Home
How to

AC కొనుగోలు చేస్తున్నారా.. 1 టన్ను లేదా 1.5 టన్ను ఏసీ సామర్థ్యాలు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..!

వేసవి వస్తుందంటే చాలా మంది AC ( ఎయిర్‌ కండిషనర్‌ ), ఎయిర్‌ కూలర్‌ లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. గత రెండు మూడు సంవత్సరాలుగా ఎండల తీవ్రగా అధికంగా ఉంటోంది. ఉక్కపోతతో అనేక మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉంటున్నాయి. గత సంవత్సరం భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఎంత సామర్థ్యం కలిగిన ఏసీని కొనుగోలు చేయాలి? :
ఈ సంవత్సరం కూడా ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇటీవల కాలంలో వడగాల్పులు హెచ్చరికలు కూడా జారీ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఏసీలు, ఎయిర్‌కూలర్‌ ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎంత సామర్థ్యం కలిగిన ఏసీని కొనుగోలు చేయాలనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

AC Buying Guide 1 ton or 1 5 Ton

1 టన్ను లేదా 1.5 టన్ను ఏసీల్లో ఏదీ బెస్ట్‌ :
1 టన్ను లేదా 1.5 టన్ను.. ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అయితే గది విస్తీర్ణం బట్టి ఏసీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మీకు సరిపోయే సామర్థ్యం కలిగిన ఏసీని ఎంచుకొనేందుకు ఈ కింది కథనాన్ని పూర్తిగా చదవండి.

1 టన్ను ఏసీ :
1 టన్ను సామర్థ్యం కలిగిన ఏసీలు చిన్న గదుల కోసం కొనుగోలు చేయాలి. ఈ AC యూనిట్‌ లు గంటకు 12000 BTU కూలింగ్‌ కెపాసిటీని కలిగి ఉంటాయి. మరియు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. తక్కువ విద్యుత్‌ ను ఉపయోగించుకుంటాయి.

ఒక టన్ను సామర్థ్యం కలిగిన ఏసీని చిన్న బెడ్‌ రూమ్స్‌, స్టడీ రూమ్స్‌ లో సరైన కూలింగ్‌ ను అందించగలుగుతాయి. 120 చదరపు అడుగల సామర్థ్యం కలిగిన గదుల్లో ఈ ఏసీలు సరైన పనితీరును అందిస్తాయి.

1.5 టన్ను AC :
150 నుంచి 200 చదరపు అడుగల విస్తీర్ణం కలిగిన గదుల్లో ఈ 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఏసీ లు సరైన పనితీరును కనబరుస్తాయి. గంటకు 18000 BTU ( బ్రిటిష్ థర్మల్‌ యూనిట్స్‌ ) కూలింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా గది ఉష్ణోగ్రత త్వరగా తగ్గుతుంది.

అయితే 1 టన్ను కంటే ఎక్కువ విద్యుత్‌ కావాల్సి ఉంటుంది. అయితే ఇన్వర్టర్‌ టెక్నాలజీ కారణంగా తక్కువ విద్యుత్‌ తోనే సక్రమంగా పనిచేస్తుంది. హాల్‌, పెద్ద గదులకు 1.5 టన్ను సామర్థ్యం కలిగిన ఏసీలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు 5 స్టార్‌ రేటింగ్‌ కలిగిన AC లు తక్కువ విద్యుత్‌ ను వినియోగించుకుంటాయి.

ఎప్పుడు కూడా AC కొనుగోలు చేసే సమయంలో గదుల విస్తీర్ణం బట్టి నిర్ణయం తీసుకోవాలి. మరియు ఇన్వర్టర్‌ టెక్నాలజీ కలిగిన AC లను కొనుగోలు చేయాలి. దీంతోపాటు బ్రాండ్‌, సర్వీసింగ్‌ కేంద్రాలు అందుబాటులో ఉండే సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదైనా సమస్య వస్తే తక్కువ ధర, తక్కువ సమయంలో మరమ్మతు చేసేందుకు అవకాశం ఉంటుంది.

AC కొనుగోలు సమయంలో తప్పులు చేస్తే :
సరైన ఎయిర్‌ కండిషనర్‌ ( AC ) ను ఎంచుకోకుంటే మాత్రం పెద్ద గదులకు కూలింగ్‌ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా ఎక్కువ విద్యుత్‌ బిల్లులు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సమయం పాటు వినియోగం కారణంగా త్వరగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.

FAQs
GizBot Technology

More from GizBot

Best Mobiles in India

English summary
AC Buying Guide 1 ton or 1.5 Ton how to choose best for your needs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X