ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫాస్ట్‌గా టైపింగ్ చేయాలా, ఇలా చేయండి !

Written By:

ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ అనేది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరూ దానిమీదనే సగం జీవితాన్ని గడిపేస్తున్నారు. పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిదరపోయే వరకు ఫోన్ పక్కన ఉండాల్సిందే. ఉదయం ఎఫ్బిలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం అలాగే ట్విట్టర్లో పోస్టులు ,మిగతా సోషల్ మీడియాలో పోస్టులు ఇలా ఫోన్ తో చేస్తుంటారు...పోస్టులకు రిప్లయి ఇవ్వడం కూడా ఇందులో భాగమే..అయితే ఫోన్ నుంచి పోస్టులు గాని రిప్లయిలు కాని కామెంట్లు కాని ఇచ్చే సమయంలో మనకు ప్రధానంగా వచ్చే సమస్య టైపింగ్. ఒక్కోసారి వేగంగా టైప్ చేయలేకపోతుంటాం. రిప్లయిలు ఇవ్వలేము..అలాంటి సమయంలో మీరు ఈ కింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

ఈ సోప్ ఖరీదు ఐఫోన్ 8తో సమానం, జస్ట్ రూ. 55వేలు మాత్రమే, ఫ్లిప్‌కార్ట్ నుంచి డెలివరీ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Insert Emojis Faster Than Ever

మీరు ఎదైనా పోస్టుకి రిప్లయి ఇచ్చే సమయంలో మీరు ఏమనుకుంటున్నారో దానిని ఎమోజి ద్వారా ఇస్తే సరిపోతుంది. అనేక హావభావాలతో కూడిన ఎమోజీలు ఇప్పుడు మనకు లభిస్తున్నాయి. వీటిని వాడటం ద్వారా మీరు మీ సమయాన్ని అలాగే టైపింగ్ శ్రమని తగ్గించుకోవచ్చు.

Precise Control Over the On-Screen Cursor

మీరు టైపింగ్ చేసే సమయంలో ఒక్కోసారి కొన్ని రకాల తప్పులు దొర్లుతుంటాయి. దీనికి పుట్ స్టాప్ పెట్టేలా మీరు టైప్ చేయగానే దానికి సంబంధించిన అక్షరాలు మీ స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి. వాటిని సెలక్ట్ చేసి మీరు మీ సమస్యను అధిగమించవచ్చు.

Type Numbers and Special Characters Quickly

మీరు టైపింగ్ సమయంలో దానికి తగ్గట్లుగా స్పెషల్ క్యారక్టర్లను యూజ్ చేస్తే సమస్య కొంచెం సాల్వ్ అవుతుంది. ఈ సమస్యను మీరు జీ బోర్డ్ ద్వారా కూడా అధిగమించవచ్చు. మీ ఫోన్ నుంచి Gboard Settings > Preferences and enable Number rowని సెలక్ట్ చేసుకుంటే సరిపోతుంది.

Text Prediction and Personalized Suggestions

ఒక పదాన్ని మీరు టైప్ చేయగానే దానికి రిలేటెడ్ గా మీకు మరో పదం కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు టైపింగ్ వేగవంతం చేసుకునే అవకాశం ఉంటుంది. దీని కోసం మీరు Gboard Settings > Text correction and enable Next-word suggestions చేసుకుంటే సరిపోతుంది. అక్కడ కనిపించే వాటిని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Set Shortcuts to Expand Text Automatically

మీరు మీ పదాలను ఫాస్ట్ గా టైప్ చేయాలంటే ఎక్కువగా షార్ట్ కట్ పదాలను వాడితే సరిపోతుంది. అయితే ఇది కొన్నింటిలో మాత్రమే అందుబాటులో ఉంది.

Glide Typing

ఇది ఓ సింపుల్ ట్రిక్. దీని ద్వారా మీరు ఏ పదాన్ని అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ పదాలను టచ్ చేస్తే సరిపోతుంది. అయితే ఇందులో మిస్టేక్స్ వచ్చే ప్రమాదం ఉంది. పదం వచ్చిన తరువాత చూసి సెలక్ట్ చేసుకోవాలి.

Voice Typing

మీరు మీ కీ బోర్డ్ నుంచి వాయిస్ టైపింగ్ చేయడం ద్వారా కూడా మీరు వేగవంతంగా సమాధానం ఇచ్చే అవకాశం ఉంది. సంధర్బానికి తగ్గట్లుగా మీరు ఏదైనా మాట్లాడితే అది పదాల రూపంలో మీకు గూగుల్ అందిస్తుంది. ఇందుకోసం మీరు మీ ఫోన్ నుంచి ఈ కింది చిత్రంలో చూపినట్లుగా యాక్టివేట్ చేసుకోవాలి.

Other Android Keyboards

జీ బోర్డ్ మాత్రమే కాకుండా కొన్ని రకాల ఇతర కీ బోర్డులను ఉపయోగించి మీరు వేగవంతంగా టైప్ చేయవచ్చు. SwiftKey, Fleksy, Swype, Minuum లాంటి కీ బోర్డులు మీకోసం అందుబాటులో ఉన్నాయి.

Typing Games on Android

ఆండ్రాయిడ్ గేమ్స్ ఆడుతూ మీరు మీ టైపింగ్ వేగవంతం అయ్యేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ఆటల ద్వారా మీ టైపింగ్ స్పీడ్ పాస్ట్ అయ్యే అవకాశం ఉంది. ZType, Typing Master లాంటి గేమస్ మీ మెదడుకు పనిచెప్పి మీ టైపింగ్ వేగవంతం అయ్యేందుకు సాయపడతాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
9 Tips for Typing Faster on Your Android Phone more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot