Aadhaar authentication హిస్టరీని తనిఖీ చేయడం ఎలా?

|

ఆధార్ కార్డ్ అనేది గుర్తింపు కోసం ప్రతి పౌరునికి అవసరమైన ముఖ్యమైన డాక్యుమెంట్. ఇది అతి ముఖ్యమైన గుర్తింపు రుజువులలో ఒకటి. అన్ని ప్రభుత్వ పనులకు మరియు పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైనది. దాదాపు ప్రతిచోటా ఆధార్ నంబర్ అడుగుతున్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) జారీ చేసిన ఆధార్ కార్డులో పౌరుల బయోమెట్రిక్ మరియు జనాభా సమాచారం నమోదు చేయబడి ఉంటుంది. ప్రతి భారతీయుడి బ్యాంక్ అకౌంట్ వారి ఆధార్ కార్డుతో లింక్ చేయబడినందున డబ్బు లావాదేవీలకు కూడా దీనిని ఉపయోగించవచ్చు. అయితే ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్నందున ఆధార్ దుర్వినియోగం గురించి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. UIDAI వెబ్‌సైట్‌ని సందర్శించి గత ఆరు నెలల్లో మీ ఆధార్ యొక్క ప్రమాణీకరణను ఎక్కడ ఉపయోగించబడిందో మీరు తనిఖీ చేయవచ్చు. అది ఎలాగో తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

 
Aadhaar Card Authentication History Checking Process Step by Step

** మీ ఆధార్ ఎక్కడ ఉపయోగించబడిందో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఆధార్ ప్రామాణీకరణ హిస్టరీపై క్లిక్ చేయండి.

 

**ఇక్కడ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయండి.

** ఇప్పుడు జనరేట్ OTPపై క్లిక్ చేయండి. దీని తర్వాత మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.

** ఇప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పేజీ ఓపెన్ చేయబడుతుంది. ప్రమాణీకరణ రకాన్ని నమోదు చేయండి. తేదీ పరిధి, రికార్డుల సంఖ్య మరియు OTPని ఎంచుకోండి.

** ఇప్పుడు డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి ఆల్ ఆప్షన్స్ ఎంపికను ఎంచుకోండి.

Aadhaar Card Authentication History Checking Process Step by Step

** ఆ తర్వాత పేజీలో తేదీ పరిధిని ఎంచుకోండి.

** ఇక్కడ మీరు ఆరు నెలల క్రితం సమాచారాన్ని మాత్రమే సేకరించగలరు.

** ఇప్పుడు సబ్మిట్ బటన్‌ను నొక్కి, అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించండి.

** మీ ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగించారనే సమాచారం మీ ముందుకు వస్తుంది.

Best Mobiles in India

English summary
Aadhaar Card Authentication History Checking Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X