాని పొందొచ్చు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470