మీ SBI అకౌంట్‌కి ఆధార్ అనుసంధానం చేయండిలా..( సింపుల్ ట్రిక్స్ )

By Hazarath
|

దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఖాతాదారులు ఈ ఏడాది డిసెంబరు 31వతేదీలోగా తమ ఆధార్ నంబరును అనుసంధానించకుంటే ఖాతా లావాదేవీలను నిలిపివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఖాతాదారులు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంకు ఎనీవేర్ మొబైల్ యాప్, ఏటీఎం, బ్యాంకు బ్రాంచీల ద్వారా తమ ఆధార్ నంబరును అనుసంధానం చేసుకోవచ్చని ఎస్బీఐ అధికారులు చెప్పారు.

 

వాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్ చదవొచ్చు, ప్రయత్నించండివాట్సప్‌లో డిలీట్ చేసిన మెసేజ్ చదవొచ్చు, ప్రయత్నించండి

ఆన్‌లైన్ ద్వారా ఆధార్ నమోదు

ఆన్‌లైన్ ద్వారా ఆధార్ నమోదు

ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ క్లిక్ చేసి మీ యూజర్ నేమ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేశాక ఈ-సర్వీసుపై క్లిక్ చేయండి. అనంతరం ‘లింక్ యువర్ ఆధార్ నంబరు' లింక్ ను క్లిక్ చేసి ప్రొఫైల్ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయండి. అనంతరం ఆధార్ నంబరు ఎంటర్ చేస్తే మీ ఎస్బీఐ ఖాతాకు మీ ఆధార్ అనుసంధానం అవుతుంది.

ఎసెమ్మెస్ ద్వారా నమోదు

ఎసెమ్మెస్ ద్వారా నమోదు

మీ రిజిస్టర్ మొబైల్ నుంచి UID (space) Aadhaar number (space) Account number టైప్ చేస్తే మీకు ఓ మెసేజ్ వస్తుంది..అది వాలిడ్ అని ఉంటే మీ పని విజయవంతమయినట్లే..రిజిస్టర్ మొబైల్ నంబరు నుంచి మాత్రమే చేయాలి.

ఏటీమ్ ద్వారా నమోదు
 

ఏటీమ్ ద్వారా నమోదు

ఎస్ బిఐ ఏటీఎంలో మీ ఎటీఎం కార్డు స్వైప్ చేయగానే పిన్ అనే ఆప్సన్ వస్తుంది. అది ఎంటర్ చేసిన తరువాత "Service - Registrations"లో కెళ్లి Aadhaar Registration చేసుకోవచ్చు. అక్కడి మీకు వచ్చే సూచనలు ఫాలో కావాల్సి ఉంటుంది.

బ్రాంచ్ ల ద్వారా నమోదు

బ్రాంచ్ ల ద్వారా నమోదు

మీకు దగ్గరలో ఉన్న SBI బ్రాంచ్ కెళ్లి అక్కడ మీరు ఆధార్ కాపీ ఇస్తే సరిపోతుంది. అక్కడ ప్రాసెస్ పూర్తి కాగానే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.

Best Mobiles in India

English summary
Aadhaar Linking In SBI Accounts: How To Do It Online, Via SMS, ATM Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X