Home
How to

Aadhaar Update ఉచితంగా ఆధార్‌ కార్డును అ‌ప్‌డేట్‌ చేసుకొనేందుకు ఆఖరి ఛాన్స్‌.. ఎలా అప్‌డేట్‌ చేసుకోవాలంటే?

ఆధార్‌ కార్డులను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకొనే గడువును మార్చి 14వ తేదీ వరకు పొడిగిస్తూ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం డిసెంబర్ 15 తోనే ఈ గడువు ముగియగా.. గడువును పొడిగించింది. గడువులోగా ఆధార్‌ వివరాల్లోని పేరు, అడ్రస్ సహా ఇతర వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

గడువు ముగిసిన తర్వాత అంటే మార్చి 14వ తేదీ అనంతరం ఆధార్‌ కార్డులోని వివరాలను అప్‌డేట్‌ (Aadhaar Update 2024) చేసేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రాథమిక వివరాలతోపాటు అన్ని వివరాలను మార్చుకొనే అవకాశం కల్పిస్తున్నారు. మీరు గత పదేళ్లనాటి వివరాలతోనే ఆధార్‌ కార్డును వినియోగిస్తుంటే.. అడ్రస్‌ సహా ఇతర గుర్తింపు పత్రాలను కూడా అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

how to update aadhaar details for free

ప్రస్తుతం ఆధార్‌ కార్డు కేవలం గుర్తింపు కార్డుగానే కాకుండా అనేక నిత్యవసర సేవలు మరియు ఇతర ప్రయోజనాల కోసం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆర్థిక వ్యవహారాల నుంచి ప్రభుత్వ పరమైన ప్రయోజనాలు, ప్రభుత్వం నుంచి సహాయం చేసేందుకు ఆధార్ కార్డును ప్రాథమికంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఈ కారణంగా ఆధార్‌ కార్డులో సరైన వివరాలు ఉండడం తప్పనిసరి.

ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్‌ చేయాలి?
స్టెప్‌ 1 : తొలుత ఆధార్‌ వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ( https://myaadhaar.uidai.gov.in/ ) అనంతరం ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి.
స్టెప్‌ 2 : అనంతరం 'అప్‌డేట్‌ అడ్రస్‌'ను ఎంచుకోండి. మీ ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయబడిన మొబైల్‌ నంబర్‌కు వచ్చిన OTP ను అక్కడ నమోదు చేయండి.

how to update aadhaar details for free

స్టెప్‌ 3 : తర్వాత అక్కడ కనిపించిన 'డాక్యుమెంట్‌ అప్‌డేట్‌' వద్ద క్లిక్‌ చేసి, మీ వివరాలను తనిఖీ చేసుకోవాలి.
స్టెప్ 4 : అనంతరం అక్కడ మీ గుర్తింపునకు చెందిన డాక్యుమెంట్లు మరియు అడ్రస్‌కు సంబంధించిన డాక్యుమెంట్లను ఎంచుకొని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 5 : ఈ డాక్యుమెంట్లను అప్‌డేట్‌ చేసిన తర్వాత Submit బటన్‌ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఒక 14 అంకెల నంబర్‌ కనిపిస్తుంది. ఆ నంబర్‌ను వినియోగించి మీ ఆధార్‌ కార్డు వివరాల అప్‌డేట్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

ఆధార్‌ అప్‌డేట్‌ వలన ప్రయోజనాలు :
ఆధార్‌ కార్డులో మీ పూర్తి మరియు సరైన వివరాలు అప్‌డేట్‌ చేయడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలను ఎటువంటి అవాంతరాలు లేకుండా నేరుగా పొందవచ్చు. మరియు ప్రస్తుతం అనేక ఆర్థిక లావాదేవీలు సహా ఇతర ప్రయోజనాల కోసం ఆధార్‌ వివరాలనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందువల్ల ఆధార్‌లో సరైన మరియు అప్‌డేట్‌ చేయబడిన వివరాలు ఉండడం ఉపయోగకరం.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Aadhaar Update how to update aadhaar details for free before 14 march 2024 here are the steps
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X